8 1. ఆ కాలము వచ్చినపుడు రాజుల అస్థికలను, అధికారుల అస్థికలను, యాజకుల అస్థికలను, ప్రవక్తల అస్థికలను, యెరూషలేమున వసించిన ఇతర ప్రజల అస్థికలను సమాధులలోనుండి బయికి తీయు దురు.

2. వారు ప్రేమించు సూర్యచంద్ర తారకల ఎదుట నేలపైపరతురు. ప్రజలు ఈ గ్రహములను అభిమానించిరి, సేవించిరి, సంప్రతించిరి, అను సరించిరి, నమస్కరించిరి, పూజించిరి. వానిని ప్రోగు జేసి భూస్థాపనము చేయుటకు మారుగా, నేలమీద ఎరువుగా వెదజల్లుదురు.

3. ఈ దుష్టజాతిలో మిగిలినవారు నేను తమను చెల్లాచెదరు చేసిన తావులలో వసింతురు. వారికి అచట బ్రతుకుటకంటె, చచ్చుట మేలు అనిపించును. ఇది సైన్యములకు అధిపతియగు ప్రభుడనైన నా వాక్కు.”

యిస్రాయేలీయుల దుష్టత్వము

4.           ప్రభువు నన్ను తన ప్రజలకు ఇట్లు చెప్పుమనెను:

               ”క్రిందపడినవాడు పైకిలేవడా?

               త్రోవ దప్పినవాడు వెనుకకు తిరిగిరాడా?     

5.           నా ప్రజలారా!

               మీరు నానుండి వైదొలగి కలకాలము

               నాపట్ల విశ్వాసఘాతకులుగా మెలగనేల?

               మీరు మీ విగ్రహములను అంిపెట్టుకొని

               నా చెంతకు తిరిగిరాకున్నారు.

6.           నేను మీ పలుకులను జాగ్రత్తగా వినుచున్నాను.

               మీరు సత్యము చెప్పుటలేదు.

               మీలో ఎవడును తన తప్పులకు

               పశ్చాత్తాపపడుటలేదు.

               ‘నేను చేసిన నేరమేమి?’

               అని ఎవడును ఆత్మవిచారము చేసికొనుటలేదు.

               అశ్వము రణరంగమునకు ఉరకలెత్తినట్లే

               ప్రతివాడును మూర్ఖముగా

               తనదారిన తాను పోవుచున్నాడు.

7.            ఆకాశమున ఎగురు బెగ్గురు పకక్షులకు

               తాము తిరిగిరావలసిన కాలము తెలియును.

               గువ్వలకు, వానకోవెలలకు, కొంగలకు

               తాము వలసపోవలసిన

               సమయమును తెలియును.

               కాని నా ప్రజలైన మీకు ప్రభుడనైన నా ఆజ్ఞలు

               ఏమాత్రమును తెలియవు.

ధర్మశాస్త్రము బోధింపవలసిన యాజకులు

8.           ‘మేము జ్ఞానులమనియు,

               మాకు ధర్మశాస్త్రము తెలియుననియు’

               మీరు వాకొననేల?

               కల్లలాడు ధర్మశాస్త్రబోధకులు

               ప్రభువు ధర్మవిధులను మార్చివేసిరి.

9.           జ్ఞానులైనవారు అవమానమును పొందుచున్నారు

               పట్టువడి నోటమాట రాకున్నారు.

               వారు ప్రభువు వాక్కును తృణీకరించిరి,

               ఇక వారి జ్ఞానమేపాిది?

ప్రజలకు శిక్ష

10.         కనుక నేను వారి భూములను

               అన్యుల వశము చేయుదును.

               వారి భార్యలను పరులకు అప్పగింతును.

               అల్పులు, అధికులు కూడ

               అన్యాయార్జనమునకు పాల్పడుచున్నారు.

               ప్రవక్తలు యాజకులుకూడ

               వంచనమునకు ఒడిగట్టుచున్నారు.

