ప్రభువు సేవకుని

గూర్చిన మొదటి గీతము

మొదటి భాగము

42 1. ఇడుగో నా సేవకుడు,

                              నేను ఇతనిని బలాఢ్యుని చేసితిని.

                              ఇతనిని ఎన్నుకొింని.

                              ఇతని వలన ప్రీతిచెందితిని.

                              ఇతనిని నా ఆత్మతో నింపితిని.

                              ఇతడు అన్యజాతులకు

                              న్యాయము గొనివచ్చును.

2.           ఇతడు పెద్దగా అరవడు, కేకలుపెట్టడు.

               వీధులలో ఉపన్యసింపడు.

3.           నలిగిన రెల్లుకాడను త్రుంచివేయడు.

               కునికిపాట్లుపడు దీపమును ఆర్పివేయడు.

               నమ్మదగినతనముతో

               ఎల్లరికిని న్యాయము గొనివచ్చును.

4.           నిరాశచెందక, నిరుత్సాహమునకు గురికాక

               నేలమీద న్యాయమును నెలకొలుపును.

               ద్వీపములితని బోధకొరకు ఎదురుచూచును.

రెండవ భాగము

5.           దేవుడు ఆకాశమును సృజించి

               దానిని విశాలముగా విప్పెను.

               భూమిని దానిమీద వసించు ప్రాణులను చేసెను.

               దానిమీది నరులకు ప్రాణమొసగెను.

               దానిమీద సంచరించు వారికి

               జీవమును దయచేసెను.

               అి్ట దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు:

6.           ”ప్రభుడనైన నేను నిన్ను పిలిచితిని.

               నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని.

               నీవు న్యాయము నెలకొల్పవలెను.

               నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను,

               జాతులకు జ్యోతినిగాను నియమించితిని.

7.            నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు.

               బందీలను చెరనుండి వెలుపలికి గొనివత్తువు.

               చీకిలో ఉన్నవారిని

               బందీగృహమునుండి విడిపింతువు.

8.           యావేను నేనే. ఇదియే నా నామము.

               నేను నా మహిమను మరి ఎవనికిని ఈయను.

               నాకు ముట్టవలసిన స్తుతి,

               విగ్రహములకు దక్కనీయను.

9.           నేను పూర్వము చెప్పిన సంగతులు నెరవేరినవి.

               ఇప్పుడు క్రొత్త సంగతులు తెలియజేసెదను.

               అవి జరుగక మునుపే వానినెరిగించెదను.”

విజయ గీతము

10.         ప్రభువునకు నూత్నగీతము పాడుడు.

               నేలయందంతట

               ఆయన స్తుతి మారుమ్రోగునుగాక!

               సముద్రయానము చేయువారు

               ఆయనను కీర్తింతురుగాక!

               సముద్రమున జీవించు ప్రాణులు

               ఆయనను నుతించునుగాక!

               ద్వీపములును, వానిలో వసించువారును

               ఆయనను స్తుతింతురుగాక!

11.           ఎడారియు, దానిలోని నగరములును,

               కెదారు నివాసులును బిగ్గరగా పాడుదురుగాక!

               సెర నగరవాసులు పర్వతాగ్రమునుండి  

               సంతసముతో కేకలిడుదురుగాక!

12.          ద్వీపములలో వసించువారు

               ప్రభువును స్తుతించి కీర్తింతురుగాక!

13.          ప్రభువు శూరునివలె బయలుదేరును.

               యుద్ధవీరునివలె ఆగ్రహము చెందును.

               ఆయన హుంకరించుచు

               యుద్ధనాదము చేయును.

               శత్రువులమీద విజయము సాధించును.

14.          ప్రభువిట్లు పలుకుచున్నాడు:

               నేను దీర్ఘకాలము మౌనముగా ఉంిని.

               నోరువిప్పి మ్లాడనైతిని,

               నన్ను నేను నిగ్రహించుకొింని.

               కాని ఇప్పుడు ప్రసవవేదనపడు

               స్త్రీవలె అరచుచున్నాను.

               గ్టిగా గాలిపీల్చుచు రొప్పుచున్నాను.

15.          నేను కొండలను, తిప్పలను

               నాశనము చేయుదును.

               వానిలోని చెట్టు చేమలను మాడ్చివేయుదును.

               నదులను ఎడారులుగా మార్చెదను.

               సరస్సులు ఎండిపోవునట్లు చేయుదును.

16.          గ్రుడ్డివారిని మార్గమువెంట నడిపింతును.

               వారు ఎరుగని త్రోవలగుండ

               వారిని కొనిపోవుదును.

               వారి ముందట చీకిని వెలుగుగా మార్చెదను.

               కరకునేలను నునుపుగా జేయుదును.

               ఒక్కదానిని గూడ విడువక

               ఈ కార్యములెల్ల చేయుదును.

17.          విగ్రహములను నమ్ముచు

               పోత విగ్రహములను చూచి

               మీరే ‘మా దైవములు’ అనినెంచువారు

               సిగ్గుజెంది వెనుకకు మరలుదురుగాక!

ప్రజల గ్రుడ్డితనము

18.          ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు:

               చెవివారలారా వినుడు!

               గ్రుడ్డివారలారా జాగ్రత్తగా చూచి తెలిసికొనుడు!

19.          నా సేవకునియంత గ్రుడ్డివాడెవడు?

               నా వార్తావహునియంత చెవివాడెవడు?

               నా దూతయంత గ్రుడ్డివాడెవడు?

               ప్రభువు సేవకునియంత చెవివాడెవడు?

20.        మీరు చాల సంఘటనలను చూతురు.

               కాని వాిని గ్రహింపరు.

               వారు చెవులతో వినియు వినరైతిరి.

21.          ప్రభువు తన ప్రజలను రక్షింపగోరువాడు

               కనుక ధర్మస్త్రశామును గొప్పజేసి

               దానికి కీర్తి తెచ్చెను.

22.        కాని ఇప్పుడు ఆయన ప్రజలు

               దోపిడికి గురియైరి.

               వారు కొండబిలములలో బందీలైరి.

               బందీగృహమున చిక్కి కనుమరుగైరి.

               వారు దోపిడికి గురికాగా

               ఎవరును వారిని ఆదుకోరైరి.

               అన్యులు వారిని కొల్లగొట్టగా

               ఎవరును వారికి తోడ్పడరైరి.

23.        మీలో ఈ సంగతిని వినువారెవరైనా ఉన్నారా? ఇక మీదటనైనా మీరు జాగ్రత్తగా విందురా?

24.         యిస్రాయేలును దోపిడి చేయనిచ్చినదెవరు?

               వారిని కొల్లగొట్టనిచ్చినది యావేనే కదా!

               మనము ఆయన మార్గములలో నడువమైతిమి.

               ఆయన ఉపదేశమును పాింపమైతిమి.

25.        కనుక ఆయన తన కోపమును

               మనమీద కుమ్మరించెను.

               మనలను ఘోర యుద్ధమునకు గురిచేసెను.

               ఆయన కోపాగ్ని మనలను క్రమ్ముకొనెను.

               కాని మనము ఆ విషయమును గ్రహింపమైతిమి.

               ఆ నిప్పు మనలను దహించెను.

               కాని మనము బుద్ధి తెచ్చుకోమైతిమి.