హిజ్కియాకు వ్యాధి నయమగుట
38 1. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణా పాయస్థితిలోనుండెను. అప్పుడు ప్రవక్తయగు యెషయా రాజును సందర్శింపవచ్చి ”ప్రభువు సందేశమిది. నీ కార్యములను చక్కబెట్టుకొనుము. నీవిక బ్రతుకవు” అని చెప్పెను.
2-3. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి ”ప్రభూ! ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో, చిత్తశుద్ధితో సేవించితినిగదా! నీ చిత్తము చొప్పున నడుచుకొింనిగదా!” అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను.
4-5. తిరిగి ప్రభువు వాణి యెషయాతో ఇట్లు పలికెను: ”నీవు హిజ్కియా యొద్దకుపోయి అతనితో ఇట్లు చెప్పుము: ‘నీ పితరుడగు దావీదు దేవుడనైన నా వాక్కిది. నేను నీ మొరవింని. నీ కన్నీళ్ళు చూచితిని. నేను నీ ఆయువును ఇంకను పదునైదేండ్లు పొడిగింతును.
6. నేను నిన్నును, ఈ నగరమును అస్సిరియా రాజు బారినుండి కాపాడు దును. ఈ పట్టణమును రక్షించితీరుదును.”
7. యావే తాను పలికిన మాట నెరవేర్చునను టకు ఇది యావే వలన నీకు కలిగిన సూచన.
8. ఆయన ఆహాసు ఎండ గడియారము మీద మెట్లపై బడిన సూర్యునినీడ పదిఅడుగులు వెనుకకు పోవునట్లు చేయును” అని చెప్పెను. ప్రవక్త చెప్పినట్లే సూర్యునినీడ పది అడుగులు వెనుకకు పోయెను.
హిజ్కియా స్తుతిగీతము
9. యూదా రాజు హిజ్కియా తనకు వ్యాధి కుదిరినపిమ్మట ఈ స్తుతిగీతమును రచించెను.
10. నేను నా జీవితమధ్యముననే
పాతాళద్వారము చేరుదునని అనుకొింని.
నా జీవితమున మిగిలిన రోజులను
కోల్పోదును అనుకొింని.
11. ఈ సజీవులలోకమున
నేను ప్రభువును మరల దర్శింపజాలననుకొింని.
ఈ భూమిమీద ఉన్నవారు చూచునట్లుగా
నేను నరులను మరల చూడజాలననుకొింని.
12. ప్రభువు నా జీవితమును
గొఱ్ఱెలకాపరి గుడారమువలె పెరికివేసెను.
సాలెవాడు తానుచేసిన బట్టను చుట్టచ్టుి
మగ్గమునుండి కత్తిరించునట్లు
ప్రభువు నా జీవితమును కత్తిరించెను.
వేకువనుండి రేయివరకు
ఆయన నన్ను బాధించుచునేయుండెను.
13. రేయెల్ల నేను వేదనతో విలపించితిని.
ఆయన సింగమువలె నా మీదపడి,
నా ఎముకలు విరుగగొట్టెను.
వేకువనుండి రేయివరకును
నన్ను బాధించుచునేయుండెను.
14. నేను పిచ్చుకవలె అరచితిని, గువ్వవలె విలపించితిని
ఆకసమువైపు చూచిచూచి నా కన్నులు వాచెను.
ప్రభూ! నీవు నన్నాదుకొనుము,
నాకు అండగా ఉండుము.
15. నేనేమి ఫిర్యాదు చేయుదును?
ప్రభువునకేమి విన్నవించుకొందును?
ఆయనయే ఈ చెయిదము చేసెను.
నా హృదయము సంతాపముతో నిండియున్నది.
నాకు నిదురపట్టుటలేదు.
16. ప్రభూ! నేను నీ కొరకే జీవింతును.
నిఖ్ఖముగా నీ కొరకే బ్రతుకుదును.
నీవు నన్ను బాగుచేయుదువు.
నన్ను జీవింపచేయుదువు.
17. నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చుదువు.
వినాశకరమైన పాతాళము బారినుండి
నీవు నన్ను ప్రేమతో కాపాడితివి.
నా పాపములెల్ల ఎత్తి
నీ వెనుక తట్టున విసరివేసితివి.
18. పాతాళలోకము నిన్ను స్తుతింపదు.
మృతలోకము నిన్ను కొనియాడదు.
మృతలోకమునకు ఏగువారు
నీ నమ్మదగినతనము మీద ఆధారపడరు.
19. సజీవులు, సజీవులేకదా నిన్ను స్తుతింతురు.
నేడు నేను నిన్నుకీర్తించినట్లే,
వారును నిన్ను కీర్తింతురు.
తండ్రులు తమ తనయులతో
నీవు నమ్మదగినవాడవని చెప్పుదురు.
20. ప్రభూ! నీవు నన్నాదుకొనుము.
మేము తంత్రీవాద్యములతో నిన్ను కీర్తింతుము.
మా జీవితకాలమంతయు
దేవాలయమున నిన్ను కొనియాడెదము.
21. యెషయా అత్తిపండ్ల గుజ్జును
రాజు వ్రణముపై పూసినచో
అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పెను.
22. హిజ్కియా ‘నేను ప్రభువు మందిరమునకు
పోవుదుననుటకు గుర్తేమి’ అని అడిగెను.