దుర్మార్గుల వృద్ధి
12 1. ప్రభూ! నేను నీతో వాదింతునేని,
నీవు నీతిమంతుడువుగా అగుబడుదువు.
అయినను న్యాయమును గూర్చి
నేను నిన్ను ప్రశ్నింపగోరెదను.
దుర్మార్గులు వృద్ధిలోనికి రానేల?
దుష్టులు సుఖములను బడయనేల?
2. నీవు ఆ దుర్జనులను చెట్టువలెనాటగా,
వారు వేరూని యెదిగి పండ్లుకాయుదురు.
వారు నిరంతరము నిన్నుగూర్చి మాడుదురు
కాని నీవు వారి హృదయమున ఉండనే యుండవు.
3. ప్రభూ! నీకు నా గురించి తెలియును.
నీవు నా కార్యములను గమనింతువు.
నీ యెడల నా హృదయము
ఎట్లున్నదని శోధించుచున్నావు.
ఈ దుష్టులను గొఱ్ఱెలవలె
వధ్యస్థానమునకు ఈడ్చుకొనిపొమ్ము.
వధించుకాలము వచ్చువరకును
వారిని నీ అధీనమున ఉంచుకొనుము.
4. దేశము ఎన్నాళ్ళు శుష్కించి ఉండవలెను?
బీళ్ళలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోయి ఉండవలెను?
మా ప్రజల పాపములవలన
మృగాలు, పకక్షులు చచ్చుచున్నవి.
వారు దేవుడు మన కార్యములు చూడడులే
అనుకొనుచున్నారు.
5. ప్రభువు నాతో ఇట్లనెను:
”నీవు పాదచారులవెంట పరుగెత్తలేక
అలసిపోయినచో,
ఇక గుఱ్ఱములవెంట ఎట్లు పరుగెత్తెదవు?
పొలముననే నిలువజాలనిచో,
ఇక యోర్దాను చేరువలోని అరణ్యమున
ఎట్లు నిలుతువు?
6. నీ కుటుంబమునకు చెందిన నీ సోదరులే
నీకు ద్రోహము తలపెట్టుచున్నారు.
నీ మీదికెత్తి వచ్చుచున్నారు.
వారు నీతో తీయగా మ్లాడినను,
నీవు వారిని నమ్మవలదు.”
ప్రభువు తన ప్రజల దుర్గతినిగాంచి శోకించుట
7. ప్రభువు ఇట్లనెను:
”నేను యిస్రాయేలును పరిత్యజించితిని.
నేనెన్నుకొనిన ప్రజలను విడనాడితిని.
నేను ప్రేమతో చూచుకొను జనులను
వారి శత్రువుల చేతికి అప్పగించితిని.
8. నా సొంత ప్రజలు అడవిలోని సింగములవలె
నామీద తిరుగబడుచున్నారు.
నన్ను చూచి గర్జించుచున్నారు.
కనుక నేను వారిని ద్వేషించితిని.
9. నేను ఎన్నుకొనిన ప్రజలు రంగురంగుల
క్రూరపక్షి వింవారైరి.
నలువైపులనుండి డేగలు దానిమీదికి దిగివచ్చెను. వన్యమృగములారా!
మీరును వచ్చి దానిని కబళింపుడు.
10. అనేకమంది కాపరులు
నా ద్రాక్షతోటను నాశనము చేసిరి.
నా పొలమును కాళ్ళతోత్రొక్కివేసిరి.
నాకు ఇష్టమైన నా ద్రాక్షతోటను
ఎడారి కావించిరి.
11. దానిని మరుభూమి కావించిరి.
అది నా కన్నులఎదుటనే పాడువడియున్నది.
దేశమంతయు ఎడారిగా మారిపోయినను
చింతించువాడు ఎవడునులేడు.
12. ఎడారి భూములందు నాశనము చేయువారు
తిరుగాడుచున్నారు.
దేశమంతిని తుడిచిపెట్టుటకు
నేను యుద్ధమును తెచ్చిప్టిెతిని.
ఇక ఏ నరుడును క్షేమముగా బ్రతుకజాలడు.
13. నా ప్రజలు గోధుమలుచల్లి
ముండ్ల పంటను ప్రోగుచేసికొనుచున్నారు.
వారు శ్రమించి పనిచేసినను ఫలితము దక్కలేదు.
నేను ఆగ్రహించితిని
కనుక వారికి పంటలు పండలేదు.”
అన్యజాతులకు రక్షణ
14. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలీయు లకు ఇరుగుపొరుగున ఉన్న జాతులు నేను నా ప్రజల కొసగిన దేశమును పాడుచేసిరి. ఆ జాతులనుగూర్చి నా పలుకులివి: ”నేను ఆ దుష్టులను, వారి దేశము నుండి పెల్లగింతును. యూదాను వారి హస్తముల నుండి విడిపింతును.
15. కాని నేను ఆ అన్యజాతి ప్రజలను స్వీయదేశమునుండి పెరికివేసిన తరువాత వారిమీద కరుణ చూపుదును. వారిని మరల తమ దేశమునకు తమ నేలకు కొనివత్తును.
16. పూర్వము వారు నా ప్రజలకు బాలుదేవత పేరుమీద ప్రమా ణము చేయనేర్పిరి. కాని ఇప్పుడు వారు నా ప్రజల మార్గమును అంగీకరించి, నా పేరు మీద ప్రమాణము చేయుదురేని నేను వారిని నా జనులలో చేర్చుకొని వారిని వర్ధిల్లజేయుదును.
17. కాని ఏ జాతియైన నా మాటవినదేని నేను దానిని సమూలముగా పెల్లగించి, ఆ జాతిని నాశనము చేయుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు.”