నరజీవితము నికృష్టమైనది
40 1. ప్రతి నరుడును కష్టించి పనిచేయవలసినదే.
ప్రతి మనుజుని తలమీదను
పెద్దబరువు మోపబడియున్నది.
మాతృగర్భము నుండి ప్టుినది మొదలు
భూగర్భమును చేరువరకును నరునికి
ఈ భారము తప్పదు.
2. వారి సందిగ్ధతలు, వారి హృదయ భయాలు,
వారి ఆతురతతో కూడిన ఆలోచనలు
కలిగిన రోజు అది వారికి మరణదినము.
3. సింహాసనమును అధిష్టించు రాజునుండి
మ్టిలో పడి పొర్లాడు దరిద్రుని వరకును,
4. రాజ వస్త్రములను, కిరీటమును ధరించు ప్రభువు నుండి గోనెతాల్చు నిరుపేద వరకును,
5. నరులెల్లరు కోపము, అసూయ, విచారము,
సంక్షోభము, మృత్యుభయము, కలహము,
వైరము మొదలైనవానికి లోనగుదురు.
నరుడు రేయి నిద్రించునపుడు కూడ
పూర్వపు బాధలే నూత్నరీతిలో గోచరించును.
6. అతని కింకి కొంచెము కునుకు ప్టినదో లేదో
నిద్రలో పగిపూట కన్పించినట్లుగా
దృశ్యములు చూపట్టును.
అతడా ఘోరమైన దృశ్యములనుగాంచి భీతిజెందును
తాను యుద్ధమునుండి పరుగుతీయుచున్నట్లు
భావించును.
7. ఆ పరుగులో తాను సురక్షితస్థానమును
చేరినట్లు తలచును.
అంతలో మెలకువవచ్చి ఇకను
భయపడనక్కరలేదని ఎంచును.
8. శరీరధారులైన నరులు, మృగములు
మొదలైన జీవకోి కంతికిని,
పాపాత్ములకును ఏడురెట్లు అధికముగా పట్టు
దుర్గతులు ఏవనగా
9. మృత్యువు, హింస, కలహము, హత్య,
వినాశనము, క్షామము, దుఃఖము, మహమ్మారి.
10. ఈ అనర్థములన్నియు దుర్మార్గులకొరకే
కలిగింపబడినవి.
జలప్రళయము తెచ్చిప్టిెనది ఈ దుష్టులే.
11. జలమంతయు సముద్రమునకు
మరలిపోవునట్లుగా నేలనుండి
ప్టుినదంతయు నేలకు తిరిగిపోవును.
వివిధ సూక్తులు
12. లంచములు, అన్యాయములు అడుగంటును.
ధర్మము మాత్రమే శాశ్వతముగా నిలుచును.
13. దుర్మార్గుల సంపదలు నదివలె ఎండిపోవును.
గాలివానలో విన్పించు ఉరుములవలె
అంతరించును.
14. ఉదారముగా దానముచేయువాడు
సంతోషమును పొందును.
కాని దుర్మార్గుడు సర్వనాశనమగును.
15. భక్తిహీనుల తనయులకు పెద్ద కుటుంబములుండవు
వారు రాతిమీద మొలచిన
మొక్కలవలె క్షీణింతురు.
16. ఏి ఒడ్డున ఎదుగు తుంగలు
అన్ని మొక్కల కంటె ముందుగా కోసివేయబడినట్లే
వారును నాశనమగుదురు.
17. కాని కరుణ, భాగ్యవనము వింది.
దానము శాశ్వతముగా నిలుచును.
ఉపమానములు
18. సంపన్నుడుగా నుండుటయు, కూలి చేసికొని
బ్రతుకుటయు రెండును మంచివే.
కాని ఈ రెండింకంటెను
నిధిని పొందుట మెరుగు.
19. బిడ్డలవలనను, నగర నిర్మాణము వలనను
కీర్తి అబ్బును.
కాని ఈ రెండికంటెను విజ్ఞానార్జన శ్రేష్ఠమైనది.
పశుసంపద వలనను, తోటలపెంపకము
వలనను పేరు వచ్చును.
కాని ఈ రెండింకంటెను యోగ్యురాలైన
భార్య మెరుగు.
20. ద్రాక్షారసము, సంగీతము
ముదమును చేకూర్చును.
కాని ఈ రెండికంటెను విజ్ఞానప్రీతి మేలైనది.
21. పిల్లన గ్రోవి, సితారల వలన
చక్కని సంగీతము వెలువడును.
కాని ఈ రెండికంటెను సాదు కంఠము లెస్స.
22. అందము, ఆకర్షణము నేత్రములకు
ప్రీతిని కలిగించును.
కాని ఈ రెండికంటెను వసంతకాలపు
పచ్చని మొక్కలు మిన్న.
23. స్నేహితులు, ఇరుగుపొరుగు వారు
కలిసియున్నచో ముచ్చటగానుండును.
కాని ఆ ఇరువురికంటెను
భార్యాభర్తలు కలిసియుండుట మెరుగు.
24. ఆపదలలో తోబుట్టువులు సహాయులు
చెంతనున్న బాగుగా నుండును.
కాని దానధర్మములు చేయుటవలన సిద్ధించు సహాయము అంతకంటెను శ్రేష్ఠమైనది.
25. వెండిబంగారమువలన భద్రత చేకూరును.
కాని ఆ రెండికంటెను సదుపదేశము
మెరుగైనది.
26. ధనబలమువలన ఆత్మవిశ్వాసము కలుగును.
కాని ఆ రెండికంటెను దైవభీతిమేలు.
దైవభీతి కలవానికి వేరేమియు అక్కరలేదు.
ఇతర ఆధారములు ఏమియును
అవసరములేదు.
27. దైవభీతి పలులాభములొసగు
ఉద్యానవనమువింది.
దానిని మించిన సదాశ్రయము లేదు.
భిక్షము
28. కుమారా! ముష్టిఎత్తుకొని బ్రతుకవద్దు.
భిక్షమెత్తుటకంటె చావుమేలు.
29. కూికొరకు ఇతరులమీద ఆధారపడువాని
జీవితము అసలు జీవితమే కాదు.
అన్యులకూడు తినువాడు తనను తాను
మైలపరచుకొనును.
గౌరవమర్యాదలు కలవాడు అి్టపనికి పాల్పడడు.
30. సిగ్గుసెరము లేనివాడు బిచ్చమెత్తుకొనుట
మంచిదే అని చెప్పును.
కాని భిక్షము అతని కడుపునకు చిచ్చుపెట్టును.