10 1.       అన్యాయమైన విధులను అమలు పరచి

               ప్రజలను పీడించు శాసనములు జారీ

               చేయువారు శాపగ్రస్తులు.

2.           ఆ శాసనకర్తలు దీనులకు న్యాయము

               జరుగనీయరు. నా ప్రజలలో పేదలైనవారి

               హక్కులను భంగపరతురు.

               వితంతువుల సొత్తును అపహరింతురు.

               అనాథశిశువులను దోచుకొందురు.

3.           దర్శనదినము సమీపించినపుడు,

               దూరదేశమునుండి వినాశనము

               దాపురించినపుడు, మీరేమి చేయుదురు?

               సహాయార్థము ఎవరి వద్దకు పరుగెత్తెదరు?

               మీ సొత్తును ఎచట దాచియుంతురు?

4.           మీరు యుద్ధమున చత్తురు.

               లేదా శత్రువులకు చిక్కి బందీలు అగుదురు.

               అయినను ప్రభువుకోపము ఇంకను

               ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు

               చాచిన బాహువును దించలేదు.

అస్సిరియా రాజునకు శిక్ష

5.           నేను కోపించిన వారిని శిక్షించుటకు

               దండముగాను, దుడ్డుకఱ్ఱగాను

               అస్సిరియాను వాడుకొందును.

6.           నా కోపము రెచ్చగొట్టెడు భక్తిహీనులను

               శిక్షించుటకు నేను అస్సిరియాను పిలిచితిని.

               అస్సిరియనులు ఆ జనులను కొల్లగ్టొి

               వారి సొత్తునెల్ల అపహరింతురు.

               వారిని  వీధులలోని  బురదవలె త్రొక్కి వేయుదురు.

7.            కాని అస్సిరియా రాజు ఇట్లు భావింపలేదు,

               ఇి్ట ఆలోచన చేయలేదు.

               చాలజాతులను హతమార్పవలెనని అతని తలంపు.

8.           అతడిట్లు తలపోసెను.

               ”నా సైన్యాధిపతులెల్ల రాజులు కారా?

9.           కల్నో కర్కెమీషువలె ఉండలేదా?

               హమాతు అర్పాదువలె ఉండలేదా?

               సమరియా దమస్కువలె ఉండలేదా?

10.         యెరూషలేము, సమరియాల

               కంటెగూడ ఎక్కువ విగ్రహములను

               పూజించు దేశములనే శిక్షించితిని.

11.           నేను సమరియాను, అందలి విగ్రహములను

               పాడుచేసినట్లుగా యెరూషలేమును అందలి

               విగ్రహములను నాశనము చేయలేనా?”

12. కాని ప్రభువు సియోనుకొండ మీదను, యెరూషలేమునను తన పనినంతిని ముగించిన పిదప, అస్సిరియా రాజు ప్రగల్భములకును, పొగరు నకును అతనిని శిక్షించితీరును.

13. అస్సిరియా ప్రభువిట్లు గొప్పలు చెప్పుకొనెను: ”నా బలము వలననే నేనీకార్యములెల్ల చేసితిని. నేను తెలివితేటలు, ప్రజ్ఞ  కలవాడను.

               జాతుల మధ్యగల  సరిహద్దులను తుడిచివేసి

               వారి సంపదలనెల్ల దోచుకొింని.

               శూరుడనై ఆ జాతులను నా కాలితో తొక్కితిని.

14.          పక్షిగూి మీదవలె

               జాతుల సొత్తుమీద చేయి వేసితిని.

               గూిలోని గ్రుడ్లను ఒకడు ఏరుకొనినట్లుగా

               లోకములోని సకలజాతుల

               సంపదలను గైకొింని. నన్ను భయపెట్టుటకు

               ఒక్క జాతియు రెక్కలాడింపలేదు.

               ముక్కు తెరచి కిచకిచలాడలేదు.”

15.          కాని గొడ్డలి తనను

               ఉపయోగించువానికంటే గొప్పదా?

               రంపము తనను

               వినియోగించువానికంటే శ్రేష్ఠమైనదా?

               కోల తనను ఎత్తువానిని ఆడించినట్లును,

               దండము కర్రకానివానిని

               ఎత్తినట్లును ఉండును కదా!

16.          కనుక సైన్యములకధిపతియైన ప్రభువు

               బలిసియున్న అస్సిరియులను

               వ్యాధివలన చిక్కిపోవునట్లు చేయును.

               వారి దేహములో అగ్ని కణకణమండును.

17.          యిస్రాయేలునకు

               వెలుగైన ప్రభువు అగ్నియగును.

               యిస్రాయేలు పవిత్రదేవుడు మంటయగును.

