గ్రంథ నామము

1 1. బెన్యామీను మండలములోని అనాతోతు  గ్రామ మునకు చెందిన యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడగు యిర్మీయా వాక్కులివి.

2. ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజైన పిమ్మట పదమూడవయేట ప్రభువు యిర్మీయాకు తన వాక్కు వినిపించెను.

3. యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజుగా వున్నకాలమున కూడ ప్రభువు తన వాక్కును యిర్మీయాకు విన్పించెను. అటుతరువాత యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైనపిమ్మట పదునొకండవఏి చివరి వరకును ప్రభువు తన వాక్కును అతనికి విన్పించు చునేయుండెను. ఆ పదునొకండవయేడు ఐదవ మాసమున యెరూషలేము పౌరులను బందీలనుగా గొనిపోయిరి.

యూదా యెరూషలేములకు ప్రతికూలముగా ప్రవచనములు

యోషీయా కాలమునకు చెందిన ప్రవచనములు

యిర్మీయాకు పిలుపు

4.           ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

5.           ”నిన్ను మాతృగర్భమున

               రూపొందింపకమునుపే

               నేను నిన్ను ఎన్నుకొింని.

               నీవు పుట్టకమునుపే నిన్ను పవిత్రపరచితిని.

               నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని.”

6.           నేను ”యావేప్రభూ!

               నాకెట్లు మ్లాడవలయునో తెలియదు.

               నేను బాలుడను” అని పలికితిని

7.            కాని ప్రభువు నాతో ఇట్లు నుడివెను:

               ”నీవు నేను బాలుడనని చెప్పవలదు.

               నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను.

               నేను చెప్పుమనిన సంగతులెల్ల

               వారికి చెప్పవలెను.

               నేను నీకు తోడుగానుండి

               నిన్ను కాపాడుచుందును.

8.           నీవు వారికి భయపడనక్కరలేదు.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.”

9.           అంతట ప్రభువు చేయిచాచి

               నా నోిని తాకి నాతో ఇట్లనెను:

               ”ఇదిగో! నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను.

10.         ఈ దినము జాతులమీదను, రాజ్యములమీదను

               నేను నీకు అధికారమొసగితిని.

               నీవు వానిని పెల్లగించుటకును,

               కూలద్రోయుటకును, నాశనము చేయుటకును,

               పడగొట్టుటకును, పునర్నిర్మించుటకును, నాటుటకును సమర్థుడవగుదువు.”

రెండు దర్శనములు

11. ప్రభువు నాకు తన వాక్కును విన్పించుచు ”యిర్మీయా! నీకేమి కనిపించుచున్నది?” అని అడిగెను. నేను ”బాదముచెట్టు1 కొమ్మ కనిపించుచున్నది” అని పలికితిని.

12. ప్రభువు ”నీవు బాగుగనే కనిప్టిెతివి. నేను కూడ నా పలుకులను నెరవేర్చుటకు కాచుకొని యున్నాను” అని చెప్పెను.

13. రెండవమారు ప్రభువు నాకు తనవాక్కును విన్పించుచు ”నీకేమి కనిపించుచున్నది?” అని అడి గెను. నేను ”కాగుచున్న కుండ కనిపించుచున్నది. అది ఉత్తరదిక్కునకు తిరిగియున్నది” అని అంిని.

14. అప్పుడు ప్రభువు ఇట్లనెను:

”ఈ దేశమున వసించువారిని తెగార్చుటకు

ఉత్తరదిక్కునుండి

వినాశము కుతకుత కాగుచున్నది.

15.          నేను ఉత్తరదిక్కున గల జాతులన్నిని పిలుతును.

               వాని రాజులు వచ్చి

               యెరూషలేము ద్వారములయెదుటను,

               దాని ప్రాకారములచుట్టును,

               యూదా నగరములచుట్టును

               తమ సింహాసనములను అమర్చుకొందురు.

16.          నా ప్రజల పాపములకుగాను

               నేను వారిని శిక్షింతును.

               వారు నన్ను విడనాడి

               అన్యదైవములకు బలులు అర్పించిరి.

               తాము స్వయముగా మలచిన

               బొమ్మలను పూజించిరి.

17.          కనుక నీవు నడుముకట్టుకొని నిలువబడి,

               నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వారితో చెప్పుము.

               నీవు వారిని చూచి భయపడవలదు.

               నేను వారియెదుట నీకు భయము ప్టుింతును.

18.          యూదారాజులును, నాయకులును,

               యాజకులును, ప్రజలును,

               ఈ దేశీయులు అందరును నిన్ను ఎదిరింతురు.

               కాని నేను నిన్ను ఈ దినమున

               సురక్షితనగరమువలెను, ఇనుప స్తంభమువలెను,

               ఇత్తడితలుపువలెను చేసెదను.

19.          వారు నీతో పోరాడుదురు

               కాని నీమీద విజయము సాధింపజాలరు.

               నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు.”