ప్రజలు ప్రవాసము నుండి తిరిగి వచ్చుట

14 1. ప్రభువు మరల యాకోబును కరుణించును. యిస్రాయేలీయులను మరల తనవారినిగా ఎన్నుకొని స్వీయదేశమున వసింపజేయును. అన్యదేశీయులు యాకోబు కుటుంబముతో కలియుదురు. వారితో కలసి జీవింతురు.

2. అన్యజాతులు వారిని వారి సొంత దేశమునకు కొనివత్తురు. యిస్రాయేలీయులు ప్రభువుదేశమున ఆ అన్యజాతులను దాసులనుగా, పనికత్తెలనుగా వినియోగించుకొందురు. వారు తమను బంధించిన వారిని బంధింతురు. తమను పీడించిన వారిని దాసులుగా ఏలుదురు.

ప్రజాపీడకుని మృతికి అపహాసగీతము

3. ప్రభువు మీ బాధలనుండియు, వేదనల నుండియు, నిర్బంధముగా మీ నెత్తినబడిన వ్టెిచాకిరి నుండియు మీకు విశ్రాంతిని ఒసగును.

4. ఆ రోజున మీరు బబులోనియా రాజును గూర్చి ఈ అపహాస గీతము విన్పింపుడు:

               ”ప్రజాపీడకుడెట్లు నశించెను?

               అతని పీడన ఎట్లు అడుగంటెను?

5.           ప్రభువు దుష్టుల దండమును విరిచెను.

               పీడకుల రాజదండమును విరుగగొట్టెను.

6.           వారు ప్రజలను ఆగ్రహముతో మోదిరి.

               దెబ్బల మీద దెబ్బలు క్టొిరి.

               జాతులను క్రూరముగా పీడించిరి.

               వారి హింసలకు అంతరాయము లేదయ్యెను.

7.            ఇపుడు లోకమంతయు శాంతిని,

               విశ్రాంతిని అనుభవించును.

               జనులెల్లరు ఆనందముతో పాడుదురు.

8.           తమాలవృక్షములును, లెబానోను దేవదారులును

               ఆ ప్రజాపీడకుని పతనమును చూచి

               ఆనందించును. అవి ‘అతడు చచ్చెను గనుక

               ఇక మమ్మెవ్వరును నరకరు’ అని యెంచును.

9.           ఓయి ! అధోలోకములోని పాతాళము

               నీకు స్వాగతమిచ్చుటకై వేచియున్నది.

               అది ఈ లోకమున గొప్పవారుగా చలామణి

               ఐనవారి ప్రేతములను మేల్కొల్పుచున్నది.

               నీకొరకు సకలజాతుల రాజులను

               వారివారి సింహాసనముల పైనుండి లేపుచున్నది.

10.         వారెల్లరును నిన్ను గాంచి:

               ‘ఓహో! నీవును మావలె దుర్బలుడవైతివా?

               నీవునూ మా వింవాడవైతివా?

11.           నీ వైభవములు నీ వీణాగానములు

               పాతాళమున పడిపోయినవి కదా!

               నీవు పురుగుల పాన్పుమీద పరుండెదవు.

               క్రిములు నిన్ను బట్టవలె కప్పును’

               అని పలుకుదురు.

12.          ఓ వేగుచుక్క! తేజోనక్షత్రమా!

               నీవెట్లు ఆకాశమునుండి పడితివి?

               జనములను పడగ్టొిన నీవు నేలమట్టమువరకు

               ఎట్లు నరకపడితివి?

13.          నీవు నీమనసులో ‘నేను ఆకాశముమీదికి

               అధిరోహింతును. ఉన్నత తారలకు పైగా

               నా సింహాసనమును నెలకొల్పుదును.

               ఉత్తరదిక్కున దేవతలు సభదీర్చు పర్వతముపైన

               రాజుగా ఆసీనుడనగుదును.

14.          మేఘమండలము మీదికెగిసి మహోన్నతునికి

               సాివాడనగుదును’ అని భావించితివి.

15.          కానీ నీవు ఇప్పుడు ఈ పాతాళలోకమున,

               ఈ అగాథపు అంతర్భాగమున పడితివి.

16.          నిన్ను చూచినవారు నీ వైపు తేరి పారజూతురు.

               భూమినెల్ల గడగడలాడించినవాడును,

               రాజ్యములను కంపింపచేసినవాడును,         

17.          ప్రపంచమును ఎడారి కావించినవాడును,

               నగరములను నేలమట్టము చేసినవాడును,

               తన బందీలకు ఏనాడును విముక్తి

               దయచేయనివాడును ఇతడేనా అని పలుకుదురు.