               ఆ నిప్పు ఒక్క రోజుననే

               ముండ్ల తుప్పలనెల్ల కాల్చి భస్మముచేయును.

18.          ఘోరవ్యాధి నరుని నాశనముచేసినట్లే

               ఆ జ్వాల పెరిగిన అతని అడవిని,

               పండినపొలమును పూర్తిగా దహించివేయును.

19. కాలిన అడవిలో చెట్లు

               కొద్దిసంఖ్యలో మాత్రమే మిగులును.

               పసిబిడ్డడు కూడ వానిని లెక్కపెట్టగలడు.

షేయార్యాషూబు నామము

20.        ఆ రోజున యిస్రాయేలీయులలో

               శేషముగా ఉన్నవారు,

               యాకోబువంశమున తప్పించుకొనినవారు,

               తమను నాశనముచేసిన జాతిమీద ఆధారపడరు.

               సత్యమునుబ్టి

               యిస్రాయేలు పవిత్రదేవుడైన ప్రభువుమీదనే

               వారు నిజముగా ఆధారపడుదురు.

21.          యిస్రాయేలీయులలో శేషజనము మాత్రమే

               బలాఢ్యుడైన తమ దేవునివద్దకు తిరిగివత్తురు.

వినాశనమును గూర్చిన ప్రవచనము

22. యిస్రాయేలీయులు సముద్రపు ఒడ్డుననున్న ఇసుకరేణువులవలె అసంఖ్యాకముగానున్నను, కొద్దిమంది శేషజనులు మాత్రమే తిరిగివత్తురు. వారికి వినాశము దాపురించినది. అది యుక్తమైనదే.

23. సైన్యములకధిపతియైన ప్రభువు తాను తలప్టిెనట్లే దేశమంతిని వినాశమునకు గురిచేయును.

అస్సిరియాకు శిక్ష

24.         సైన్యములకధిపతియైన ప్రభువు

               ఇట్లు పలుకుచున్నాడు:

               ”సియోనున వసించు ప్రజలారా!

               అస్సిరియనులు ఐగుప్తీయులవలె

               మిమ్ము దుడ్డుగఱ్ఱతోబాది,

               మీమీదికి దండమును ఎత్తినను

               మీరు భయపడకుడు.

25.        కొద్దికాలములోనే మీపై

               నాకుగల కోపము చల్లారును.

               అప్పుడు నేను వారిని సర్వనాశనము చేయుదును.

26.        సైన్యములకధిపతియును ప్రభుడనైన నేను

               పూర్వము ఓరేబుశిలవద్ద మిద్యానీయులను

               హతముచేసినట్లు వారిని కొరడాతో మోదుదును.

               ఐగుప్తును, సముద్రమును దండించినట్లుగా

               వారిని దండింతును.

27.         ఆ దినమున అస్సిరియా బరువు

               మీ భుజముల మీదినుండి జారిపడును.

               దాని కాడి మీ మెడమీదినుండి తొలగిపోవును.”

శత్రువుల దాడి

28.        అస్సిరియనులు అయ్యాతును

               స్వాధీనము చేసికొనెను.

               వారు మిగ్రోనుగుండ పయనించి

               మిక్మషులో వస్తువులను నిలువజేసిరి.

29.        కనుమసందు దాి గేబావద్ద రాత్రి విడిదిజేసిరి.

               వారిని గాంచి రామా పౌరులు భీతిల్లిరి.

               సౌలునగరమైన గిబ్యా నివాసులు పారిపోయిరి.

30.        గల్లీము ప్రజలారా! కేకలు పెట్టుడు.

               లాకీషు జనులారా! వినుడు.

               అనాతోతు పౌరులారా! జవాబు చెప్పుడు.   

31.          మద్మేనా పౌరులు పారిపోవుచున్నారు.

               గెబీము ప్రజలు తప్పించుకొనిపోవుచున్నారు.

32.        నేడే శత్రువులు నోబు నగరమున ఆగుదురు.

               వారు సియోనుకొండను, యెరూషలేమును

               గాంచి కోపముతో పిడికెళ్ళు బిగబట్టుదురు.

33.        కాని సైన్యములకధిపతియైన ప్రభువు

               వారిని కొమ్మలవలె నరకగా,

               వారు గబాలున నేలగూలుదురు.

               ఆయన ఉన్నతములైన శాఖలను ఛేదించును.

               గర్వోన్నతములైన కొమ్మలు నేలకొరుగును.  

34.         ప్రభువు గొడ్డలితో అడవిపొదలను నరికివేయును.

               లెబానోను వృక్షరాజములను గూడ పడగొట్టును.