ఆహాసునకు మొది హెచ్చరిక

7 1. ఉజ్జీయా మనుమడును, యోతాము కుమారు డునైన ఆహాసు, యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజైన రెజీను మరియు రెమల్యా కుమారుడును, యిస్రాయేలు రాజగు పెక యెరూషలేమును ముట్టడించిరిగాని, దానిని పట్టుకోజాలరైరి.

2. సిరియా సైన్యము ఎఫ్రాయీముతో జతకట్టె నని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజును, ప్రజలును పెనుగాలికి అరణ్యములోని చెట్లవలె తల్లడిల్లిరి.

3. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను: ”నీవు నీ కుమారుడైన షెయార్యాషూబు2తో పోయి పైకోనేి నుండి పారు కాల్వచెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలిసికొనుము.

4. అతనితో ఇట్లు చెప్పుము:

               ‘నీవు జాగ్రత్తగానుండుము, భయపడకుము

               నెమ్మదిగానుండుము,

               నిరుత్సాహము చెందకుము.

               ఆరిపోవుటకు సిద్ధముగానున్న

               ఈ రెండు నిప్పుకొయ్యలకును వెరవకుము.

               సిరియనుల రాజు రెజీను మరియు

               రెమల్యా కుమారుడు పెక

               అనువారి కోపాగ్నికి జడియకుము.’

5.           సిరియాయు, యిస్రాయేలీయులును

               రెమల్యా కుమారుడును కలిసి నీమీద కుట్రపన్నిరి.

6.           వారు ”యూదా మీదికి దాడిచేసి,

               దానిని భయప్టిె స్వాధీనము చేసుకొందము.

               టబెయేలు కుమారుని

               దానికి రాజును చేయుదము” అనుకొనిరి.

7.            కాని ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. అది నిలువజాలదు. అటుల జరుగజాలదు.

8.           సిరియా రాజధాని దమస్కు.

               రెజీను దమస్కునకు అధిపతి.

               అరువది ఐదేండ్లు గడవకముందే

               యిస్రాయేలు ముక్కలుచెక్కలుకాగా

               అచట ప్రజలు ఒక జాతిగా మనజాలరు.

9.           యిస్రాయేలు రాజధాని సమరియా.

               రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి.

               నా పలుకులు నమ్మవేని

               నీవు అసలు నిలువజాలవు.”

రెండవ హెచ్చరిక ఇమ్మానుయేలు గుర్తు

10.         ప్రభువు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను: 11.”నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింది నుండియైనను లేక ఆకాశముపైనుండియైనను చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును.”

12. కాని ఆహాసు ”నేను ఏ గుర్తును అడుగను. నేను ప్రభువును పరీక్షకు గురిచేయను” అని అనెను.

13. అంతట యెషయా ఇట్లనెను:

”దావీదు వంశరాజులారా వినుడు!

మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు

నా దేవునిగూడ విసిగించుచున్నారు.

14.          సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును.

               యువతి2 గర్భవతియై ఉన్నది.

               ఆమె కుమారుని కని

               అతనికి ఇమ్మానుయేలు3 అని పేరుపెట్టును.

15.          అతడు పెరిగి పెద్దవాడై, చెడును నిరాకరించి,

               మంచిని చేపట్టుకాలము వచ్చువరకు

               తేనెను, పెరుగును ఆరగించును.    

16.          అతడు విచక్షణాజ్ఞానముతో చెడును విడనాడి

               మంచిని చేపట్టుకాలము రాకమునుపే

               నిన్నింతగా భయపెట్టుచున్న

               ఈ ఇరువురురాజుల దేశములు నిర్మానుష్యమగును.

17.          నీకును, నీప్రజలకును, రాజకుటుంబమునకును

               ప్రభువు కడగండ్లు తెచ్చును.

               యిస్రాయేలు రాష్ట్రము యూదానుండి

               విడిపోయినప్పినుండి నేివరకు అి్టతిప్పలు

               మీరు ఏనాడును అనుభవించియుండరు.

               అతడు అస్సిరియారాజును మీమీదికి గొనివచ్చును.

18.          ఆ దినమున ప్రభువు ఈలవేసి,

               దూరముననున్న ఐగుప్తు నదీతీరమునుండి

               జోరీగలను రప్పించును.

               అస్సిరియానుండి తుమ్మెదలను పిలిపించును.

19.          అవి వచ్చి మిట్టపల్లాలతో గూడిన

               మీలోయలలోను, కొండగుహలలోను,

               ముండ్లపొదలలోను, పచ్చికపట్టులలోను దిగును.

20.        ఆ రోజున ప్రభువు యూఫ్రీసు నదికి

               ఆవలి తీరము నుండి

               తాను బాడుగకు తెచ్చుకొన్న కక్షురకత్తితో –

               అనగా అస్సిరియా రాజుతో –

               మీ తలవెంట్రుకలు, కాళ్ళ వెంట్రుకలు,

               గడ్డములు కూడ  గొరిగివేయును.

21.          ఆ కాలము వచ్చినపుడు

               మీలో ఒక్కొక్కడు ఒక ఆవుపెయ్యను,

               రెండుమేకలను పెంచుకొనును.

22.        అవి సమృద్ధిగా పాలిచ్చును.

               కనుక వానిని పెంచుకొనినవాడు

               పెరుగును ఆరగించును.

               దేశమున మిగిలిన కొద్దిమందియు తేనెను,

               పెరుగును భుజింతురు.

23.        ఆ కాలము వచ్చినపుడు

               వేయి ద్రాక్షతీగలతో అలరారుచు,

               వేయి వెండి నాణెముల ఖరీదుచేయు

               ద్రాక్షతోటలు ముండ్లపొదలతో నిండిపోవును.

24.         దేశమంతట ముండ్లతుప్పలు ఎదుగును.

               గనుక ప్రజలు విల్లమ్ములతో వేటకుపోవుదురు.

25.        ఇపుడు మీరు సాగుచేయుచున్న కొండలమీద అప్పుడు ముండ్లతుప్పలు ఎదుగును.

               గాన ఆ తావులకెవడును వెళ్ళడు.

               ఆ తావులు గొడ్లు  తోలుటకును, గొఱ్ఱెమేకలు తిరుగాడుటకును మాత్రము ఉపయోగపడును.