పరివర్తన గీతము

3 1. ప్రభువు  నాకు  తన  వాక్కును ఇట్లు వినిపించెను: ”ఎవడైనను తన భార్యను పరిత్యజింపగా

               ఆమె మరియొకనిని పెండ్లియాడెనేని,

               మొదివాడు ఆమెను మరల స్వీకరించునా?

               స్వీకరించెనేని దేశము అపవిత్రమగును.

               కాని అనేక ప్రేమికులతో వ్యభిచరించిన

               మీరు నావద్దకు తిరిగిరమ్మని

               ప్రభువు పిలుచుచున్నాడు.

               ఇది ప్రభువు వాక్కు.

2.           పర్వతాగ్రములవైపు చూడుడు.

               అందు మీరు వేశ్యలుగా శయనింపని

               తావు ఎందైనా కలదా?

               అరబ్బు దేశీయుడు ఎడారిలో

               కాచియుండునట్లుగా మీరును త్రోవప్రక్కన

               విటులకొరకు కాచుకొనియుండిరి.

               మీ దుష్కార్యములతోను వ్యభిచారములతోను మీరు దేశమును భ్రష్టము చేసితిరి.

3.           కావుననే వానలు కురియలేదు.

               వసంతఋతు వర్షములు ఆగిపోయినవి.

               మీరు వేశ్యలవలె కన్పించుటకు జంకరైతిరి.

               మీకు సిగ్గుసెరము లేదు.

4.           కాని మీరిప్పుడు ‘నీవు మాకు తండ్రివి.

               మా చిన్న నాినుండి నీవు మమ్ము వలచితివి.

5.           నీవు మామీద దీర్ఘకాలము కోపపడవు.

               మా మీద నిరంతరము ఆగ్రహము చెందవు’

               అని పలుకుచున్నారు. ఇట్లు పలుకుచునే

               మీ పాపములను మీరు చేయుచున్నారు.”

ఉత్తరరాజ్యపు యిస్రాయేలీయులు పశ్చాత్తాపపడవలెను

6. యోషీయా రాజు పరిపాలనాకాలమున ప్రభువు నాతో ఇట్లనెను: ”విశ్వాసఘాతకురాలైన యిస్రాయేలు ఏమి చేసినదో నీవు చూచితివా? ఆమె ప్రతి కొండకొమ్ము మీదికెక్కిపోయి ప్రతిపచ్చని చెట్టుక్రింద రంకాడెను.

7. ‘ఈ కార్యము చేసిన పిదపనైన ఆమె నా చెంతకు తిరిగి వచ్చును’ అని నేను భావించితిని. కాని రాలేదు. విశ్వాసఘాతకురాలగు ఆమె సోదరి యూదా ఆమె చేయు పనులను చూచెను.

8. నేను నా నుండి వైదొలగిన యిస్రాయేలును పరిత్యజించి ఆమె రంకు లకు గాను ఆమెకు పరిత్యాగ పత్రికను ఇచ్చుటను యూదా చూచెను. కాని యిస్రాయేలు సోదరియు, విశ్వాసఘాతకురాలునైౖన యూదా ఏ మాత్రము భయ పడక తానును వేశ్యఅయ్యెను.

9. ఆమె సిగ్గుసెరము లేక రంకాడి దేశమును అమంగళము చేసెను. ఆమె రాతిబండలతోను, కొయ్యదిమ్మలతోను వ్యభిచరించెను.

10. ఇంత చేసిన పిదపగూడ యిస్రాయేలు సోదరియు, విశ్వాసఘాతకురాలునైన యూదా నా చెంతకు తిరిగి వచ్చుచున్నట్లు నించెనేగాని యథార్థముగా తిరిగి రాలేదు.” ఇది ప్రభుడనైన నా వాక్కు .

11. మరియు ప్రభువు నాతో ఇట్లు అనెను: ”యిస్రాయేలు నానుండి వైదొలగినను విశ్వాసఘాతకు రాలైన యూదాకంటే ఆమెయే మెరుగు.

12. కావున నీవు వెళ్ళి ఉత్తరదిక్కుననున్న యిస్రాయేలునకు ఇట్లు బోధింపుము.

               విశ్వాసఘాతకురాలవైన యిస్రాయేలూ!

               నీవు నా చెంతకు మరలిరమ్ము.

               నేను కరుణాళుడను. కనుక నీపై ఇక కోపింపను.

               నీమీద నిరంతరము ఆగ్రహము చెందను.

13.          నీవు నీ తప్పు ఒప్పుకొనుము.

