దారుణమైన కరువు
14 1. కరువును గూర్చి ప్రభువు యిర్మీయాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:
2. యూదా విలపించుచున్నది,
దాని నగరములు క్షీణించుచున్నవి.
దానిప్రజలు విచారముతో నేలకొరుగుదురు.
యెరూషలేము ఆక్రందనము చేయుచున్నది.
3. సంపన్నులు సేవకులను నీళ్ళకు పంపుచున్నారు.
వారు బావులవద్దకు వెళ్ళి,
అవి వ్టిపోవుటచూచి వ్టికూజాలతో
తిరిగివచ్చుచున్నారు.
నిరుత్సాహముతోను, తడబాటుతోను
మొగములు కప్పుకొనుచున్నారు.
4. వానలు లేక నేల ఎండిపోవుటచే
రైతులు నిరాశచెంది మొగము కప్పుకొనుచున్నారు.
5. మేయుటకు గడ్డి దొరకనందున లేడి
తాను ఈనిన పిల్లను పొలాన వదలివేయుచున్నది.
6. అడవి గాడిదలు కొండకొమ్ము మీద నిలుచుండి
నక్కలవలె రొప్పుచు గాలి పీల్చుచున్నవి.
మేత దొరకనందున వాని కన్నులు
మూతపడుచున్నవి.
7. మా పాపములు మేము దోషులమని
చాి చెప్పుచున్నవి.
అయినను ప్రభూ!
నీవు ప్రమాణము చేసినట్లే మమ్ము ఆదుకొనుము.
మేము చాలసారులు నీనుండి వైదొలగితిమి.
నీకు ద్రోహముగా పాపము చేసితిమి.
8. యిస్రాయేలు ఆశ నీవే.
మమ్ము ఆపదనుండి రక్షించువాడవు నీవే.
నీవు మా దేశమున పరదేశివలె వర్తింపనేల?
ఒక్కరేయి మాత్రమే ఉండిపోవు
బాటసారివలె కనిపింపనేల?
9. విభ్రాంతి చెందిన నరునివలెను,
ఆపదలోనున్నవారిని రక్షింపజాలని
శూరునివలెను చూపట్టనేల?
ప్రభూ! నీవు నిశ్చయముగా మా నడుమనున్నావు.
మేము నీ వారలము,
నీవు మమ్ము పరిత్యజింపకుము.”
10. ప్రభువు ఈ ప్రజలను గూర్చి ఇట్లు అను చున్నాడు: వీరికి నా చెంతనుండి పారిపోవలెననియే కోరిక. వారు తమను తాము అదుపులో పెట్టుకో జాలకున్నారు. కనుక నేను వారిని అంగీకరింపను. వారి దుష్కార్యములు జ్ఞప్తియందుంచుకొని వారి పాప ములకుగాను వారిని దండింతును.
11. మరియు ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: ”నీ ప్రజల క్షేమము కొరకు విజ్ఞాపన చేయవలదు.
12. వారు ఉప వాసము చేసినను, నేను వారి మనవిని ఆలింపను. దహనబలిని, ధాన్యబలిని సమర్పించినను అంగీక రింపను. నేను వారిని పోరువలనను, ఆకలివలనను, అంటురోగమువలనను తెగార్చబూనితిని.
13. అప్పుడు నేను ఇట్లు పలికితిని: అయ్యో ప్రభువా! యుద్ధము, క్షామము సంభవింపవని ప్రవక్తలు ఈ ప్రజలతో చెప్పుచున్నారు. నీవు ఈ దేశ ప్రజలకు దీర్ఘకాల శాంతిసమాధానము వాగ్ధానము చేసితివని వారు ప్రజలతో చెప్పుచున్నారు.
14. ప్రభువు నాకు ఇట్లు బదులు చెప్పెను. ”ఆ ప్రవక్తలు నాపేరు మీదుగా అబద్ధములు చెప్పు చున్నారు. నేను వారిని నా పనిమీద పంపలేదు, వారికి ఆజ్ఞలీయలేదు, వారితో సంభాషింపనులేదు. వారు మీకుచెప్పు ప్రవచనములు అబద్ధ దర్శనములు, నిష్ప్రయోజనమైన శకునములు, కేవలము వారి తలలో ప్టుిన కపాలోచనలు.
15. కావున ప్రభుడనైన నేను ఇట్లు చెప్పుచున్నాను.
ఈ ప్రవక్తలు నేను పంపకున్నను
నా పేరు మీదుగా ప్రవచనములు పలికి
‘ఈ దేశమున క్షామముగాని,
కత్తిగాని సంభవింపవు’ అని చెప్పుచున్నారు.
కనుక నేను వారిని కత్తివలనను,
ఆకలివలనను చంపుదును.
16. వారు ఎవరికి ప్రవచనములు చెప్పిరో
ఆ నరులు కూడ క్షామము, కత్తి వలననే చత్తురు.
నేనే వారి పీనుగులను యెరూషలేము
వీధులలోనికి విసరివేయుదును.
వానినెవరును పాతిపెట్టరు.
వారి భార్యలకును, కుమారులకును,
కుమార్తెలకును ఈ గతియే పట్టును.
వారు చేసిన చెడును వారి మీదికే రప్పింతును.”
17. ప్రభువు నన్ను వారికి తన వేదనను గూర్చి
ఇట్లు తెలియజేయుమనెను:
నా నేత్రములు రేయింబవళ్ళు
కన్నీరు కార్చునుగాక!
నా ప్రజల కన్యక ఘోరమైన
గాయమునొందియున్నది.
దారుణమైన విపత్తువలన పీడింపబడుచున్నది.
18. నేను పొలమునకు వెళ్ళినచో
ఖడ్గముచేత హతులైనవారు కనిపించుచున్నారు.
పట్టణములోనికి వెళ్ళినచో
క్షామపీడితులు తారసపడుచున్నారు.
ప్రవక్తలును, యాజకులును తామెరుగని
దేశమునకు పోవలెనని ప్రయాణమైరి.
19. ప్రభూ! నీవు యూదాను
పూర్తిగా నిరాకరించితివా?
సియోనును ఈసడించుకొింవా?
మరల కోలుకోనిరీతిగా
మమ్ము గాయపరచితివేల?
మేము శాంతికొరకు ఆశించితిమి
కాని మేలేమియు కలుగలేదు.
ఆరోగ్యము సిద్ధించుననుకొింమి,
కాని భీతి వాిల్లెను.
20. ప్రభూ! మేము నీకు ద్రోహముగా
పాపముచేసితిమి.
మేము మా తప్పులను మా పితరుల తప్పులను
గూడ ఒప్పుకొనుచున్నాము.
21. నీవు నీ ప్రమాణములను జ్ఞప్తికి తెచ్చుకొనుము,
మమ్ముచేయివిడువకుము.
నీ మహిమాన్వితమైన సింహాసనమునకు
అవమానము వాిల్లనీయకుము.
నీవు మాతో చేసికొనిన
నిబంధనమును స్మరించుకొనుము.
దానిని రద్దుచేయకుము.
22. అన్యజాతుల వ్యర్ధదేవతలు
వానను కురియింపలేవు.
ఆకసము స్వయముగా జల్లులు కురిపించలేదు.
మా ప్రభుడవైన దేవా!
నీవే ఆ పనికి సమర్థుడవు,
మేము నిన్నే నమ్మితిమి,
ఈ కార్యములెల్ల చేయగలవాడవు నీవే.