యూదాప్రజల దుష్టవర్తన
9 1. నా శిరస్సు జలకూపమైన ఎంత బాగుండును!
నా నేత్రములు కన్నీిచెలమలైన
ఎంత బాగుండును!
అప్పుడు నేను హతులైన నా ప్రజలకొరకు రేయింబవళ్ళు విలపించెడివాడను.
2. ఎడారిలో నాకు బాటసారుల
గుడిసె దొరకిన ఎంత బాగుండును.
అప్పుడు వ్యభిచారులును, ద్రోహులునైన
నా ప్రజలను విడనాడి నేను అచికి వెళ్ళెడివాడను.
3. వారి నాలుక అబద్ధములాడుటకు
వంచిన విల్లువలె సిద్ధముగాఉన్నది.
దేశమున అసత్యము రాజ్యము చేయుచున్నది. ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
”ఈ ప్రజలు కీడువెంట కీడు చేయుచున్నారు.
వీరికి నన్నుగూర్చి తెలియదు”.
4. ప్రతివాడు తన మిత్రుని
ఒకకంట కనిప్టిె ఉండవలెను.
ఎవడును తన సోదరుని నమ్మరాదు.
ప్రతి సోదరుడును
యాకోబువలె మోసము చేయును.
ప్రతివాడును తన మిత్రునిమీద
నిందలుమోపువాడే.
5. ప్రతివాడును తోడివానిని వంచించువాడే.
సత్యము చెప్పువాడు ఒక్కడును లేడు.
వారు తమ నాలుకలకు కల్లలాడుట నేర్పిరి.
కనుక ఇక తమ దుష్ట వర్తనమును మార్చుకొనరు.
6. వారు దౌర్జన్యము మీద దౌర్జన్యమును,
మోసము మీద మోసమును చేయుచున్నారు.
ప్రభువు తన ప్రజలు
తనను నిరాకరించిరని పలుకుచున్నాడు.
7. కనుక సైన్యములకు అధిపతియైన
ప్రభువు ఇట్లు అనుచున్నాడు.
”నేను నా ప్రజలను శుద్ధి చేయుదును.
పరీక్షకు గురిచేయుదును.
తప్పు చేసిన నా వారిని
ఇంతకంటె ఏమిచేయుదును?
8. వారి నాలుకలు చంపెడు బాణములవలె ఉన్నవి.
వారు ఎల్లవేళల కల్లలాడుదురు.
ప్రతివాడు పొరుగువానితో
ఆప్యాయముగా మ్లాడును.
కాని లోలోపల అతనికి ఉచ్చులు పన్నును.
9. ఇి్ట పనులకు పాల్పడువానిని
నేను దండింపవలదా?
ఇి్ట జాతిమీద నేను పగతీర్చుకోవలదా?
ఇది ప్రభుడనైన నా వాక్కు.
సియోనున శోకాలాపము
10. నేనిట్లు తలంచితిని:
నేను పర్వతముల కొరకు శోకింతును.
పచ్చికపట్టుల కొరకు విలపింతును.
అవి ఎండిపోయినవి.
వానిగుండ ఎవ్వడును పయనించుటలేదు.
వానిలో పశువులమందల
అరపులు విన్పించుటలేదు.
పకక్షులు, వన్యమృగములు పారిపోయినవి.
11. ప్రభువు ఇట్లనెను:
నేను యెరూషలేమును శిథిలము గావింతును.
నక్కలు దానిలో వసించును.
యూదానగరములు ఎడారులగును.
వానిలో ఎవడును నివసింపడు.”
12. నేను ‘ప్రభూ! ఈ దేశము శిథిలము కానేల? నరసంచారము లేని ఎడారివలె ఎండిపోనేల? ఈ విషయము గ్రహింపగల వివేకము ఎవనికి గలదు? ఈ సంగతిని నీ వద్దనుండి తెలిసికొని దానిని ఇతరు లకు వివరింపగలవాడెవడు?’ అని అడిగితిని.