               నీవు ప్రభుడనైన నా మీద

               తిరుగబడితివని ఒప్పుకొనుము.

               నీవు నా మాటవినక ప్రతిపచ్చనిచెట్టు క్రింద

               అన్యదైవములతో క్రీడించితివని అంగీకరింపుము”

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

మెస్సియా వచ్చు కాలమున సియోను స్థితి

14. విశ్వాసఘాతకులైన ప్రజలారా! మీరు నా చెంతకు మరలిరండు. మీకు యజమానుడను నేనే. నేను ప్రతి పట్టణమునుండియు మీలో ఒకనిని, ప్రతి కుటుంబము నుండియు మీలో ఇద్దరిని ఎన్నుకొని వారిని సియోను కొండకు గొనివత్తును.

15. ‘నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకులనుగా నియమింతును. వారు వివేక విజ్ఞానములతో మిమ్ము పాలింతురు.

16. మీరు దేశమున బహుళ సంఖ్యా కులుగా విస్తరిల్లినపిదప జనులలో ఎవ్వరును ”ప్రభువు నిబంధనమందసమును” గూర్చి ప్రస్తావింపరు. వారు దానిని గూర్చి ఆలోచింపరు. దానిని జ్ఞప్తికితెచ్చుకొనరు. సందర్శింపరు. మరల క్రొత్తమందసమును  చేసికొంద మని అనుకొనరు.

17. ఆ కాలము వచ్చినపుడు, యెరూషలేమును ప్రభువు సింహాసనమని పిలుతురు. జాతులెల్ల అచట ప్రోగై నన్ను ఆరాధించును. ఆ ప్రజలిక మొండితనముతో తమ దుష్టాలోచనల ప్రకారము తాము నడచుకొనరు.

18. ఆ కాలమున యిస్రాయేలు యూదాతో ఐక్యమగును. ఆ రెండు దేశముల ప్రజల ప్రవాసము ముగించుకొని ఉత్తరదిక్కున నున్న దేశమునుండి తిరిగివచ్చి నేను పితరులకు భుక్తము చేసిన నేలను చేరుకొందురు.

పశ్చాత్తాపము

19.          ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               ” ‘నేను మిమ్ము

               నా తనయులనుగా చేసికోవలెనని ఎంచితిని.

               ప్రపంచములోని దేశములన్నిలోను

               సుందరమైనదియు, ఆహ్లాదకరమైనదియును

               అగు దేశమును మీకొసగవలెనని కోరుకొింని.

               మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలచుచు నిరతము

               నా వెంటరావలెనని అభిలషించితిని.

20. కాని భార్య భర్తకు ద్రోహము చేసినట్లే

               మీరును నాకు ద్రోహము చేసితిరి.’

               ప్రభుడనైన నా వాక్కు ఇది.

21.          కొండకొమ్ములమీద

               శోకాలాపములు వినిపించుచున్నవి.

               అవి యిస్రాయేలీయుల ఏడుపులు, మనవులు.

               వారు దుష్టమార్గముప్టి

               ప్రభువును విస్మరించినందులకుగాను

               విలపించుచున్నారు.

22. ద్రోహులై వైదొలగినవారలారా! తిరిగిరండు.

               నేను మీకు చికిత్సచేసి

               మిమ్ము విశ్వాసపాత్రులుగా చేయుదుననగా,

               మీరు ఇట్లు అనుచున్నారు:

               ”ప్రభూ! మేము నీ చెంతకు వచ్చుచున్నాము.

               నీవే మాకు దేవుడవు.

23.        కొండకొమ్ముల మీద

               పూజలు చేయుటవలన లాభములేదు.

               పర్వతాగ్రములమీద అరచుటవలన ఫలితములేదు

               మా దేవుడవు ప్రభుడవునైన

               నీ నుండియేగాని మాకు రక్షణము లభింపదు.

24.         లజ్జాపూరితమైన బాలుదేవతను కొలుచుటవలన

               మా పశులమందలను, కుమారులను,

               కుమార్తెలను కోల్పోవలసి వచ్చినది.

               పూర్వము నుండియు మా పూర్వులు కూడబ్టెిన

               వానినన్నిని పోగొట్టుకోవలసివచ్చినది.

25.        మేము అవమానమను పడకపై పరుండి

               సిగ్గను దుప్పిని కప్పుకోవలసి వచ్చినది.

               మేమును, మా పితరులును పూర్వమునుండియు

               నీకు ద్రోహము చేయుచునే ఉంిమి.

               నీ ఆజ్ఞలను పాింపమైతిమి.”