22 1. ప్రభువు నన్ను యూదారాజ ప్రాసాదము నొద్దకు పోయి ఈ సందేశము చెప్పుమనెను: 2. ”దావీదు వంశజుడైన యూదారాజును, అతని ఉద్యోగులును, యెరూషలేము పౌరులును ప్రభువు పలుకును ఆలింతురుగాక!
3. ఇది ప్రభువు వాక్కు. మీరు నీతిని, ధర్మమును పాింపుడు. వంచనకు గురియైన వారిని వంచకులనుండి కాపాడుడు. పర దేశులను, అనాథలను, వితంతువులను దోచుకొన కుడు, పీడింపకుడు. ఈ తావున నిర్దోషులను చంప కుడు.
4. మీరు చిత్తశుద్ధితో నా ఆజ్ఞలను పాింతురేని, దావీదువంశజులు రాజులుగా కొనసాగుదురు. వారును, వారి ఉద్యోగులును, ప్రజలును, రథముల పైనను, గుఱ్ఱములపైనను ఎక్కి ఈ ప్రాసాదద్వారముల గుండపోవచ్చును. 5. కాని మీరు నా ఆజ్ఞలు పాింప రేని ప్రభుడనైన నేను ప్రమాణముచేసి చెప్పుచున్నాను వినుడు. ఈ ప్రాసాదము నాశనమగును.
6. యూదా రాజప్రాసాదమునుగూర్చి ప్రభువు పలుకులివి:
‘గిలాదు మండలమువలెను,
లెబానోను కొండలవలెను యూదాప్రాసాదము
నాకు సుందరముగా కన్పించును.
అయినను నేను దానిని ఎడారి కావింతును,
నిర్మానుష్యము చేయుదును.
7. నేను దానిని ధ్వంసము చేయుటకు
జనులను పంపుచున్నాను.
వారు గొడ్డళ్ళతో వచ్చి సుందరములైన
దాని దేవదారు మొకరములను నరికి
అగ్నిలో బడవేయుదురు.
8. తరువాత అన్య జాతిజనులు ఈ నగరము ప్రక్కగా బోవుచు ప్రభువు ఈ మహానగరమునకు ఈ గతి ఎందుకు ప్టించెనని ఒకరినొకరు ప్రశ్నించు కొందురు.
9. మీరు మీ దేవుడనైన నా నిబంధనను విడనాడి అన్యదైవములను పూజించి సేవించితిరి కనుక మీకు ఈ గతి ప్టినదని వారు ఒకరి కొకరు జవాబు చెప్పుకొందురు.’ ”
యెహోవాహసును గూర్చి
10. యెరూషలేము ప్రజలారా!
మీరు చనిపోయిన వానినిగూర్చి విలపింపవలదు.
అతనికొరకు శోకాలాపము చేయవలదు.
కాని వెళ్ళిపోవుచున్న వానికొరకు దుఃఖింపుడు.
అతడిక తిరిగిరాడు,
తన మాతృదేశమును కనులతో చూడడు.
11. యోషీయాకు బదులుగా యూదా రాజైన అతని కుమారుడు యెహోవాహసు గూర్చి ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. ”అతడు ఈ తావునుండి వెడలిపోయెను. మరల ఇచికిరాడు.
12. అతడు తాను బందీగా వెడలిపోయిన దేశముననే కన్ను మూయును. ఈ నేలను మరల కన్నులతో చూడ జాలడు.”
యెహోయాకీమును గూర్చి
13. ”అధర్మమార్గమున అంతఃపురమును నిర్మించి,
అవినీతితో మీది అంతస్తును క్టించువాడు
నాశనమగును.
తోడివారితో ఊరకే చాకిరి చేయించుకొని
కూలి ఎగగొట్టువాడు నాశనమగును.
14. నేను విశాలమైన మీది గదులతో బ్రహ్మాండమైన
ప్రాసాదమును నిర్మింతుననుకొని,
దానికి గవాక్షములు ప్టిెంచి,
ఎఱ్ఱరంగు వేయించి, దానిని దేవదారు పలకలతో
అలంకరించువాడు సర్వనాశనమగును.
15. నీవు దేవదారు కొయ్యతో
ఇతరులకంటే మెరుగైన మేడను క్టించినందుననే
గొప్పరాజు వయ్యెదవా?
నీ తండ్రి అన్నపానములుకలిగి,
నీతి న్యాయములను అనుసరించి
క్షేమముగా ఉండలేదా?
