యిర్మీయా గెదల్యా దగ్గర వసించుట

40 1. అంగరక్షకుల అధిపతియైన నెబూజరదాను  యూదా, యెరూషలేములనుండి బబులోనియాకు బందీలనుగా కొనిపోబడిన ప్రజలతోపాటు సంకెళ్ళతో బంధింపబడియున్న యిర్మీయాను బంధవిముక్తిని గావించి రామావద్దనుండి అతనిని పంపివేయగా, ప్రభువునుండి అతనికి వినిపించిన వాక్కు.

2. ఆ అంగ రక్షకుల అధిపతి యిర్మీయాను ప్రక్కకు కొనిపోయి ఇట్లనెను: ”నీ దేవుడైన ప్రభువు ఈ దేశమునకు వినా శము దాపురించునని చెప్పెను.

3. ఇపుడు తాను చెప్పి నట్లే చేసెను. మీరు యావేదేవుని మాటమీరి పాపము కట్టుకొింరి. కనుక ఇదంతయు జరిగెను.

4. నేని పుడు నీ చేతులనుండి సంకెళ్ళను తొలగించి నిన్ను విడిపించుచున్నాను. నీవు నాతో బబులోనియాకు రాగోరెదవేని రమ్ము. నేను నిన్ను పరామర్శింతును. కాని నావెంట బబులోనియాకు వచ్చుటకు ఇష్టపడవేని నిర్బంధమేమియులేదు. ఇంత విశాలమైన దేశమున్నది. నీవు నీ ఇష్టము వచ్చిన చోికి వెళ్ళవచ్చును.”

5. ఆ మాటలకు యిర్మీయా మౌనము వహించుట చూచి నెబూజరదాను మరల ఇట్లనెను: ”నీవు షాఫాను మను మడును, అహీకాము కుమారుడునైన గెదల్యావద్దకు పొమ్ము. బబులోనియా రాజు అతడిని యూదా నగర ములకు  అధికారినిగా నియమించెను. నీవు అతని చెంతకుపోయి మీ ప్రజలనడుమ వసింపవచ్చును. లేదేని నీ ఇష్టము వచ్చిన చోికిపొమ్ము.” ఇట్లు చెప్పి అతడు యిర్మీయాకొక బహుమతిని, ప్రయాణమునకు భోజన మును ఇచ్చి అతనిని సాగనంపెను.

6.యిర్మీయా అంతట మిస్ఫాలోనున్న గెదల్యావద్దకు వెళ్ళి అతడితో కలిసి యూదాదేశమున మిగిలియున్న ప్రజలనడుమ వసించెను.

దేశాధికారియైన గెదల్యా

7. కొందరు యూదా అధికారులును, సైనికులును బబులోనీయులకు లొంగలేదు. వారు బబులోనియా రాజు గెదల్యాను దేశమునకు అధికారినిగా నియ మించెనని వినిరి. బబులోనియాకు బందీలుగా వెళ్ళని స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశములోని నిరుపేద లందరికిని అతనిని అధికారిని చేసిరని తెలిసికొనిరి.

8. కావున నెతన్యా కుమారుడగు యిష్మాయేలు, కారెయా కుమారుడైన యోహానాను, తన్హూమెతు కుమారుడైన సెరాయా, నేోఫా నివాసియైన యేఫయి కుమారులు, మాకా నివాసియైన యోసన్యా తమ అనుచరులతో కలిసి మిస్ఫాలోనున్న గెదల్యా చెంతకు వచ్చిరి.

9. గెదల్యా వారితో నేను మీకు ప్రమాణముచేసి చెప్పుచున్నాను. ”మీరు భయపడకుడు, బబులోనీయు లకు లొంగిపోవుటకు వెనుకాడకుడు. ఈ నేలమీద స్థిరపడి బబులోనియారాజును సేవింపుడు. మీకు మేలు కలుగును.

10. నా మట్టుకు నేను మిస్ఫా యందు వసింతును. బబులోనీయులు ఇచికి వచ్చి నపుడు వారికి మీ తరుఫున ప్రతినిధినిగా ఉందును. మీరు ద్రాక్షారసమును, పండ్లను, ఓలివు తైలమును చేకూర్చుకొని మీరు స్వాధీనము చేసికొనిన గ్రామము లలో వసింపవచ్చును.” అని అనెను.

11. మోవాబు, అమ్మోను, ఎదోము మరియు ఇతర దేశములలోనున్న యూదులు బబులోనీయారాజు కొందరు యిస్రాయేలీ యులను యూదాలో నుండనిచ్చెనని వినిరి. అతడు గెదల్యాను అధికారినిగా చేసెననియు తెలిసికొనిరి.

12. కనుక వారు తాము చెల్లాచెదరైయున్న దేశముల నుండి యూదాకు తిరిగివచ్చి మిస్ఫాయందున్న గెదల్యా చెంతకు చేరిరి. అచట ద్రాక్షసారాయమును, పండ్లను విస్తారముగా ప్రోగుజేసికొనిరి.

గెదల్యా హత్య

13. అటుతరువాత కారెయా కుమారుడైన యోహానానును ఆయాచోటులనున్న దండుల నాయకు లందరును మిస్ఫాయందున్న గెదల్యా చెంతకువచ్చి.

14. ”అయ్యా! అమ్మోనురాజైన బాలీసు నిన్ను వధించుటకుగాను నెతన్యాకుమారుడైన యిష్మాయేలును పంపెను. ఈ సంగతి నీకు తెలియదా?” అనిరి. కాని గెదల్యా వారి మాటలు  నమ్మలేదు.

15. అంతట యోహానాను గెదల్యాతో రహస్యముగా, ”నేను వెళ్ళి యిష్మాయేలును చంపుదును. అతనినెవరు చంపిరో జనులు గుర్తింపజాలరు. అతడు నిన్ను హత్యచేయ నేల? నీవు గతించినచో నీ చుట్టుచేరియున్న యూదు లెల్ల మరల చెల్లాచెదరవుదురు. యూదాలో మిగిలి యున్న వారెల్ల నశింతురు” అనెను.

16. కాని గెదల్యా ”నీవ్టిపని చేయకుము. నీవు చెప్పుసంగతి నిజము కాదు” అని అనెను.