కోరెషునకు పిలుపు
41 1. ద్వీపములారా!
మీరు మౌనము తాల్చి
నా పలుకులు ఆలింపుడు.
జనులారా! నూతన బలము పొందుడు.
మీరు నా ఎదుికి వచ్చి న్యాయస్థానమున
మీ వాదమును వినిపించుకొనుడు.
మనలో ఎవరిది ఒప్పోచూతము.
2. ఎచికి వెళ్ళినను విజయము చేపట్టు
వీరుని ఒకనిని పురికొల్పి అతనిని
తూర్పుదిక్కునుండి తీసికొని వచ్చినదెవరు?
జాతులమీదను, రాజులమీదను
అతనికి విజయమును ఒసగినదెవరు?
అతని ఖడ్గమునకు ధూళివలె,
అతని వింకి ఎగిరిపోవు పొట్టువలె
వారిని అప్పగించుచున్నాడు.
3. అతడు ఎి్ట అపాయమునకును గురికాక
వారిని వెన్నాడును.
తన పాదములు నేలకు తగలనంత
వేగముగా పరుగెత్తును.
4. ఈ కార్యమును నిర్వహించినదెవడు?
ఆదినుండి తరతరాల ప్రజలను సృజించినదెవడు?
ప్రభుడనైన నేనే. మొదివాడను,
కడవరివారితో ఉండువాడను నేనే.
5. ద్వీపవాసులు నా చెయిదములు
చూచివెరగొందిరి.
తీరవాసులు భీతితో కంపించిరి.
వారెల్లరును ఏకమైవచ్చిరి.
6. ఇరుగుపొరుగువారు
ఒకరికొకరు సాయము చేసికొందురు.
ధైర్యము వహింపుడని ప్రోత్సహించుకొందురు.
7. వడ్రంగి కంసాలిని మెచ్చుకొనును.
విగ్రహములను సుత్తెతోక్టొి
నునుపు చేయువాడు,
దాగిలిమీద కొట్టువానిని ప్రోత్సహించును.
వారెల్లరును బొమ్మ అతుకులు
బాగుగా ఉన్నవని చెప్పుకొనుచు,
దాని తావున దానిని చీలలతో క్టొిబిగింతురు.
దేవుడు యిస్రాయేలుతో ఉండును
8. యిస్రాయేలూ! నీవు నాకు సేవకుడవు,
యాకోబూ! నేను నిన్నెన్నుకొింని.
నీవు నా స్నేహితుడైన అబ్రహాము వంశజుడవు.
9. నేను నిన్ను ప్రపంచపు
అంచులనుండి కొనివచ్చితిని.
భూలోకపు చెరగులనుండి నిన్నుపిలిచితిని.
నీవు నాకు సేవకుడవని చెప్పితిని,
నేను నిన్ను ఎన్నుకొింని,
నిన్ను నిరాకరింపనైతిని.
10. నీవు భయపడకుము, నేను నీకు తోడైయుందును.
నీవు వెరవకుము, నేను నీకు దేవుడను.
నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకొందును.
నీతి అను నా కుడిచేతితో నిన్ను కాపాడుదును.
11. నీ మీద కోపించువారు ఓడిపోయి
అవమానము చెందుదురు.
నీతో పోరాడువారు సర్వనాశనమగుదురు.
12. నీ శత్రువులు నీవు గాలించినను దొరకరు.
నీతో పోరాడువారు మటుమాయమగుదురు.
13. నీ దేవుడను, ప్రభుడనైన నేను
నీకు బలమును ఒసగుదును
”నీవు భయపడకుము, నేను నిన్నాదుకొందును”
అని నీతో చెప్పుచున్నాను.
నేను నీ కుడిచేతిని పట్టుకొందును.
14. పురుగువింవాడవైన యాకోబూ!
చిన్న క్రిమివింవాడవైన యిస్రాయేలూ!
భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును.
యిస్రాయేలు పవిత్రదేవుడనైన నేను
నీకు విమోచకుడను
– ఇవి ప్రభువు పలుకులు.
15. నేను నిన్ను నూర్పిడికొయ్యగా చేయుదును.
దానికి కక్కులు పెట్టబడి పదునుగల
క్రొత్తపారలకు అమర్తును.
నీవు పర్వతములను నూర్చి పొడిచేయుదువు.
కొండలను పొట్టు చేయుదువు.
