దమస్కును గూర్చి దైవవాక్కు

17 1. దమస్కును గూర్చిన దైవవాక్కు:

                              దమస్కు ఇక పట్టణముగా మనజాలదు, అది శిథిలముల ప్రోవగును.

2.           ఆరాము నగరములు నిర్మానుష్యమగును.

               ఆ నగరములు గొఱ్ఱెలమందలు

               మేతమేయు తావులగును.

               వాినెవడును అదలింపని విధముగా

               అవి విశ్రమించును.

3.           ఎఫ్రాయీము రక్షణము కోల్పోవును.

               దమస్కు రాజ్యమునుపొగొట్టుకొనును.

               సిరియాదేశమున మిగిలియున్నవారు

               యిస్రాయేలీయులవలె అవమానము పాలగుదురు

               ఇది సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు.

4.           ఆ దినమున యాకోబుయొక్క

               గొప్పతనము సమసిపోవును.

               ఆ దేశము తన సంపదను కోల్పోయి పేదదగును.

5.           ఆ దేశముగతి,

               కోతగాడు పండినదంట్లను చేతులలోనికి తీసికొని

               వానివెన్నులు కోసినట్లుండును.

               రెఫాయీములోయలో పరిగెలు ఏరునట్లుండును.

6.           ఓలివు చెట్టుపండ్లు దులపగా,

               పైకొమ్మ చివరన రెండు మూడుపండ్లుగాని,

               క్రింది కొమ్మమీద మూడు నాలుగు పండ్లుగాని

               మిగిలియున్నట్లుండును.

               యిస్రాయేలు దేవుడను,

               ప్రభుడనైౖన నేను పలికిన పలుకిది.

విగ్రహారాధన అంతమగును

7. ఆ దినమున ప్రజలు తమసృష్టికర్తయు, యిస్రాయేలు పవిత్రదేవుడునైన ప్రభువును చూచెదరు.

8. వారు తాము స్వయముగా నిర్మించిన బలిపీఠము లను ఆశ్రయింపరు. ఆ దినమున అషేరాదేవత ప్రతిమలనుగాని, సూర్యదేవత ప్రతిమలనుగాని, తమ చేతులు చేసిన దేనినైనను ఆశ్రయింపరు.

అన్యదేవతల వనములు

9.           పూర్వము యిస్రాయేలీయులు వచ్చుటను చూచి

               అమోరీయులు, హివ్వీయులు

               భయముతో పారిపోవుచు, తమ నగరములను

               నిర్మానుష్యము కావించుకొనినట్లే,

               ఆ రోజున మీ నగరములు నిర్మానుష్యమగును.

10. మీరు మీ రక్షణకర్తయైన దేవుని విస్మరించితిరి. మీకు బలమునొసగు ప్రభువును మరచిపోతిరి.

               పైగా మీరు అన్యదేవతకు వనములునాితిరి.

               పరదేవతకు కొమ్మలునాితిరి.

11.           ఆ వనములు మీరు నాిన ఉదయముననే

               చిగిర్చి పూలుపూచినను 

               మీ పొలములు పంటపండవు.

               మీరు ఆపదకును,

               తీరనిబాధకును గురియగుదురు.

అన్యజాతులు దాడిచేయుట

12.          బలముగల జాతులు ఆర్భాటము చేయుచున్నవి.

               సముద్రమువలె గర్జించుచున్నవి.

               కడలి అలలవలె ఘోషించుచున్నవి.

13.          అన్యజాతులవారు కడలి అలలవలె

               సమీపించుచున్నారు.

               కాని ప్రభువు వారిని మందలింపగా

               వారు వెనుకకు మరలుచున్నారు.

               పెనుగాలికి కొండలమీది ధూళివలెను,

               సుడిగాలికి చెత్తవలెను కొట్టుకొనిపోవుచున్నారు.

14.          వారు సాయంకాలమున భయము ప్టుింతురు.

               కాని వేకువ అగునప్పికి

               మటుమాయ మగుదురు.

               మనలను కొల్లగొట్టు వారి గతియ్టిిిది.

               మనలను దోచుకొనువారి గతియ్టిిిదే.