శత్రువులు యెరూషలేమును చుట్టుముట్టుట
6 1. బెన్యామీనీయులారా!
యెరూషలేమునుండి పారిపొండు.
రక్షణస్థలమును వెదకుకొనుడు.
తెకోవా నగరమున బాకానూదుడు.
బేత్‌హక్కెరెమున సంజ్ఞగా
నిప్పుమంట వేయుడు.
ఉత్తరదిక్కునుండి కీడును,
ఘోరవిపత్తును వచ్చుచున్నవి.
2. సియోను నగరము సుందరమైనది.
కాని దాని వినాశము చేరువలోనే ఉన్నది.
3. కాపరులు తమ సైన్యములతో వచ్చి
ఆ నగరముచుట్టును శిబిరములుపన్నుదురు. ఎవరికి నచ్చినచోట వారు
గుడారములు వేసికొందురు.
4. ఆ రాజులు ఇట్లు చెప్పుకొందురు
”మనము నగరముపైకి యుద్ధమునకు పోవుదము
మిట్టమధ్యాహ్నము దానిని ముట్టడింతము.” ”కాని ఇప్పికే చాల జాగైనది,
ప్రొద్దువాలుచున్నది.
సాయంకాలపు నీడలు
పొడుగుగా కనిపించుచున్నవి.”
5. ”కనుక రేయి ముట్టడి ప్రారంభించి నగరము లోని కోటలను ధ్వంసము చేయుదము.”
6. సైన్యములకు అధిపతియైన ప్రభువు
ఆ జాతులతో ఇట్లు చెప్పెను:
”మీరు చెట్లను నరికివేయుడు.
యెరూషలేమును ముట్టడించుటకు
మ్టిదిబ్బలు పోయుడు.
నగరము పరపీడనముతో నిండియున్నది.
కనుక నేను దానిని శిక్షింతును.
7. బావిలో నిరంతరము జలము ఊరునట్లే,
యెరూషలేమున నిరంతరము
దుష్టత్వము ఊరుచున్నది.
అది దౌర్జన్యమునకును, దోపిడికిని
ఆలవాలమై ఉన్నది.
నాకు కన్పించునవెల్ల రోగములు,
గాయములు మాత్రమే.
8. యెరూషలేము పౌరులారా!
మీరు ఈ హెచ్చరికలు గైకొనుడు.
లేదేని నేను మిమ్ము పరిత్యజింతును.
నేను మీ పురమును ఎడారి కావింతును.
ఇక అచట ఎవడును వసింపడు.”
యిస్రాయేలీయుల తిరుగుబాటు
9. సైన్యములకధిపతియైన ప్రభువు నాతో ఇట్లనెను:
”ద్రాక్షతోటలో పరిగెలేరినట్లే శత్రువులు
యిస్రాయేలీయులలో పరిగెలు ఏరుదురు.
నీవు చివరిసారిగా వారిలో
నీకు చేతనయిన వారిని రక్షింపుము.”
10. కాని నేనిట్లింని: నేనెవరికి చెప్పగలను?
నా హెచ్చరికలను ఎవరు పాింతురు?
వారికి విను సంస్కారములేదు, వారు వినరు,
నా మాటలను వారు లెక్కచేయరు.
నీ పలుకులు వారికి రుచింపవు.
11. ప్రభూ! వారిపై నీకు గలకోపము
నా గుండెలోను రగుల్కొనుచున్నది.
నేనిక దానిని భరింపజాలను.
ప్రభువు ఇట్లు అనెను:
”నీవు ఆ కోపమును వీధిలోని పిల్లలమీదను,
యువజన సమావేశములమీదను కుమ్మరింపుము
శత్రువులు వచ్చి భార్య భర్తలను గొనిపోవుదురు.
గడ్డములు నెరసిన వారిని,
పండుముదుసలులను గూడ విడచిపెట్టరు.
12. వారి గృహములు, భూములు,
భార్యలు అన్యుల హస్తగతమగుదురు.
నేనీ దేశమునందలి ప్రజలను శిక్షింతును.”
ఇది ప్రభువు వాక్కు.
13. ”అల్పులు, అధికులుకూడ
అన్యాయమునకు పాల్పడుచున్నారు.
ప్రవక్తలు, యాజకులుకూడ
వంచనకు ఒడిగట్టుచున్నారు.
14. వారు నా ప్రజల గాయములను
ప్టించుకొనుటలేదు.
ఎల్లరును కుశలముగా లేకున్నను,
ఎల్లరును ‘కుశలముగా, శాంతిగా’ ఉన్నారని
పలుకుచున్నారు.
15. ఇి్ట హేయమైన కార్యములు చేసినందుకు
వారు సిగ్గుపడిరా? లేదు,
అసలు వారికి సిగ్గుపడుటకూడ చేతకాదు.
