ఐగుప్తును గూర్చిన దైవవాక్కు
19 1. ఐగుప్తును గూర్చిన దైవవాక్కిది:
ప్రభువు మేఘమునెక్కి వేగముగా ఐగుప్తు నకు వచ్చుచున్నాడు. అతనిని గాంచి
ఐగుప్తులోని విగ్రహములు తల్లడిల్లుచున్నవి.
ఐగుప్తీయుల గుండెలు నీరగుచున్నవి.
2. ప్రభువిట్లు నుడువుచున్నాడు:
నేను ఐగుప్తీయుల మీదికి
ఐగుప్తీయులనే రేపెదను.
అచట అన్నదమ్ములు ఒకరితో నొకరును,
ఇరుగుపొరుగువారు ఒండొరులతోను,
నగరము నగరముతోను,
రాజ్యము రాజ్యముతోను పోరాడును.
3. నేను ఐగుప్తుశక్తి సన్నగిల్లిపోవునట్లు చేయుదును. ఐగుప్తీయుల ఆలోచనలు వమ్మగునట్లు చేసెదను. ,వారు విగ్రహములను, మాంత్రికులను,
సోదెచెప్పువారిని,
మృతులను ఆవాహము చేయువారిని
సంప్రతింతురు.
4. నేను ఐగుప్తీయులను పీడకునిచేతికి అప్పగింతును.
క్రూరుడైనరాజు వారిని పరిపాలించును.
సైన్యములకధిపతియు, ప్రభుడనైన నా వాక్కిది.
5. నైలునదిలోని నీరు తగ్గిపోవును.
నది క్రమముగా ఎండిపోవును.
6. ఆ నది కాలువలువ్టిపోయి దుర్గంధమొలుకును.
వానిలోని జమ్మును, రెల్లును మాడిపోవును.
7. నైలునదిఒడ్డున నాిన పైరులన్నియు
ఎండిపోయి, గాలికెగిరిపోయి అదృశ్యమగును.
8. బెస్తలు విలపింతురు. నైలునదిలో గాలములువేసి చేపలుపట్టువారు దుఃఖింతురు.
వలలతో చేపలుపట్టువారు అంగలార్తురు.
9. నారపని చేయువారు,
నారతో బట్టలునేయువారు నిరాశచెందుదురు.
రాజ్యస్తంభములు పడగొట్టబడును.
నేతపని చేయువారు విచారింతురు.
10. నేర్పరులైన పనివారు విషాదము చెందుదురు.
11. సోవను నాయకులు మందమతులు.
బుద్ధికుశలులైన ఫరోజ్ఞానులు
మూర్ఖపు సలహానిచ్చిరి
”మేము జ్ఞానులకును,
పూర్వపురాజులకును శిష్యులము”
అని వారు ఫరోతో ఎట్లు చెప్పగలరు?
12. ఫరోరాజా! నీ జ్ఞానులేరి?
సైన్యములకధిపతియైన ప్రభువు
ఐగుప్తునక్టిె దుర్గతి ప్టించునో
వారు గ్రహించి చెప్పవలెనుకదా?
13. సోవను నాయకులు మందమతులు.
నోపు అధిపతులు మోసపోయిరి.
ఐగుప్తు గోత్రమూలపురుషులు
దానిని అపమార్గము ప్టించిరి.
14. ప్రభువు
ఆ నాయకులు దుష్టాత్మనొందునట్లు చేసెను.
కావుననే వారు త్రాగుబోతుమత్తులై
తమ వాంతిలో తామే తూలిపడుపట్లుగా,
ఐగుప్తు ప్రతికార్యమునను తూలి
తప్పుటడుగు వేయునట్లు చేసిరి.
15. ఐగుప్తున ఇక తలయైనను, తోకయైనను,
కొమ్మయైనను, రెల్లునైనను
ఎవరును ఏమియు చేయజాలరు.
ఐగుప్తు అస్సిరియాలు
ప్రభువును సేవించును
16. ఆ రోజున ఐగుప్తీయులు స్త్రీలవలె పిరికి వారగుదురు. వారు సైన్యములకధిపతియైన ప్రభువు తమ మీదికి హస్తము నెత్తుటనుజూచి భయపడుదురు.
17. సైన్యములకధిపతియైన ప్రభువు తమకు ప్టింప బోవు దుర్గతిని జ్ఞప్తికి తెచ్చుకొనునపుడెల్ల ఐగుప్తీయులు యూదా దేశమును తలంచుకొని భీతిల్లుదురు.
18. ఆ దినమున ఐగుప్తున ఐదునగరములు కనాను మండలపు భాషను మ్లాడును. ఆ నగరముల ప్రజలు సైన్యములకధిపతియైన ప్రభువునకు చెందిన వారమని ప్రమాణము చేయుదురు. ఆ పట్టణములలో నొకి సూర్యనగరమని పేరుబడయును.
19. ఆ కాలము వచ్చినపుడు ఐగుప్తుదేశము నడుమ ప్రభువునకు బలిపీఠమును నెలకొల్పుదురు. ఆ దేశపు సరిహద్దులలో ప్రభువునకు శిలాస్తంభము నాటుదురు.
20. అవి ఐగుప్తున సైన్యములకధిపతియైన ప్రభువునకు గుర్తుగాను సాక్ష్యముగాను ఉండును. ఐగుప్తీయులు పరపీడనమునకు గురియై, ప్రభువునకు మొరపెట్టు కొనినపుడు, ఆయన వారియొద్దకు ఒక విమోచకుని పంపి వారిని కాపాడును.
21. ఆ రోజున ప్రభువు ఆ ప్రజలకు ప్రత్యక్షమగును. వారు ఆయనను అంగీకరించి పూజింతురు. ఆయనకు బలులు, కానుకలు అర్పింతురు. ఆయనకు మ్రొక్కుబడులు చేసికొని, వానిని తీర్తురు.
22. ప్రభువు ఐగుప్తీయు లను శిక్షించును. కాని వారిని మరల స్వస్థపరచును. ఆ ప్రజలు ప్రభువునకు మనవి చేయుదురు. ఆయన వారి వేడుకోలును ఆలించి, వారిని స్వస్థపరచును.
23. ఆ దినమున ఐగుప్తునుండి అస్సిరియాకు రాజ పథమును నిర్మింతురు. అపుడు అస్సిరియులు ఐగుప్తు నకు, ఐగుప్తీయులు అస్సిరియాకు వచ్చుచు పోవుచు నుందురు. వారిరువురును కలిసి యావేదేవుని సేవింతురు.
24. ఆ దినమున యిస్రాయేలు రాజ్యము ఐగుప్తు, అస్సిరియాలతో సరిసమానమగును. ఈ మూడు రాజ్యములు ప్రపంచమంతికి దీవెనగా నుండును.
25. సైన్యములకధిపతియైన ప్రభువు ‘ఐగుప్తు నా ప్రజగా నుండును. అస్సిరియా నేను సృజించినది. యిస్రాయేలు నేనెన్నుకొనినది” అని పలికి ఆ రాజ్యములను ఆశీర్వదించును.