16. అతడు దీనులైన పీడితులకు న్యాయము
జరిగించుచు సుఖముగా జీవించెను.
ప్రభువును ఎరుగుట అనగా ఇదియేకదా!
ఇది ప్రభువు వాక్కు.
17. కాని నీకు స్వార్ధాభిలాషతప్ప మరిఏమియు లేదు. నీవు నిర్దోషులను చంపించితివి.
దౌర్జన్యముతో ప్రజలను పీడించితివి.”
18. కనుక యోషీయా కుమారుడును,
యూదా రాజునగు యోహోయాకీమును గూర్చి
ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు:
” ‘అయ్యో! సోదరీసోదరులారా’ అనుచు
అతనికొరకు ఎవరును విలపింపరు.
‘రాజా, దేవరా’ అనుచు
అతని కొరకెవరును పరితపింపరు.
19. అతడిని చచ్చినగాడిదనువలె
ఆవలపారవేయుదురు.
బయికి ఈడ్చుకొనిపోయి యెరూషలేము
ద్వారములకు ఆవల విసరివేయుదురు.”
యెరూషలేము నాశనము గూర్చి
20. ”యెరూషలేము పౌరులారా!
మీరు లెబానోనుకొండకు వెళ్ళి అరువుడు.
బాషాను మండలమునకు వెళ్ళి ఏడ్వుడు.
అబారీము పర్వతము పైనుండి శోకింపుడు,
మీ ప్రియులు ఓడిపోయిరి.
21. మీరు వృద్ధిలోనున్నపుడు
ప్రభువు మీతో మ్లాడెను.
కాని మీరు ప్రభువు పలుకులు ఆలింపలేదు.
మీ జీవితకాలమంతటను ఇట్లే చేసితిరి.
ప్రభువు మాట ఏనాడును వినరైతిరి.
22. మీ కాపరులు గాలికి కొట్టుకొనిపోవుదురు.
మీ మిత్రవర్గములు బందీలగును.
మీరు చేసిన దుష్కార్యములవలన
మీరు అవమానముతో తలవంచుకొందురు.
23. మీరు లెబానోనునుండి కొనివచ్చిన
దేవదారు కలపల మధ్య సురక్షితముగా ఉన్నారు. కాని మీకు బాధలు వచ్చినపుడు,
పురినొప్పులు సంభవించినపుడు
మీరు బోరున ఏడ్తురు.”
యెహోయాకీనును గూర్చి
24. ”యెహోయాకీము కుమారుడును యూదా రాజునగు యెహోయాకీనును గూర్చి ప్రభువు ఇట్లు పలికెను: నేను సజీవుడనైన దేవుడను. నీవు నా కుడిచేతనున్న ముద్రాంగుళీయకమువిం వాడవైనను, నేను నిన్ను నా వ్రేలినుండి తొలగింతును.
25. నీవు ఎవరికి భయపడుచున్నావో, నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో వారిచేతికి అనగా, బబులోనియా రాజగు నెబుకద్నెసరునకును, అతని సైనికులకును నిన్ను అప్పగింతును.
26. నిన్నును, నిన్ను కన్న తల్లిని గూడ ప్రవాసమునకు న్టెివేయుదును. మీరిరువురును మీరు పుట్టని అన్యదేశమునకు వెడలిపోవుదురు. అచటనే చత్తురు.
27. మీరీ దేశమునకు తిరిగి రాగోరుదురుగాని రాజాలరు.”
28. నేను ఇట్లనుకొింని:
ఈ యెహోయాకీను
పగిలినకుండవింవాడు అయ్యెనా?
ఎవరికిని అక్కరపట్టనందున
అతనిని విసరి పారవేయుదురా?
అతనిని అతని పిల్లలను తామెరుగని
అన్యదేశమునకు ప్రవాసమునకు
కొనిపోవునది ఇందులకేనా?
29. ఓ దేశమా! దేశమా! దేశమా!
ప్రభువేమి పలికెనో వినుము.
30. ”సంతానహీనుడనియు,
విజయమును సాధింపజాలనివాడనియు
మీరితనిని గూర్చి జాబితాలో లిఖింపుడు.
ఇతని కుమారులలో ఎవ్వడును
దావీదు సింహాసనమునెక్కి
యూదాను పరిపాలింపడు.”
ఇది ప్రభుడనైన నా వాక్కు.