యోషీయా
49 1. యోషీయా పేరు నేర్పుతో తయారు చేసిన
సాంబ్రాణి నుండి వెలువడు పొగవలె
కమ్మగా నుండును.
తేనెవలె తీయగా నుండును.
ద్రాక్షసారాయపు విందునందలి
సంగీతమువలె మధురముగా నుండును.
2. అతడు దీక్షతో కృషిచేసి
ప్రజల బుద్ధులు మార్చెను.
ఘోరాచారమైన విగ్రహారాధనను రూపుమాపెను.
3. ప్రభువు నకు నమ్మదగిన బంటయి,
విశ్వాసము లేశమైన లేని రోజులలో
భక్తిని పెంపొందించెను.
చివరి రాజులు, ప్రవక్తలు
4. దావీదు, హిజ్కియా, యోషీయా తప్ప మిగిలిన
రాజులెల్లరును ఘోరపాపములు చేసిరి.
మహోన్నతుని ధర్మశాస్త్రమును అశ్రద్ధ చేసిరి.
కనుకనే ఆ రాజులెల్లరు అంతరించిరి.
5. ఆ రాజులు అన్యజాతులకు లొంగిపోగా
వారి కీర్తిప్రతిష్ఠలు వమ్మయిపోయెను.
6. అన్యులు పవిత్రనగరమును తగులబెట్టగా
వీధులు నిర్మానుష్యమయ్యెను.
ఈ సంఘటనను యిర్మీయా ముందే
ప్రవచించెను.
7. ప్రభువు యిర్మీయాను మాతృగర్భమునుండే
ప్రవక్తగా ఎన్నుకొనినను ప్రజలు
అతనిని హింసించిరి.
పెరికివేయుటకును, నాశనము చేయుటకును,
నిర్మూలించుటకును, పునర్నిర్మించుటకును,
నాటుటకుగూడ ప్రభువు అతనిని నియమించెను.
8. దేవదూతలతో గూడిన రథముమీద
నెలకొనియున్న ప్రభువు మహిమను
యెహెజ్కేలు దర్శనమున వీక్షించెను.
9. ప్రభువు తన శత్రువులను
వడగండ్లవానకు అప్పగించెను.
కాని ఋజుమార్గమున నడుచువారికి మేలుచేసెను
10. ద్వాథప్రవక్తల అస్థికలు
నూత్నజీవముతో లేచునుగాక!
వారు యిస్రాయేలీయులను ఉత్సాహపరచిరి.
నమ్మకమును, విశ్వాసమును ప్టుించి
జనులను కాపాడిరి.
సెరుబ్బాబెలు, యెహోషువ
11. సెరుబ్బాబెలును ఎట్లు సన్నుతింపగలము?
అతడు ప్రభువు కుడిహస్తముననొప్పు
ముద్రాంగుళీకము వింవాడు.
12. యెహోసాదాకు పుత్రుడు యెహోషువయు అి్టవాడే
వారు ప్రభువు పవిత్రమందిరమును పునర్నిర్మించిరి
అది శాశ్వతమైన కీర్తికి నోచుకొనిన ఆలయము.
నెహెమ్యా
13. నెహెమ్యా పేరుకూడ గొప్పదే.
అతడు శిథిలమైపోయిన
నగర ప్రాకారములు పునర్నిర్మించెను.
ద్వారములు నిర్మించి వానికి గడెలు ప్టిెంచెను.
నాశనమైపోయిన మన గృహములనుకూడా
మరల క్టించెను.
పితరులు
14. ఈ భూమి మీద సృజింపబడినవారిలో హనోకుతో
సమానమైనవాడు లేడు.
ప్రభువు అతనిని నేలమీదినుండి కొనిపోయెను.
15. లోకములో జన్మించిన వారిలో
యోసేపు వింవాడులేడు.
అతడు తన సోదరులకు నాయకుడు,
తన ప్రజలకు ఆదరువు.
అతని అస్థులకు కూడ కీర్తి అబ్బెను.
16. షేము, సేతు కీర్తిని పొందిరి.
కాని ఆదాము కీర్తి ఏ నరునికిని అబ్బలేదు.