కనుక పూర్వము నా శిక్షకు లోనైనవారు కూలినట్లే
వారును కూలుదురు.
నేను దండింపగా వారు నేలకొరుగుదురు.”
ఇది ప్రభువు వాక్కు.
16. ప్రభువు తన ప్రజలతో ఇట్లనెను:
”మీరు నాలుగు త్రోవలు కలియుచోట
నిలుచుండి పురాతనమార్గమేది?
అని ప్రజలను అడుగుడు.
సత్పథమేది? అని ప్రశ్నింపుడు, దానిలో నడువుడు
కాని ప్రజలు ఆ మార్గమున నడుచుకొనము’
అనుచున్నారు.
17. అంతట ప్రభువు
కావలివారిని నియమించి ప్రజలతో
‘మీరు వారి బూరధ్వనిని ఆలింపుడు’ అని చెప్పెను
కాని ప్రజలు ‘మేము ఆలింపము’ అనిరి.
18. కనుక ప్రభువు ఇట్లనెను: జాతులారా!
మీరు నా పలుకులు ఆలింపుడు.
బృందములారా!
నా ప్రజలకేమి జరుగునో తెలిసికొనుడు.
19. భూమీ వినుము!
నా ప్రజల దుష్కార్యములకుగాను
నేను వారిని నాశనము చేయబోవుచున్నాను.
వారు నా పలుకులు ఆలింపరైరి.
నా ఉపదేశములను పెడచెవిని ప్టిెరి.
20. వారు షేబానుండి
నాకు సాంబ్రాణిని గొనివచ్చిననేమి?
దూరదేశమునుండి
సుగంథద్రవ్యములను గొనివచ్చిననేమి?
వారి దహనబలులను నేను అంగీకరింపను.
వారి అర్పణలు నాకు ప్రీతిని కలిగింపవు.
21. కావున ‘నేను ఈ ప్రజల బాటలో
అడ్డురాళ్ళు వేయుదును.
వారు వానిని తట్టుకొని పడిపోవుదురు.
తండ్రులు కుమారులు, మిత్రులు,
ఇరుగుపొరుగు వారెల్లరును చత్తురు.”
ఉత్తరదిక్కునుండి దాడి
22. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు:
”ఉత్తరదేశమునుండి ఒకజాతి వచ్చుచున్నది.
దూరప్రాంతమునుండి ఒక మహాజాతి
యుద్ధమునకు సన్నద్ధమగుచున్నది.
23. ఆ జాతి ప్రజలు విల్లులను, కత్తులను చేప్టిరి.
వారు క్రూరహృదయులు, నిర్దయులు.
ఆ ప్రజలు గుఱ్ఱములపై ఎక్కి వచ్చుచుండగా
సాగరము ఘోషించునట్లుగా ఉండును.
వారు యెరూషలేమును ముట్టడింతురు.”
24. యెరూషలేముపౌరులు ఇట్లందురు.
మేమావార్త వింమి, మా చేతులు చచ్చుపడినవి.
మేము భయభ్రాంతులమైతిమి.
ప్రసవవేదనను అనుభవించు స్త్రీవలె
వేదననొందితిమి.
25. పొలమునకు పోవుటకుగాని, మార్గములలో
నడచుటకుగాని మాకు ధైర్యములేదు.
శత్రువులు కత్తితో కాచుకొనిఉన్నారు.
ఎల్లయెడల భయము ఆవహించి ఉన్నది.
26. ప్రభువు తన ప్రజలతో ఇట్లనును:
మీరు గోనెతాల్చి బూడిదలో పొర్లాడుడు.
ఏకైక కుమారుని కోల్పోయినవారివలె
తీవ్రదుఃఖముతో శోకాలాపము చేయుడు.
మిమ్ము నాశనము చేయువాడు
దిఢీలున వచ్చి మీ మీదపడును.
27. యిర్మీయా! ”నీవు లోహపరీక్షకునివలె
నా ప్రజలను పరీక్షించి,
వార్టిెవారో తెలిసికొనుము.
28. వారు తిరుగుబాటు చేయువారు.
ఇత్తడివలెను, ఇనుమువలెను కఠినమనస్కులు,
దుష్టవర్తనులు, పుకార్లు ప్టుించువారు.
29. కొలిమితిత్తులు గాలిని ఊదుచున్నవి,
కొలిమిమండుచున్నది.
కాని వెండినుండి చిట్టెముకరిగి
వెలుపలికి వచ్చుటలేదు.
ఈ ప్రజలను పుటమువేయుట నిష్ప్రయోజనము.
వీరిలో దుష్టులను వేరుచేయుట పొసగకున్నది.
30. ప్రభుడనైన నేను వీరిని పరిత్యజించితిని.
కావున నరులు వీరిని పరిత్యజింపబడిన
వెండి అని పిలుతురు.”