మరణము
41 1. ఓ మృత్యువా! ఆస్తిపాస్తులతో హాయిగా
కాలము గడపువానికిని,
చీకు చింతలేక జీవించుచు,
అన్నిటను విజయము సాధించువానికిని,
కడుపునిండ తినగల శక్తి కలవానికిని,
నిన్ను గూర్చిన తలంపు ఎంత
దుఃఖకరమైనది!
2. పేదరికమున జీవించుచు రోగియై ఉన్నవాడు,
వృద్ధుడు, విచారగ్రస్తుడైౖ ఉన్నవాడును,
కోపమువలన సహనము కోల్పోయి ఉన్నవాడును
మృత్యువును ఆహ్వానించును.
3. కాని మృత్యుశాసనమునకు భయపడనక్కరలేదు.
నీ పూర్వులను, నీ తరువాతి వారిని
జ్ఞప్తికి తెచ్చుకొనుము.
4. ప్రభువు బ్రతికియున్న వారికందరికి మరణమను శిక్ష విధించెను.
మహోన్నతుని సంకల్పమును కాదనుటకు
నీవెవరివి? నీవు జీవించునది పదియేండ్లయినను
వందయేండ్లయినను, వెయ్యేండ్లయినను మృత్యులోక మున ఎవడును ప్టించుకొనడు.
దుష్టులకు పట్టు దుర్గతి
5. భక్తి ఇసుమంతలేని పాడుకొంపలలో పెరిగిన
దుర్మార్గుల బిడ్డలు రోతను ప్టుింతురు.
6. వారు తాము వారసత్వముగా పొందిన ఆస్తిని
కోల్పోవుదురు.
వారి బిడ్డలకును కలకాలము మచ్చతప్పదు.
7. భక్తిహీనుని బిడ్డలు మా అపకీర్తికి నీవే కారకుడవని
తమ తండ్రిని నిందింతురు.
8. భక్తిహీనుడా! నీవు దేవుని ధర్మశాస్త్రమును
విడనాడితివి, కనుక నీకు వినాశనము తప్పదు.
9. నీవు జన్మించినపుడే శాపగ్రస్తుడవైతివి.
చనిపోవునపుడును నీకు శాపము తప్పదు.
10. నేలనుండి ప్టుినది నేలకే తిరిగిపోవును.
భక్తిహీనులు అడపొడ కానరాకుండ పోవుదురు.
11. నరులు చనిపోయిన వారి కొరకు విలపింతురు.
కాని దుర్మార్గుల మరణానంతరము
వారి పేరుకూడ మిగులదు.
12. నీ కీర్తిని నిలబెట్టుకొనుము.
నీవు గతించిన పిదపకూడ నీ మంచిపేరు
నిలిచి యుండును.
అది వేయిసువర్ణ నిధులకంటెను
ఎక్కువకాలము మనును.
13. నరుని మంచి జీవితము కొన్నాళ్ళపాటు మాత్రమే
కొనసాగును.
కాని అతని సత్కీర్తి శాశ్వతముగా నిలుచును.
సిగ్గుపడవలసిన విషయములు
14. బిడ్డలారా! నా ఉపదేశమును పాించి
శాంతినిపొందుడు.
విజ్ఞానమును, నిధిని దాచియుంచినచో
ఎి్ట ప్రయోజనము లేదు.
15. విజ్ఞానమును దాచియుంచువానికంటె
మూర్ఖతను దాచియుంచువాడు మెరుగు.
16. నేను పేర్కొను సందర్భములలో మాత్రము
సిగ్గును పాింపుడు.
అన్ని రకములైన సిగ్గులు మంచివికావు.
అన్ని సందర్భములలో సిగ్గుపడనక్కరలేదు.
17. కామప్రవర్తనమును గూర్చి మీ తల్లిదండ్రుల
ఎదుటయు, బొంకులాడుటను గూర్చి,
రాజులు ప్రముఖుల ఎదుటయు సిగ్గుపడుడు.
18. అట్లే దుష్కార్యముల గూర్చి,
న్యాయాధిపతి ఎదుటయు,
చట్టమును మీరుట గూర్చి
న్యాయసభ ఎదుటయు, వంచనముగూర్చి
మిత్రుడు లేక భాగస్వామి ఎదుటయు,
19. దొంగతనముగూర్చి తోడి వారి ఎదుటయు,
భోజనపుబల్ల మీద మోచేతులానించుట గూర్చియు
పిసినిగొట్టుతనముతో దానము చేయకుండుట గూర్చియు
దేవుని సత్యనిబంధనము ఎదుటను సిగ్గుపడుడు.
20. ఇంకను మీకు నమస్కరించిన వారికి
ప్రతి నమస్కారము చేయకుండుట గూర్చియు,
వేశ్యవైపు గుడ్లప్పగించి చూచుట గూర్చియు,
21. బంధువు ప్రార్థనను ఆలింపకుండుట గూర్చియు,
ఇతరునికి ముట్టవలసినది
మీరు క్టొివేయుటనుగూర్చియు,
పరుని భార్యమీద కన్నువేయుటను గూర్చియు,
22. అన్యుని దాసిని వలచుట, ఆమె పడకచెంతకు
వెళ్ళుట గూర్చియు,
మిత్రుని అవమానించుట గూర్చియు,
దానముచేసి విమర్శించుటగూర్చియు,
రహస్యములను వెల్లడి చేయుటనుగూర్చియు
సిగ్గుపడుడు.
23. ఇి్ట సందర్భములలో సిగ్గుపడుట సబబు.
ఇట్లు చేసినచో ప్రజలు మిమ్ము మెచ్చుకొందురు.