11.           వారు నా ప్రజల

               గాయములను ప్టించుకొనుటలేదు.

               ఎల్లరును కుశలముగా లేకున్నను,

               ఎల్లరును శాంతిగా లేకున్నను,

               ‘ఎల్లరును కుశలముగాను,

               శాంతిగాను ఉన్నారు’ అని చెప్పుచున్నారు.

12.          ఇి్ట హేయమైన కార్యములు చేసినందులకు

               వారు సిగ్గుపడిరా? లేదు,

               అసలు వారికి సిగ్గుపడుట కూడ చేతకాదు.

               కనుక పూర్వము నా శిక్షకు లోనైన వారు కూలినట్లే

               వారును కూలుదురు.

               నేను దండింపగా వారు నేలకొరుగుదురు.

               ఇది ప్రభువు వాక్కు.

యూదాయను ద్రాక్షతీగ

13.          నేను ద్రాక్షపండ్లు కోయగోరినపుడు,

               ద్రాక్షతీగలమీద పండ్లులేవు,

               అంజూరముల మీద ఫలములు లేవు.

               వాని ఆకులు కూడ వాడిపోయినవి.

               కనుక నేను వారికిచ్చినది

               వారినుండి వెడలిపోయినది.

14.          ప్రభువు ప్రజలు ఇట్లందురు:

               మనమిచట వ్టినే కూర్చుండి ఉండనేల?

               రండు, సురక్షితపట్టణములకు

               పారిపోయి అచట చత్తము.

               మనము ప్రభువునకు ద్రోహముచేసితిమి.

               కనుక మన దేవుడు మనకు చావు విధించెను,

               విషము త్రాగనిచ్చెను.

15.          మనము శాంతికొరకు ఆశించితిమి,

               కాని మేలేమియు కలుగలేదు.

               ఆరోగ్యము కలుగును అనుకొింమి,

               కాని భీతి వాిల్లెను.

16.          దానునుండి శత్రువుల గుఱ్ఱముల

               బుసలు విన్పించుచున్నవి.

               వారి గుఱ్ఱముల సకిలింపులకు

               నేల దద్దరిల్లుచున్నది.

               విరోధులు మన దేశమును,

               అందున్న వానినన్నిని, మన నగరములను,

               అందలి ప్రజలను నాశనముచేయుటకు వచ్చిరి.

17.          ప్రభువు ఇట్లు అనును:

               ”నేను మీ మీదికి పాములను పంపుదును.

               మాంత్రికులకు లొంగని విషసర్పములను

               పంపుదును. అవి మిమ్ము కరచితీరును”

               ఇది ప్రభువు వాక్కు.

ప్రజలనుగూర్చి ప్రవక్త శోకించుట

18.          నేను ఈ దుఃఖమునెట్లు భరింతును?

               నా గుండెలు పగిలిపోవుచున్నవి.

19.          వినుడు, దేశము నలుమూలలను

               నా ప్రజలు శోకించుచున్నారు.

               వారు ”ప్రభువిక సియోనునలేడా?

               సియోను రాజు ఇక అచట లేడా?”

               అని ఏడ్చుచున్నారు.

               ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               ”మీరు విగ్రహములను ఆరాధించి

               నాకు కోపము రప్పింపనేల?

               నిష్ప్రయోజకములైన

               అన్యదైవములను కొలువనేల?”

20.        ప్రజలు ఇట్లు విలపింతురు:

               ”వేసవి గతించినది,

               కోతకాలము దాిపోయినది.

               మనము రక్షణమును బడయమైతిమి.”

21.          నా ప్రజల హృదయవేదనను చూచి

               నేనును వేదన చెందుచున్నాను.

               నేను శోకించుచున్నాను.

               భయభ్రాంతుడను అగుచున్నాను.

22.        గిలాదున మందులేదా? అచట వైద్యుడు లేడా?

               ఉన్నచో నా జనులు ఆరోగ్యము బడయరేల?