ధర్మశాస్త్రమును పాించినచో

బలులను అర్పించినట్లే

35 1.      ధర్మశాస్త్రమును పాించినచో

                              చాల బలులు అర్పించినట్లే. 

                              దేవుని విధులను పాించినచో

               సమాధానబలిని అర్పించినట్లే.

2.           ఉపకారికినుపకారము చేయుట

               ధాన్యబలిని అర్పించుటవింది.

               పేదలకు దానముచేయుట

               స్తుతిబలిని అర్పించుట వింది.

3.           పాపమునుండి వైదొలగినచో

               ప్రభువు సంతసించును.

               కిల్బిషమును విడనాడుట

               ప్రాయశ్చిత్తబలిని అర్పించుటతో సమానము.

4.           వ్టి చేతులతో దేవునిసన్నిధిలోనికి రావలదు.

5.           ధర్మశాస్త్రమే కట్టడచేసెను

               కనుక బలులర్పింపవలెను.

6.           పుణ్యపురుషుడు బలిపశువు క్రొవ్వును పీఠముపై

               వేల్చినపుడు దాని సువాసన

               ప్రభువు సాన్నిధ్యమునకు ఎగసిపోవును.

7.            నిర్మలాత్ముడు అర్పించిన బలిని

               ప్రభువు అంగీకరించును.

               ఆయన దానిని విస్మరింపడు.

8.           ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము.

               నీ తొలిఫలములను అర్పించుటలో

               పిసినారివి కావలదు.

9.           చిరునవ్వుతో నీ కానుకలర్పింపుము. 

               సంతసముతో థాంశములనిమ్ము.

10.         మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును

               ఆయనకు ఇమ్ము.

               నీ శక్తికొలది ఉదారముగా ఇమ్ము.

11.           తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరించును.  ఆయన నీకు ఏడురెట్లు అదనముగా నిచ్చును.

దేవుడు న్యాయము పాించును

12.          దేవునికి లంచమిచ్చినను ఆయన అంగీకరింపడు

               అన్యాయముగా ఆర్జించిన దానిని

               ప్రభువునకు అర్పింపకుము.

               ఆయన న్యాయవంతుడు. పక్షపాతికాడు.

13.          ఆయన పేదలకు అన్యాయము చేయడు.

               బాధితుని మొరను అశ్రద్ధ చేయడు.

14.          అనాథ ప్రార్థనను అనాదరము చేయడు.

               వితంతువు వేడుకోలును పెడచెవిన పెట్టడు.

15.          వితంతువు నేత్రములవెంట కారు కన్నీరు

               ఆమెను పీడించిన వాని మీదకు నేరముతెచ్చి

               దేవునికి మొరపెట్టును.        

16.          హృదయపూర్వకముగా తనను సేవించువానిని

               ప్రభువు అంగీకరించును.

               అతని ప్రార్థనలు ఆకాశమున కెక్కిపోవును.

17.          దీనుని వేడుకోలు మేఘమండలమును

               దాిపోవును.

               మహోన్నతుని సమక్షముచేరి కాని అది ఆగదు.

18.          ప్రభువు జోక్యము చేసికొని దీనాత్మునికి

               న్యాయము దయజేసి

               దుష్టుని శిక్షించువరకును అది అతనిని వదలదు.

19.          ప్రభువు తామసింపడు.

               దుష్టులను సహించి ఊరకుండడు.

20.        ప్రభువు అన్యజాతులను రూపుమాపి

               వారిపై పగతీర్చుకొనును.

               నిర్దయులను అణగద్రొక్కును.

21.          గర్వాత్ములను నేల మీదినుండి పెరికివేయును.

               దుష్టుల పరిపాలనను అంతము చేయును.

22.        ఆయన ప్రతినరునికిని వానివాని తలపులు,

               పనులను బ్టి ప్రతిఫలమిచ్చును.

23.        ప్రభువు తన ప్రజలకు న్యాయము చేకూర్పగా

               వారు ఆయన కరుణను తలచుకొని

               సంతసింతురు.

24.         బెట్టలో వానమబ్బువలె ఆపత్కాలమున

               ప్రభువుకరుణ ఆనందము నొసగును.