కుమ్మరి ఇంికడ ప్రవక్త
18 1-2 ప్రభువు నాతో ”లెమ్ము, నీవు కుమ్మరి ఇంికి పొమ్ము. అచట నీకు నా సందేశమును వినిపింతును” అని చెప్పెను.
3. కనుక నేను కుమ్మరి ఇంికి వెళ్ళి అతడు సారెమీద పనిచేయుటను చూచి తిని.
4. కుమ్మరి జిగటమన్నుతో తాను చేయుచున్న కుండ తన చేతిలో విడివడగా, అతడు మరల ఆ మ్టితో తగినరీతిగ మరియొక పాత్రను తయారు చేసెను.
5. అపుడు ప్రభువు స్వరము నాతో ఇట్లనెను: 6. ”యిస్రాయేలీయులారా! ఈ కుమ్మరి జిగటమ్టిని ఎట్లు మలచెనో, నేను మిమ్మును అటుల మలవకూడదా? కుమ్మరిచేతిలో మ్టివలె మీరును నా చేతిలో ఇమిడి పోయెదరు.
7. నేను కొన్నిమారులు ఏ జాతినైనను, ఏ రాజ్యమునైనను పెరికివేయుదుననియు, పడగొట్టు దుననియు, నాశనము చేయుదునననియు చెప్పి యుండవచ్చును.
8. కాని ఆ జాతి తన దుష్టవర్తనమును మార్చుకొన్నయెడల, నేను చేయుదునన్న కీడు చేయను.
9. నేను కొన్నిమారులు ఏ జాతినైనను, ఏ రాజ్యము నైనను నాటుదుననియు, కట్టుదుననియు మాట ఈయ వచ్చును.
10. కాని ఆ జాతి దుష్టకార్యములు చేసి నాకు విధేయురాలు కాదేని, నేను దానికి చేయుదు నన్న మేలును చేయను.
11. కనుక యిర్మీయా! నీవు యూదా ప్రజలతోను, యెరూషలేము పౌరులతోను నేను వారికి కీడు రప్పింతుననియు, వారిని శిక్షించు టకు సిద్ధముగా ఉన్నాననియు చెప్పుము. మీరు మీ దుర్మార్గమునుండి వైదొలగవలెననియు, మీ ప్రవర్త నను, కార్యములను మార్చుకోవలెనని చెప్పుము.
12. కాని వారు ‘మేము మారము. మేము మా ఇష్టము వచ్చినట్లుగా, మా దుష్టహృదయము చెప్పినట్లుగా చేయుదుము’ అని నీకు ప్రత్యుత్తరమిత్తురు.”
యిస్రాయేలు ప్రభువును నిరాకరించుట
13. ”ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
ఇి్ట చెయిదము పూర్వము ఎన్నడైనను
జరిగినదేమో జాతులను అడిగి తెలిసికొనుడు.
యిస్రాయేలీయులు ఘోరకార్యములు చేసిరి.
14. లెబానోను పర్వతశిఖరములనుండి
మంచు అంతరించునా?
ఆ కొండలలోపారు చల్లనియేరులు వ్టిపోవునా?
15. అయినను నా ప్రజలు నన్ను విస్మరించిరి.
వారు మోసమునకు ధూపము వేసిరి.
మెరకచేయబడని మార్గములలో
తాము నడువవలెనని పురాతన మార్గములైన
త్రోవలలో తమను తాము
తొిల్ల చేసుకొనుచున్నారు.
16. వారు తమ దేశమును పాడుచేసిరి.
ఆ నేలను చూచినవారెల్ల నవ్వుదురు.
దారిన పోవువారెల్ల ఆ దృశ్యమునుచూచి,
విభ్రాంతిచెంది తల ఊపుదురు.
17. నేను తూర్పుగాలికి దుమ్ము ఎగిరిపోవునట్లే
నా ప్రజలు శత్రువులదాడికి
ఎగిరిపోవునట్లు చేయుదును.
ఆపద వచ్చినపుడు వారికి
నా మొగము చూపింపను.”
యిర్మీయామీద కుట్ర
18. అపుడు ప్రజలు ”రండు, మనము యిర్మీయా మీద కుట్రపన్నుదము. అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు. జ్ఞానులు సలహా యిత్తురు. ప్రవక్తలు సందేశము విన్పింతురు. రండు మనము అతనిమీద నేరము మోపుదము. అతని బోధలు పెడచెవిని పెట్టుదము” అని అనిరి.
19. కావున నేనిట్లు ప్రార్థించితిని:
ప్రభూ! నీవు నా పలుకులు ఆలింపుము.
నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము.
20. మేలునకు కీడు చేయుదురా?
వారు నన్ను కూలద్రోయుటకు గోతినిత్రవ్విరి.
నేను నీ సమక్షమున నిలిచి వారిపక్షమున
నీకు మనవిచేసి, నీ కోపమును శాంతింపజేసితినని
జ్ఞప్తికి తెచ్చుకొనుము.
21. కనుక వారి పిల్లలు ఆకలివాత పడుదురుగాక!
కత్తివాతన చత్తురుగాక!
స్త్రీలు తమ మగలను, పిల్లలను
కోల్పోవుదురుగాక!
పురుషులు వ్యాధివాత బడుదురుగాక!
యువకులు యుద్ధమున కూలుదురుగాక!
22. నీవు దిఢీలున దోపిడికాండ్రను
వారి యిండ్ల మీదికి పంపగా,
వారు గావుకేకలు వేయుదురుగాక!
వారు నేను కూలుటకు గోతినిత్రవ్విరి.
నన్ను పట్టుకొనుటకు ఉచ్చులుపన్నిరి.
23. ప్రభూ! వారు నన్ను చంపుటకు
పన్నిన కుట్రలు నీకు తెలియును.
నీవు వారి దోషమును మన్నింపకుము.
వారి పాపములను తుడిచివేయకుము.
వారు ఓడిపోయి క్రిందపడునట్లు చేయుము.
నీవు కోపివిగా ఉన్న తరుణమున
వారికి శాస్తి చేయుము.