18.          భూలోకపు రాజులెల్లరు వైభవముగా

               తమ సమాధులలో పవ్వళింతురు.

19.          కాని నీకు సమాధిలేదు

               నీ శవమును వెలుపలపారవేసిరి.

               అది కుళ్ళిపోవును. అది పోరున కత్తివాతబడిన

               వారి పీనుగులచే కప్పబడెను.

               శత్రువులు ఆ పీనుగులతోపాటు దానినిగూడ

               రాతిగుంతలో పడవేసి కాళ్ళతోత్రొక్కిరి.

20.        నీవు నీ దేశమును నాశనము చేసి

               నీ ప్రజలను మట్టుప్టిెతివి.

               కనుక ఇతర రాజులకువలె

               నీకు భూస్థాపనములేదు.

               దుర్మార్గుల సంతానముపేరు విన్పింపరాదు.

21.          తండ్రుల అపరాధములకుగాను

               తనయులను వధింపుడు.

               వారుమరల విజృంభించి

               దేశములను ఏలకుందురుగాక!

               లోకమున  నగరములను  నిర్మింపకుందురుగాక!”

బబులోనియా నాశనము గూర్చి దైవవాక్కు

22. సైన్యములకధిపతియైన ప్రభువిట్లు నుడువు చున్నాడు: ”నేను బబులోనియాను ముట్టడించి సర్వ నాశనము చేయుదును. పిల్లలను భావితరములను ఎవరిని మిగులనీయను. ఇది ప్రభువు వాక్కు.

23. నేను ఆ దేశమును చిత్తడినేలను చేయుదును. ముళ్ళ పందులు అచట వసించును. ఆ దేశమును వినాశ మను చీపురుతో ఊడ్చివేయుదును. ఇది సైన్యముల కధిపతియైన ప్రభువు వాక్కు”.

అస్సిరియా ధ్వంసమగును

24.         సైన్యములకధిపతియైన ప్రభువు

               ప్రమాణ పూర్వకముగా ఇట్లు చెప్పుచున్నాడు:

               ”నేను సంకల్పించిన కార్యము నెరవేరును.

               నేను నిర్ణయించిన పని జరిగితీరును.

25.        నేను నా దేశమున అస్సిరియాను

               నాశనము చేయుదును.

               నా పర్వతముల మీద దానిని అణగద్రొక్కుదును.

               అస్సిరియా తమమీద మోపిన కాడినుండియు,

               తమ నెత్తిమీదకెత్తిన బరువులనుండియు

               యిస్రాయేలు ప్రజలు తప్పించుకొందురు.

26.        సర్వలోకమును గూర్చిన నా సంకల్పమిది.

               సర్వజాతులను శిక్షించుటకు

               చాపబడిన నా హస్తమిది.

27.         సైన్యములకధిపతియైన ప్రభువు నిర్ణయము

               చేసినపుడు దానిని భంగపరుపగలవాడెవడు?

               ప్రభువు శిక్షించుటకు బాహువుచాచిననాడు

               ఆయనను వారింపగలవాడెవడు?”

ఫిలిస్తీయులకు హెచ్చరిక

28. ఆహాసురాజు మరణించిన సంవత్సరము

               వచ్చిన దైవవాక్కు:

29.        ”ఫిలిస్తీయా! నిన్ను శిక్షించుదండము

               విరిగి పోయినదని సంతసింపకుము.

               సర్పబీజము నుండి మిన్నాగుపుట్టును.

               దాని ఫలము ఎగురు కాలకూటసర్పము.

30.        ప్రభువు అతిపేదలకు కడుపార అన్నముపెట్టును.

               దరిద్రులు సురక్షితముగా మనుదురు.

               కాని ఆయన నీ సంతానమును ఆకితో చంపును.

               నీ ప్రజలలో మిగిలియున్నవారిని

               నాశనము చేయును.  

31.          ఫిలిస్తీయా గుమ్మమా! ప్రలాపింపుము.

               ఫిలిస్తీయానగరమా!

               నీవు భయముతో కంపింపుము.

               ఉత్తరము నుండి ధూళిమేఘము వచ్చుచున్నది.

               పిరికివారెవరు లేని పాలమది.”

32.        ఆ అన్యజాతి దూతలకు మనమేమి

               బదులు చెప్పుదుము?

               ”ప్రభువే సియోనునకు పునాదులెత్తును.

               శ్రమచెందెడు ప్రభువుప్రజలు

               అచట విశ్రాంతిపొందుదురు” అని చెప్పుదము.