విగ్రహములు, నిజమైన దేవుడు
10 1. యిస్రాయేలీయులారా!
ప్రభువు మీతో చెప్పు సందేశము ఆలింపుడు.
2. ఆయన ఇట్లనుచున్నాడు:
”మీరు అన్యజాతుల పద్ధతులను
అవలంబింపకుడు.
ఆకాశములోని గురుతులనుచూచి వెరగొందకుడు.
అన్యజాతులు వాికి వెరచిన వెరవవచ్చును.
3. అన్యజాతుల ఆచారములు నిష్ప్రయోజనమైనవి. నరుడు అడవిలో చెట్టును నరకునట్లు
అవి నరకబడును.
పనివాడు గొడ్డలితో చేసిన పనియిది.
4. దానిని వెండిబంగారములతో అలంకరించి,
క్రింద పడిపోకుండునట్లు,
చీలలతోక్టొి నిలబెట్టుదురు.
5. విగ్రహములు దోసతోటలోని దిష్టి బొమ్మలవింవి.
అవి మ్లాడలేవు, స్వయముగా నడువలేవు. కనుక నరులే వానిని మోసికొనిపోవుదురు.
మీరు వానిని చూచి భయపడనక్కరలేదు.
అవి మీక్టిె కీడుగాని, మేలుగాని చేయజాలవు.”
6. ప్రభూ! నీకు తుల్యుడెవడును లేడు.
నీవు మహామహుడవు.
నీ దివ్యనామము మహామహిమాన్వితమైనది.
7. జాతులకు రాజువైన
నిన్నెవడు గౌరవింపకుండును?
గౌరవమునుబడయుట నీ హక్కు.
నిఖిలజాతులజ్ఞానులలో గాని, రాజులలోగాని
నీ వింవాడు లేడు.
8. వారెల్లరును మూర్ఖులు, మందమతులు.
విగ్రహములనుండి వారు నేర్చుకొను
బోధ నిరర్థకమైనది.
9. వారి విగ్రహములకు కమ్మచ్చున తీసిన
తర్షీషు వెండిని, ఊఫాజు బంగారమునుపొదిగిరి.
అవియన్నియు కళాకారులును,
కంసాలులును చేసినవి.
ఆ బొమ్మలకు నేర్పరులైన నేతపనివారునేసిన
నీలము, ధూమ్ర వర్ణముగల బట్టలను తొడిగిరి.
10. కాని ప్రభువు నిక్కమైన దేవుడు,
సజీవుడైన దేవుడు, శాశ్వతుడైనవాడు.
ఆయన కోపగించినచో భూమి కంపించును. జాతులు ఆయన ఆగ్రహమును భరింపజాలవు.
11. ”భూమ్యాకాశములను సృష్టింపని
ఈ దైవములు భూమిమీద నుండకుండగను,
ఆకాశము క్రింద ఉండకుండగను
తుడిచివేయ బడుదురు” అని మీరు
ఆ జాతులతో నుడువుడు.
12. ప్రభువు తనబలముచేత భూమిని సృష్టించెను. తన జ్ఞానముతో ప్రపంచమును నెలకొల్పెను. తనప్రజ్ఞతో ఆకసమును విశాలముగా విప్పెను.
13. ఆయన ఆజ్ఞాపింపగా ఆకాశజలములు పుట్టును
ఆయన నేలఅంచులనుండి
మబ్బులను కొనివచ్చును.
వర్షధారలలో మెరుపులు వెలిగించును.
తన గిడ్డంగులలోనుండి వాయువులను పంపును.
14. ఈ కార్యములెల్లచూచి
నరులు తెలివిని కోల్పోయి తికమకపడుదురు.
విగ్రహములను చేయువారు సిగ్గుపడుదురు.
వారి బొమ్మలు నిర్జీవములు, నిష్ప్రయోజకములు.
15. అవి జడములు, అస్తిత్వము లేనివి,
నగుబాట్లు తెచ్చునవి.
ప్రభువు వానికి తీర్పుచెప్పుటకు వచ్చినపుడు
అవి నశించును.
16. కాని యాకోబు దేవుడు
ఈ బొమ్మలవింవాడుకాదు
ఆయన సమస్తమును నిర్మించువాడు.
యిస్రాయేలు తాను ఎన్నుకొనిన జాతి
సైన్యములకధిపతియని ఆయనకు పేరు.
ప్రవాస శిక్ష
17. యెరూషలేము పౌరులారా!
శత్రువులు మిమ్ము చుట్టుమ్టుిరి
కాన మీ వస్తువులను మూటకట్టుకొని పారిపొండు.
18. ”ఇదిగో ప్రభువు మిమ్ము
ఈ దేశమునుండి వెళ్ళగొట్టును.
ఒక్కనినిగూడ మిగులనీయకుండ
మిమ్మెల్లరిని మట్టుపెట్టును.”
ఇది ప్రభువువాక్కు.
19. యెరూషలేము పౌరులు ఇట్లు విలపించిరి:
”కటకా మేమ్టెి దెబ్బలుతింమి.
మా గాయములిక మానవు.
అయితే ఈ గాయము మాకు తగినదే అనుకొని,
మేము దానిని సహింతుము.
20. కాని యిపుడు మా గుడారములు కూలినవి.
వాని త్రాళ్ళు తెగిపోయినవి.
మా పిల్లలు మాచెంతనుండి వెళ్ళిపోయిరి.
పడిపోయిన గుడారములు ఎత్తుటకును,
తెరలను కట్టుటకును,
ఎవరును కనిపించుటలేదు.”
21. నేనిట్లు బదులు చెప్పితిని:
మన కాపరులు మూర్ఖులు.
వారు ప్రభువును సలహా అడుగరైరి.
కనుకనే వారు వృద్ధిలోనికి రారైరి.
మన ప్రజలు చెల్లాచెదరైరి.
22. అదిగోవినుడు. వార్తలు వచ్చుచున్నవి!
ఉత్తరదిక్కున ఉన్న ఆ జాతి సైన్యములు
యూదా నగరములను ఎడారులు చేసి,
నక్కలకు ఆటపట్టులు చేయుటకు వచ్చెడి
గొప్ప అల్లకల్లోల ధ్వని వినబడుచున్నవి.
యిర్మీయా ప్రార్థన
23. ప్రభూ! ఏ నరుడు తన గతిని
తాను నిర్ణయించుకోజాలడనియు,
తన జీవితమును తన వశములో
ఉంచుకోజాలడనియు నేను ఎరుగుదును.
24. ప్రభూ! మమ్ము మృదువుగా శిక్షింపుము.
కోపముతో కఠినముగా దండింతువేని,
మేము నాశనమై పోయెదము.
25. నిన్నెరుగని అన్యజాతులమీద,
నిన్ను ఆరాధింపని వారిమీద
నీ ఆగ్రహమును కుమ్మరింపుము.
వారు నీ ప్రజలను మట్టుప్టిె
సర్వనాశనము చేసిరి.
మా దేశమును ఎడారి కావించిరి.