15 1. ప్రభువు నాతో ఇట్లు అనెను: మోషే సమూవేలులు నా ముందట నిలిచి విన్నపములు చేసినను, నేను ఆ ప్రజలను కరుణింపను. వారిని నా ఎదుినుండి గిెంవేయుము. వారిని పంపివేయుము.

2. వారు మేము ఎచికి వెళ్ళుదుము అని నిన్ను అడిగినచో, వారితో నా మాటలుగా ఇట్లు చెప్పుము:

               వ్యాధివాత పడనున్నవారు వ్యాధికడకును,

               యుద్ధమున చావనున్నవారు యుద్ధము కడకును,

               క్షామమువాత పడనున్నవారు క్షామముకడకును, ప్రవాసమువాత పడనున్నవారు

               ప్రవాసమునకును పోవుదురుగాక!

3. ప్రభుడనైన నేను వారికి నాలుగు దౌర్భాగ్య ములు ప్టింతును. ఆ ప్రజలు కత్తిబారిన చత్తురు. కుక్కలు వారి పీనుగులను లాగుకొనిపోవును. పకక్షులు వానిని తినివేయును. వన్యమృగములు వానిని మ్రింగి వేయును.

4. హిజ్కియా కుమారుడగు మనష్షే యూదాకు రాజుగా నున్నపుడు యెరూషలేమున చేసిన దుష్కార్య ములకుగాను ప్రపంచములోని జనులెల్లరును వారిని అసహ్యించుకొనుట్లు చేయుదును.

యుద్దమువలన భయము

5.           ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు:

               ”యెరూషలేము ప్రజలారా!

               మిమ్ము కరుణించువారెవరు?

               మిమ్ముచూచి పరితాపము చెందువారెవరు?

               కొంచెముతడవాగి

               మీ క్షేమమును విచారించువారెవరు?

6.           మీరు నన్ను విడనాడితిరి,

               నా నుండి వైదొలగితిరి.

               కనుక నేను నా చేతినిచాచి మిమ్ము

               నాశనము చేసితిని.

               మిమ్మునుబ్టి సంతాపముతో విసిగిపోతిని.

7.            మీదేశములోని ప్రతి పట్టణమునను నేను మిమ్ము

               ధాన్యమువలె చేటతోతూర్పారబ్టితిని.

               మీరు మీ దుష్కార్యములను మానరైతిరి.

               నేను మిమ్ము నాశనము చేసితిని,

               మీ పిల్లలను చంపితిని.

8.           మీ వితంతువులు కడలి ఒడ్డుననున్న

               యిసుక రేణువులకంటె ఎక్కువ మందియైరి.

               మిమ్మును సంతానహీనులుగా చేసితిని.

               వారి తల్లులకు పుత్రశోకము కలిగించితిని.

               దిఢీలున వారిని పరితాపమునకును,

               భయమునకును గురిచేసితిని.

9.           ఏడుగురు కుమారులను కోల్పోయిన తల్లి

               మూర్ఛపోయి ఎగశ్వాస తీయుచున్నది.

               పట్ట పగలే ఆమె వెలుగు అంతరించెను.

               ఆమె అవమానమునొంది గగ్గోలుపడెను.

               నేను మీలో మిగిలియున్న వారిని

               మీ శత్రువులచే కండతుండెములు చేయింతును” ఇది ప్రభువు వాక్కు.

యిర్మీయా ప్రభువునకు ఫిర్యాదు చేయుట

10.         అయ్యో! నేను ఎంతి దౌర్భాగ్యుడను!

               తల్లీ! నీవు నన్నేలకింవి?

               నేను ప్రతివానితోను వివాదమునకుదిగి

               తగవులాడవలసివచ్చెను.

               నేను ఒకనికి అప్పీయలేదు,

               ఒకనినుండి అప్పు తీసికోలేదు.

               అయినను ప్రతివాడును నన్ను శపించువాడే.

11. అందుకే యావే,

               ”నీకు మేలు కలుగునట్లు

               తప్పక నిన్ను బలపరుతును.

               ఆపదలోను, వేదనలోను నీ శత్రువులు తప్పక

               నిన్ను వేడుకొనునట్లు చేయుదును”

12.          ఇనుమును ఎవడైన విరువగలడా?

               ఉత్తరమునుండి వచ్చు కంచు కలిపి తయారుచేసిన

               ఇనుమును ఎవడైన తుంచగలడా?

13.          ప్రభువు ఇట్లు అనెను:

               నేను నా ప్రజలమీదికి శత్రువులను పంపగా

               వారు వారి సొత్తును, నిధులను

               కొల్లగొట్టుకొని పోవుదురు. వారు దేశమందు

               ఎల్లయెడల చేసిన పాపములకు ఇది శిక్ష.

14.          నా ప్రజలు తామెరుగని అన్యదేశమున

               తమ శత్రువులకు

               ఊడిగము చేయునట్లు నేను చేయుదును.

               నా కోపము నిప్పువలె రగుల్కొని ఆరకమండును.

15.          అంతట నేనిట్లింని:

               ప్రభూ! నీకంతయు తెలియును.

               నీవు నన్ను జ్ఞప్తియందుంచుకొని ఆదుకొనుము.

               నా తరపున నన్ను హింసించు వారిమీద

               పగ తీర్చుకొనుము.

               నీవు వారిపట్ల ఓర్పు చూపెదవేని

               వారు నన్ను చంపుదురు.

               నేను నీ కొరకే నిందలు

               అనుభవించుచున్నానని గ్రహింపుము.

16.          నీ పలుకులు నాకు దొరకగా

               నేను వాిని భుజించితిని.

               దేవుడవు సైన్యములకు అధిపతివైన ప్రభూ!

               నేను నీవాడను కనుక

               నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను.

               నా హృదయమునకు ప్రమోదము చేకూర్చెను.

17.          నేను ఆనందమున ఓలలాడు వారితో కలియలేదు.

               వారి సంతోషమున పాల్గొనలేదు.

               నీ ఆజ్ఞలకు బద్ధుడనై ఒంటరిగానుింని.

               నీవు నా యెడదను కోపాగ్నితో నింపితివి.

18.          నేను నిరంతరము బాధలను అనుభవింపనేల?

               నా గాయము చికిత్సకు లొంగదేల? మానదేల?

               నీవు నాకు వేసవిలో ఎండమావులవలె అయితివి,

               వ్టిపోవుటచే నమ్మదగనిదిగానుండు

               వాగువిం వాడవయ్యెదవా?

19.          నా మాటలకు ప్రభువు ఇట్లు సెలవిచ్చెను:

               నీవు నా వైపు తిరిగినచో నీవు నా సాన్నిధ్యమున నిలబడునట్లు నేను నిన్ను తిరిగిరప్పింతును.

               ఏవి అథమమైనవో, ఏవి మాన్యములైనవో

               నీవు గ్రహించినయెడల

               నీవు నా నోివలె ఉందువు.

               వారు నీ తట్టునకు తిరుగవలెనుగాని,

               నీవు వారు తట్టునకు తిరుగకూడదు.

20.        నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని

               ఇత్తడి ప్రాకారముగా చేయుదును.

               వారు నీతో పోరాడుదురు గాని

               నిన్ను గెలవజాలరు.

               నేను నీకు తోడుగానుండి నిన్ను రక్షింతును.

21.          దుష్టులనుండి నిన్ను కాపాడుదును.

               దౌర్జన్యపరులనుండి నిన్ను సంరక్షింతును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.