ఏలీయా

48 1.      అటుపిమ్మట ఏలీయా

                              నిప్పుమంటవలె పొడచూపెను,

                              అతని పలుకులు దివిీవలె మండెను.

2.           అతడు కరువును కలిగించెను.

               అతని పట్టుదలవలన చాలమంది

               అసువులు కోల్పోయిరి.

3.           ఆ భక్తుడు దేవునిపేర ప్రవచించి

               వర్షము నాపివేసెను.

               మూడుమారులు అగ్నిని  కురిపించెను.

4.           ఏలియా! నీ అద్భుతములు ఎంత

               ఆశ్యర్యకరమైనవి!

               అి్ట కార్యములను ఇతరులెవరైన చేయగలరా?   

5.           ప్రభువు పేరు మీదుగా నీవు

               చచ్చిన శవమును బ్రతికించితివి.

               పాతాళమునుండి అతనిని

               వెలుపలికి కొనివచ్చితివి

6.           నీవు రాజులను, సుప్రసిద్ధులను

               మంచము ప్టించితివి.

               వారిని వ్యాధిగ్రస్తులను కావించి,

               మరణము పాలుచేసితివి.

7.            సీనాయి కొండమీద నీవు

               ప్రభువు మందలింపులను ఆలించితివి.

               ఆయన శత్రువులను శిక్షించునని చెప్పిన

               మాటలను వింవి.

8.           ఆ శిక్షను నిర్వహించుటకు

               ఒక రాజును అభిషేకించితివి.

               నీ అనుయాయులుగా ప్రవక్తలను అభిషేకించితివి

9.           దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో,

               నిప్పు గుఱ్ఱములు లాగెడి రథమున

               మేఘములలోనికి గొనిపోయెను.

10.         నీవు నిర్ణీతసమయమున తిరిగివచ్చి

               హెచ్చరికలు చేసెదవనియు,

               దేవునికోపము ప్రజ్వరిల్లకముందే

               దానిని చల్లార్చెదవనియు,

               తండ్రులకు, కుమారులకు రాజీ కుదిర్చెదవనియు

               యిస్రాయేలుతెగలను ఉద్ధరించెదవనియు

               లేఖనములు నుడువుచున్నవి.

11.           నీ ఆగమనమును దర్శించువారును,

               ప్రేమతో జీవించి చనిపోవువారును ధన్యులు.

               మనముకూడా జీవనమును పొందుదుము.

ఎలీషా

12.          ఏలీయా సుడిగాలిలో కలిసిపోగా

               అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను.         

               ఎలీషా జీవించినంతకాలము ఏ రాజును

               అతనిని భయపెట్టజాలడయ్యెను.

               ఎవరు అతనిని లొంగదీసికొనజాలరైరి.

13.          ఎి్ట కార్యమును అతనికి కష్టమనిపించలేదు.

               చనిపోయినపిదప గూడ

               అతని దేహము అద్భుతముచేసెను.

14.          జీవించియున్నపుడు అతడు అద్భుతములు చేసెను

               చనిపోయినపుడు కూడ మహిమలు ప్రదర్శించెను.

అవిశ్వాసము, శిక్ష

15.          ఇన్ని కార్యములు జరిగినను

               ప్రజలు పశ్చాత్తాపపడలేదు.

               తమ పాపములను విడనాడనులేదు.

               కనుక శత్రువులు వారిని సొంతదేశము నుండి

               గిెంవేసి నేల నాలుగుమూలల చెల్లాచెదరుచేసిరి

               కనుక వారు స్వీయదేశమున కొద్దిమందిమాత్రమే

               మిగిలిరి.

               ఆ కొద్దిమందిని దావీదు వంశజులు పరిపాలించిరి

16.          ఆ ప్రజలలో కొందరు దేవునికి ప్రీతికలిగించు

               కార్యములు చేసిరి.

               ఇతరులు పాపము మూటకట్టుకొనిరి.

హిజ్కియా

17.          హిజ్కియా నగరమును సురక్షితము చేసి

               నీిని సరఫరా చేయించెను.

               ఇనుప పనిముట్లతో కొండలో

               సొరంగము తొలిపించి నీిని నిలువచేయుటకు

               చిన్నచెరువులు నిర్మించెను.

18.          అతని పరిపాలన కాలమున

               సెన్హెరీబు పట్టణము మీదికి ఎత్తివచ్చి

               తన ప్రధానోద్యోగిని పంపించెను.

               ఆ ఉద్యోగి యెరూషలేమును సవాలుచేసి,

               పొగరుబోతు తనముతో డంభములు పలికెను.

19.          ప్రజలు ధైర్యముకోల్పోయి, భయకంపితులై

               ప్రసవ వేదనను అనుభవించు స్త్రీవలె వేదనపడిరి.

20.        కాని వారు చేతులెత్తి కరుణాళుడైన

               దేవుని ప్రార్థించిరి.

               పవిత్రుడైన ప్రభువు ఆకాశము నుండి

               సత్వరమే వారి మొరను ఆలించెను.

               వారిని కాపాడుటకుగాను యెషయాను పంపెను

21.          ప్రభువు అస్సిరీయుల సైన్యమును శిక్షించెను.

               అతని దూత వారిని సర్వనాశనము చేసెను.

యెషయా

22.        హిజ్కియా ప్రభువునకు ప్రీతిగొల్పు

               కార్యములు చేసెను.

               తన వంశకర్తయైన దావీదు మార్గమున నడచెను.

               ప్రవక్త యెషయా ఆ రాజును

               అటు నడువ ఆజ్ఞాపించెను.

               ఆ మహా ప్రవక్త చూచిన దర్శనములు         సత్యములు.   

23.        ఆ ప్రవక్త సూర్యుని వెనుకకు పంపెను.

               రాజు ఆయుస్సును పొడిగించెను.

24.         అతడు దివ్యదృష్టితో భవిష్యత్తు సంఘటనలను గాంచి

               యెరూషలేమున దుఃఖితులైయున్న

               వారిని ఓదార్చెను.

25.        అతడు యుగాంతమునకు ముందు

               జరుగబోవు సంగతులు ఎరిగించెను.

               అంతవరకును జరుగక నిగూఢముగా ఉన్న

               కార్యములను తెలియజేసెను.