16. నీవు వానిని తూర్పారబట్టగా
అవి గాలికెగిరిపోవును.
పెనుగాలికి కొట్టుకొనిపోవును.
అప్పుడు నీవు ప్రభువునందు సంతసింతువు.
యిస్రాయేలు పవిత్ర దేవునియందు
అతిశయిల్లుదువు.
నూతన నిర్గమనము
17. దీనులును, పేదలునైనవారు
దప్పిక గొనిరిగాని నీరు దొరకదయ్యెను.
వారి నాలుక పిడుచగట్టెను.
ప్రభుడనైన నేను వారి మొరవిందును.
యిస్రాయేలు దేవుడనైన నేను
వారిని చేయివిడువను.
18. నేను బోడిగానున్న కొండలలో
నదులను పారింతును.
లోయలలో ఊటలను ఉబకచేసెదను.
ఎడారిని నీిమడుగుగా మార్తును.
ఎండిననేలను నీిబుగ్గలుగా చేయుదును.
19. ఎడారిలో దేవదారులు, కసివిందచెట్లు,
గొంజిచెట్లు, ఓలివులు నాటుదును.
మరుభూమిలో నేరేడులు, సరళవృక్షములు,
తమాలములు పాతుదును.
20. ప్రజలు దీనినెల్ల చూచి ప్రభువునైన నేను
ఈ చెయిదమును చేసితిననియు,
యిస్రాయేలు పవిత్రదేవుడనైన నేను
ఈ కార్యము సల్పితిననియు
స్పష్టముగా గ్రహించి అర్థము చేసికొందురు.
ప్రభువు ఒక్కడే దేవుడు
21. యిస్రాయేలు రాజైన ప్రభువు ఇట్లనుచున్నాడు:
”జాతుల దేవతలారా!
మీ వ్యాజ్యెమును వినిపింపుడు.
న్యాయస్థానమున మీ వాదమును నిరూపింపుడు.
22. మీరు ఇచికి వచ్చి
భవిష్యత్తున ఏమి జరుగునో చెప్పుడు.
ఆ కార్యము జరిగినవెంటనే
మేము దానిని గుర్తింతుము.
భూతకాలమున జరిగిన
కార్యములను వివరింపుడు.
వాి భావమును తెలియజెప్పుడు.
23. భవిష్యత్తున ఏమి జరుగునోచెప్పుడు, అప్పుడు
మేము మీరు దైవములని ఒప్పుకొందుము.
మీరు మంచియో, చెడ్డయో ఏదో ఒకి చేసి
మాకు భీతిని, విస్మయమును కలిగింపుడు.
24. మీరు సర్వశూన్యులు.
మీ క్రియలు కూడా శూన్యములే.
మిమ్ము కొలుచువారు నింద్యులు.
యావే కోరెషు విజయమును
ముందుగా ఎరిగించుట
25. నేను ఉత్తరమునుండి ఒకరిని పురికొల్పితిని.
తూర్పునుండి ఒకనిని పేరెత్తి పిలిచితిని.
అతడు రాజులను బురదనువలె త్రొక్కును.
కుమ్మరి మింని త్రొక్కినట్లుగా
వారిని త్రొక్కివేయును.
26. ఈ కార్యమును
మీలో ఎవ్వరైన ముందుగా తెల్పియుింరా?
అటులయిన మేము
దానిని గూర్చి తెలిసికొని ఉండెడివారము.
అతడు చెప్పినది ఒప్పని
ఒప్పుకొని ఉండెడివారము.
కాని మీలో ఎవ్వడును దానిని
ముందుగా చెప్పలేదు.
మీ పలుకులను విన్నవాడెవడును లేడు.
27. నేను సియోనునకు
ఈ సంగతి మొదటనే ఎరిగించితిని.
యెరూషలేమునకు వార్తావహుని పంపించి,
నా ప్రజలు వచ్చుచున్నారని చెప్పించితిని.
28. నేను దైవములవైపు చూడగా
వారిలో ఒక్కడును మాటలాడడయ్యెను.
ఒక్కడును నా ప్రశ్నలకు జవాబు చెప్పలేడయ్యెను.
29. ఈ దైవములెల్ల సర్వశూన్యులు.
వీరి కార్యములును శూన్యములే.
వీరెల్లరును చేతగాని దుర్బలవిగ్రహములు.