13. ప్రభువు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను: ”ఈ కార్యము జరుగుటకు కారణమిది. నా ప్రజలు నేనొసగిన ఉపదేశమును పాింపలేదు. నా మాట వినలేదు. నేను చెప్పిన పని చేయలేదు.
14. పైగా వారు మొండి హృదయముతో తమ పితరులు నేర్పినట్లుగానే బాలుదేవత బొమ్మలను కొలిచిరి.
15. కనుక సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడనైన నేనేమి చేయుదునో వినుము. ఈ ప్రజలచేత చేదుకూరలు తినిపింతును. విషజలములు త్రాగింతును.
16. వీరికిగాని, వీరి పితరులకుగాని తెలియని జాతులమధ్య వీరిని చెల్లాచెదరు చేయుదును. వీరి మీదికి సైన్యములను పంపి వీరిని పూర్తిగా నాశనము చేయింతును.”
యెరూషలేము పౌరుల ఆక్రందన
17. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనెను:
”యోచింపుడు.
మీరు శోకాలాపముచేయు స్త్రీలను పిలువుడు.
విలాపగీతములను పాడు
ఉవిదలకు కబురు పెట్టుడు.
18. ప్రజలు ఇట్లనిరి:
ఆ స్త్రీలు త్వరగా శోకగీతము ఆలపింతురుగాక!
అప్పుడు మన నేత్రములు కన్నీరుకార్చును.
ఏడుపుల వలన మన కనుగ్రుడ్లు తడియును”.
19. సియోనున వినిపించు
శోకాలాపమును ఆలింపుడు:
”మనము నాశనమైతిమి.
అవమానమున మునిగితిమి.
మనము ఈ దేశమును విడనాడవలెను.
మన ఇండ్లు కూలినవి.”
20. నేనిట్లు పలికితిని:
”ఉవిదలారా! మీరు ప్రభువు పలుకులాలింపుడు
ఆయన మాటలు వినుడు.
మీ కుమార్తెలకు శోకగీతములు నేర్పుడు.
మీ తోడి మగువలకు విలాపగీతములు నేర్పుడు.
21. మృత్యువు గవాక్షములగుండ దూరివచ్చి,
మన ప్రాసాదములలో ప్రవేశించినది.
అది మన వీధులలోని పిల్లలను,
మన సంతలోని పెద్దలను సంహరించినది.
22. పీనుగులు పొలమున జల్లిన ఎరువువలె
ఎల్లెడల కనిపించుచున్నవి.
అవి కోతగాండ్రు వదలివెళ్లిన పనలవలె నున్నవి. ప్రభువు నన్ను చెప్పుమనిన పలుకిదియే.”
నిజమైన జ్ఞానము
23. ప్రభువు ఇట్లనెను:
”జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చిగాని,
శూరులు తమ శౌర్యమును గూర్చిగాని,
ధనికులు తమ సంపదలను గూర్చిగాని
గొప్పలు చెప్పుకొనకుందురుగాక!
24. గొప్పలు చెప్పుకోగోరువాడు,
తాను నన్నెరిగి నన్నర్థము చేసికొనుటను గూర్చి
గొప్పలు చెప్పుకొనునుగాక!
నేను కరుణతోను, నీతిన్యాయములతోను
భూమిని ఏలుదును.
నాకు నచ్చిన గుణములివియే.
ఇది ప్రభుడనైన నా వాక్కు.”
హృదయమునకు సున్నతి
25-26. ప్రభువు ఇట్లనెను: ”నేను ఐగుప్తు, యూదా, ఎదోము, అమ్మోను, మోవాబు ప్రజలను, తల వెంట్రుకలను కురచగా కత్తిరించుకొను ఎడారి ప్రజలను శిక్షించుకాలము వచ్చుచున్నది. వీరెల్లరును శారీరకమైన సున్నతి మాత్రమే పొందిరి. ఈ ప్రజ లును, యిస్రాయేలీయులును హృదయమున సున్నతి పొందరైరి.”