శాంతియుతుడైన రాజు
11 1. ఈషాయి మొద్దునుండి ఒక పిలక పుట్టును. అతని వేరులనుండి ఒకకొమ్మ ఎదుగును.
2. దేవునిఆత్మ అతనిపై నిలుచును
అది విజ్ఞానమును, వివేకమును ఒసగు ఆత్మ.
దూరదృష్టిని, బలమును ప్రసాదించు ఆత్మ.
దైవజ్ఞానమును, దైవభీతిని దయచేయు ఆత్మ.
3. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు కించూపునుబ్టి తీర్పుతీర్చడు.
తాను వినుదానినిబ్టి నిర్ణయములు చేయడు.
4. అతడు దీనులకు న్యాయముతో తీర్పుచెప్పును. పేదలకు నీతితో న్యాయనిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును.
అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును.
5. అతడు న్యాయమును నడికట్టువలె ధరించును. సత్యమును ద్టీవలె తాల్చును.
6. తోడేలు గొఱ్ఱెపిల్లతో కలిసి జీవించును. చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. లేగదూడ, కొదమసింగము కలిసిమేయును. చిన్నబాలుడు వానిని తోలుకొనిపోవును.
7. ఆవును, ఎలుగుబింయు కలిసి మేతమేయును. వాని పిల్లలు కలిసిపడుకొనును.
సింహము ఎద్దువలె గడ్డిమేయును.
8. చింబిడ్డడు
త్రాచుపాము పుట్టమీద ఆడుకొనును.
పసిబిడ్డడు
విషసర్పము బొరియలో చేయిపెట్టును.
9. నా పరిశుద్ధపర్వతమంతిమీద,
క్రూరమృగములు ఎి్టహానియు,
ఎి్టకీడును చేయవు.
సముద్రము జలముతో నిండియున్నట్లు,
దేశమంతయు
ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.
బందీలు తిరిగి వచ్చుట
10. ఆ దినమున ఈషాయివంశమున ప్టుిన రాజు
జాతులకు ఆకర్షణీయమైన ధ్వజముగా
ఉండును, జాతులు అతనిచెంతకు వచ్చును.
అతని నగరము ఖ్యాతినిబడయును.
11. ఆ దినమున ప్రభువు మరల
తనశక్తిని ప్రదర్శించును.
అతడు అస్సిరియాలో నుండియు,
ఐగుప్తులో నుండియు, పత్రోసులో నుండియు, కూషులో నుండియు, ఏలాములో నుండియు,
షీనారులో నుండియు, హమాతులో నుండియు
సముద్రతీరమునందలి ద్వీపములలో నుండియు
తన ప్రజలలో మిగిలియున్నవారిని విడిపించి,
స్వీయదేశమునకు రప్పించుటకు రెండవమారు
ప్రభువు తనబాహువును చాపును.
12. అతడు జాతులకు ధ్వజమును ఎత్తిచూపును.
భ్రష్టులైన యిస్రాయేలీయులను
చెదరిపోయిన యూదా ప్రజలను
నేలనాలుగు చెరగులనుండి ప్రోగుజేయును.
13. అపుడు ఎఫ్రాయీముకున్న
అసూయ సమసిపోవును.
యూదాశత్రువులు అంతరింతురు.
ఎఫ్రాయీము యూదామీద అసూయపడదు.
యూదా ఎఫ్రాయీమును పీడింపదు.
14. ఆ రెండు రాజ్యములు కలిసి
పడమరన ఫిలిస్తీయులమీద పడును.
తూర్పుసీమలలో వసించువారిని కొల్లగొట్టును.
ఎదోము, మోవాబులను
స్వాధీనము చేసికొనును.
అమ్మోనీయులను లొంగదీసికొనును.
15. ప్రభువు ఐగుప్తు సముద్రపుపాయ
వ్టిపోవునట్లు చేయును.
వేడిమిగల తన ఊపిరిని ఊది
యూఫ్రీసుమీద తనచేతిని ఆడించును.
ఆ నదిని ఏడుసన్నని పాయలుగా విభజించును.
పాదరక్షలు తడువ కుండగనే
పొడినేలన ప్రజలు దానిని దాిపోవుదురు.
16. అస్సిరియాలో మిగిలియున్న
ప్రభువు ప్రజలు తిరిగివచ్చుటకు
ఒక రాజపథము ఏర్పడును.
అది పూర్వము యిస్రాయేలీయులు
ఐగుప్తునుండి మరలి వచ్చినపుడు
ఏర్పడిన మార్గమువిందగును.