యెరూషలేమునకు వినాశనము
29 1. అరీయేలు5నకు శ్రమ.
దావీదు సైన్యము దిగిన
అరీయేలు పట్టణమునకు శ్రమ.
సంవత్సరము వెంబడి సంవత్సరము
గడవనీయుడి.
పండుగలు క్రమముగా జరుగనీయుడి.
2. ప్రభువే దైవపీఠము అనబడు
అరీయేలు నగరమును ముట్టడించును.
ప్రజలెల్లరు విలపించి దుఃఖింతురు.
అప్పుడు నగరము బలితోగూడిన
పీఠమువిందగును.
3. ప్రభువు ఈ పట్టణముమీద దాడిచేసి,
దీనిచుట్టు శిబిరముపన్ని
ముట్టడిమంచెలు కట్టును.
4. అప్పుడు నీవు అణచబడి
నేలనుండి పలుకుచుందువు.
నీ మాటలు నేలనుండి
ఒకడు గుసగుసలాడునట్లుండును.
దయ్యము స్వరమువలె
నీ స్వరము నేలనుండివచ్చును.
నీ పలుకులు ధూళినుండి
గుసగుసలువలె వినబడును.
5. యెరూషలేము మీదికెత్తివచ్చిన
అన్యజాతిప్రజలు ధూళివలె ఎగిరిపోవుదురు.
భయంకరమైన వారి సేనలు
పొట్టువలె లేచిపోవును.
6. దిఢీలున సైన్యములకధిపతియైన ప్రభువు
యెరూషలేమును ఆదుకొనును.
ఉరుములు భూకంపములు, భీకరనాదములతో,
సుడిగాలితో, తుఫానుతో, జ్వలించు అగ్నితో
ఈ నగరమును రక్షించును.
7. అప్పుడు దేవునిపీఠము అనబడు యెరూషలేమును
ముట్టడించిన అన్యజాతిసైన్యములెల్ల,
వారి ఆయుధసామాగ్రితోపాటు
కలవలెను, కలలో కనిపించిన దృశ్యమువలెను
కరగిపోవును.
8. సియోనుకొండను ముట్టడించిన
అన్యజాతి సైన్యములగతి,
ఆకలిగొనినవాడు తాను భోజనము చేయుచున్నట్లు
కలగాంచి నకనకలాడు కడుపుతో
నిద్రమేల్కొనిన చందమగును.
దప్పికగొనినవాడు తాను నీరుత్రాగుచున్నట్లు
కలగాంచి ఎండిన గొంతుకతో
నిద్రమేల్కొనిన చందమగును.
9. జనులారా!
మీరు విస్మయముననే మునిగియుండుడు.
గ్రుడ్డివారుగనే కొనసాగుడు.
ద్రాక్షారసమును సేవింపకయే మత్తులుకండు. మద్యమును పుచ్చుకొనకయే తూలిపడుడు.
10. ప్రభువు, మిమ్ము నిద్రాపరవశులను గావించెను.
కనుక ప్రవక్తలుగా ఉండవలసిన మీరు
దర్శనములు చూడకుండునట్లు చేసెను.
దీర్ఘదర్శులుగా ఉండవలసిన మీరు
దైవసందేశమును గ్రహింపకుండునట్లు చేసెను.
దైవసందేశమును గ్రహింపకుండుట
11. దైవసందేశము మీకు మూసివేయబడిన పుస్తకమువిందైనది. మీరు చదువుకొనిన వానివద్దకు దానిని కొనిపోయి ”చదువుము” అని అడిగినచో, అతడు ”ఇది మూసివేయబడి ఉన్నది కనుక నేను చదువజాలను” అని చెప్పును.
12. చదువురాని వాని వద్దకు దానిని కొనిపోయి ”చదువుము” అని అడిగినచో అతడు ”నాకు చేతగాదు” అని చెప్పును.
దైవోక్తి
13. ప్రభువిట్లనెను:
”ఈ ప్రజలు వ్టి మాటలతో
నా చెంతకువచ్చుచున్నారు.
కేవలము పెదవులతో నన్ను శ్లాఘించుచున్నారు.
వీరి హృదయములు నాకు దూరముగానున్నవి.
వీరు తాము కంఠతఃనేర్చుకొనిన
నరుల శాసనములే మతమనుకొనుచున్నారు.
14. కావున నేను వీరిని దెబ్బమీద దెబ్బక్టొి
వీరి గుండెలదరునట్లు చేయుదును.
వీరి జ్ఞానుల జ్ఞానమంతరించును.
వీరి పండితుల తెలివి సమసిపోవును.
దుష్ట సలహాదారులకు శిక్ష
15. తమ పన్నాగములను దేవుని కంటబడకుండ
దాచియుంచువారు నాశనమగుదురు.
వారు రహస్యముగా దుష్కార్యములుచేసి
”మమ్మునెవరు చూచెదరు?
మా పని ఎవరికి తెలియును?” అని ఎంతురు.
16. వారు విషయమును తలక్రిందులు చేయుచున్నారు
కుమ్మరి మ్టికంటె అధికుడుకాడా?
నరుడు చేసిన వస్తువు ఆ నరునితో
”నీవు నన్ను చేయలేదు” అని చెప్పునా?
కుండ తనను చేసిన కుమ్మరితో
”నీకు తెలివిలేదు” అని పలుకునా?
17. సామెత చెప్పినట్లు కొద్దికాలములోనే
అడవి సేద్యపునేల అగును.
సేద్యపునేల అడవి అగును.
18. ఆ దినమున చెవివారు గ్రంథములోని
వాక్యములను చదువగా విందురు.
కారుచీకిలోనున్న గ్రుడ్డివారు
కన్నులువిప్పి చూతురు.
19. దీనులు మరల ప్రభువునుగాంచి ఆనందింతురు
దరిద్రులు పవిత్రుడైన యిస్రాయేలు దేవుని
చూచి సంతసింతురు.
20. పరపీడకులును,
దేవుని గేలిచేయువారును చత్తురు.
దుష్టకార్యములకు పాల్పడువారందరును
నశింతురు.
21. అన్యులమీద చాడీలు చెప్పువారును,
దుష్టులకు దండనము విధింపకుండ
అడ్డుపడువారును, కల్లలాడి సజ్జనులకు
న్యాయము జరుగనీయని వారును
అడపొడ గానరాకుండ బోవుదురు.
22. కావున యాకోబు దేవుడును,
అబ్రహాముని అపాయమునుండి
తప్పించినవాడును అగు
ప్రభువు ఇట్లనుచున్నాడు:
”ఇకమీదట యాకోబు సిగ్గుపడడు,
ఇక మీదట అతని ముఖము తెల్లబారదు.
23. నేను వారినడుమ చేసిన
కార్యములుచూచి వారిసంతానము
నన్ను పవిత్రునిగానెంచి పూజించును.
వారు నన్ను కొలుతురు.
నా నామమును పవిత్రపరచుదురు.
నన్ను గాంచి భయపడుదురు.
యిస్రాయేలు దేవుని
మాహాత్మ్యమును గాంచెదరు.
24. మందమతులు వివేకముబడయుదురు,
సణుగుకొనువారు ఉపదేశమును స్వీకరింతురు.”