27 1. ఆ దినమున ప్రభువు పదునును, గ్టి తనమునుగల తన మహాఖడ్గముతో చుట్టజుట్టు కొని నుండు మహాసర్పమును, వక్రముగా నుండు మకరమును దండించును. సముద్రముననున్న ఘటసర్పమును శిక్షించును.
ప్రభువు ద్రాక్షతోట
2. ఆ దినమున ప్రభువు ఆనందప్రదమైన
తన ద్రాక్షతోటను గూర్చి ఇట్లు పాడును:
3. ”ప్రభుడనైన నేను ఆ తోటను సంరక్షింతును.
నిరంతరము దానికి నీరుకట్టుదును.
రేయింబ వళ్ళు దానిని కాపాడుచు
ఎవరును దానికి కీడు చేయకుండునట్లు చూతును.
4. ఆ తోటమీద నాకిప్పుడు ఎి్ట కోపమునులేదు.
దానిలో ముండ్లుతుప్పలు ఎదిగెనేని,
నేను వానితో పోరాడి వానిని భస్మము చేసెదను.
5. కాని ఆ ముండ్లును తుప్పలును
నా రక్షణమును ఆశించినచో
నాతో సంధిచేసికోవలెను,
నాతో సమాధానపడవలెను.”
యిస్రాయేలునకు మన్నింపు,
పీడకులకు శిక్ష
6. రాబోవు దినములలో యాకోబు వేరూరును.
యిస్రాయేలు చిగుర్చి పూలుపూయును.
లోకమంతయు దానిపండ్లతో నిండిపోవును
7. ప్రభువు యిస్రాయేలును వారి శత్రువులను
శిక్షించినంత ఘోరముగా శిక్షింపలేదా?
వారి విరోధులను వధించినట్లుగా వధింపలేదా?
8. ప్రభువు తన ప్రజను ప్రవాసముతో శిక్షించెను. తూర్పునుండి వచ్చు సుడిగాలి వారిని వెన్నాడెను.
9. యిస్రాయేలు తన దోషములకు ప్రాయశ్చిత్తము
చేసికొని పాపపరిహారము పొందుమార్గమిది.
వారు తమ బలిపీఠముల శిలలను
సుద్దవలె పొడిచేయవలెను.
అషేరాదేవతా స్తంభములను,
ధూపపీఠములను కూల్చివేయవలెను.
10. సురక్షిత పట్టణము ధ్వంసమైనది.
జనులు దానిని ఎడారివలె పరిత్యజించిరి.
అది గొడ్లకు పచ్చిక పట్టయినది.
పశువులు అచట విశ్రమించును, మేతమేయును.
11. చెట్లకొమ్మలు ఎండి విరిగిపోయినవి.
స్త్రీలు వానిని వంటచెరకుగా ప్రోగుజేసికొందురు,
ఈ ప్రజలకు జ్ఞానము లేదయ్యెను.
కావున వారిని సృజించిన దేవుడు
వారిని కరుణింపడు, అనుగ్రహింపడు.
దైవోక్తి
12. ఆ దినమున ప్రభువు యూఫ్రీసు నది నుండి
ఐగుప్తునది వరకును
కళ్ళము సిద్ధము చేసి ధాన్యము త్రొక్కించును.
యిస్రాయేలీయులారా!
ప్రభువు మీలో ఒక్కొక్కనిని
పొట్టునుండి ధాన్యమును వలె వేరుజేయును.
మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.
13. ఆ దినమున గొప్ప బాకానూదుదురు. అప్పుడు
అస్సిరియాలో నాశనముకానున్న ప్రజలును
ఐగుప్తున చెల్లాచెదరైయున్న జనులును
తిరిగివత్తురు.
వారు యెరూషలేమున పవిత్రపర్వతముపై
ప్రభువును ఆరాధింతురు.