యిస్రాయేలీయులకు విముక్తి

43 1. కాని యాకోబూ! ఇప్పుడు నిన్ను సృజించిన దేవుడు ఇట్లు అనుచున్నాడు.

                              యిస్రాయేలూ! నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు:

                              ”నీవు భయపడకుము,

                              నేను నిన్ను విమోచించితిని.

                              నేను నిన్ను పేరెత్తి పిలిచితిని,

                              నీవు నా సొత్తు.

2.           నీవు లోతైన నీిగుండ నడచునప్పుడు

               నేను నీకు తోడుగానుందును.

               నదులగుండ నడచునపుడు

               అవి నిన్ను ముంచివేయలేవు.

               నీవు అగ్నిగుండ నడచునపుడు కమిలిపోవు.

               మంటలు నిన్ను కాల్చివేయలేవు.

3.           నేను నీ ప్రభుడనైన నీ దేవుడను,

               యిస్రాయేలు పవిత్రదేవుడను,

               నిన్ను రక్షించువాడను.

               నీకు విమోచనమును ఒసగుటకు క్రయముగా

               నేను ఐగుప్తును ఇచ్చియున్నాను.

               నీ కొరకు ప్రతిగా

               కూషు, సేబా దేశములను ఇచ్చియున్నాను.

4.           నేను నీ కొరకు ప్రతిగా నరులను త్యజింతును.

               నీ ప్రాణములకు బదులుగా

               జాతులను త్యాగము చేయుదును.

               నీవు నాకు అమూల్యమైనవాడవు.

               నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును.

5.           నీవు భయపడకుము,

               నేను నీకు తోడుగానుందును.

               నేను తూర్పునుండి నా ప్రజలను గొనివత్తును,

               పడమరనుండి నా జనులను ప్రోగుజేయుదును.

6.           ఉత్తరదిక్కుతో నీవు వారిని

               వెడలిపోనిమ్ము అని చెప్పుదును.

               దక్షిణదిక్కుతో నీవు వారిని

               బంధించియుంచవలదు అని చెప్పుదును.

               దూరమునుండి నా కుమారులు వత్తురుగాక!

               నేలచెరగులనుండి

               నా కుమార్తెలు తిరిగివత్తురుగాక!

7.            వారెల్లరు నా పేరును ధరించినవారు.

               నాకు కీర్తికలుగుటకుగాను

               నేను వారిని సృజించితిని,

               వారికి రూపము నిచ్చితిని.”

ప్రభువొక్కడే దేవుడు

8.           ప్రభువు ఇట్లనుచున్నాడు:

               నా ప్రజలను పిలువుడు.

               వారు కన్నులున్నను గ్రుడ్డివారుగా నున్నారు.

               చెవులున్నను చెవివారుగా నున్నారు.

9.           ప్రజలనెల్ల, జాతులనెల్ల తీర్పునకు పిలిపింపుడు.

               వారి దైవములలో

               భవిష్యత్తున జరుగు కార్యములను

               ముందుగా ఎరిగింపగలవారెవరు?

               ఇప్పుడు జరుగుదానిని

               పూర్వము తెలియజేసిన దెవరు?

               ఈ దైవములు సాక్ష్యములు చూపించి

               తమది ఒప్పేనని నిరూపించుకొందురుగాక!

               తమ మాటలు నిజమేనని

               రుజువు చేసికొందురుగాక!

10.         యిస్రాయేలీయులారా! మీరు నాకు సాకక్షులు.

               మీరు నన్నెరిగి, నన్ను విశ్వసించి,

               నన్నే ఏకైక దేవునిగా గుర్తించుటకుగాను

               నేను మిమ్ము నా సేవకులనుగా ఎన్నుకొింని.

               నాకు ముందు ఏ దైవమును లేడు.

               నా తరువాత ఏ దైవమును ఉండబోడు.

11.           నేను మాత్రమే ప్రభుడను.

               నేను తప్ప రక్షించువాడు ఎవడునులేడు.

12.          నేను జరుగబోవు సంగతులను

               ముందుగా ఎరిగించితిని.

               ఆ పిమ్మట మిమ్ము ఆదుకొింని.

               అన్యదైవములెవ్వరును ఈ కార్యము చేయలేదు.

               మీరు నాకు సాకక్షులు”

               – ఇవి ప్రభువు పలుకులు.

13.          ”నేను దేవుడను, ఎల్లపుడును దేవుడనే.

               నేను ప్టినది విడిపించువాడెవడును లేడు.

               నేను చేసినదానిని మార్చువాడెవడును లేడు.”

బబులోనియా నాశనమగును

14.          యిస్రాయేలు పవిత్రదేవుడును,

               మీ విమోచకుడునైన అయిన

               ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               నేను మీకొరకు బబులోనియా మీదికి

               సైన్యమును పంపెదను. 

               ఆ నగర ద్వారములను పడగొట్టెదను.

               కల్దీయుల విజయనాదములు

               ఏడ్పులుగా మారును.

15.          నేను మీ పవిత్రదేవుడనైన ప్రభుడను,

               యిస్రాయేలీయులగు మిమ్ము సృజించినవాడను,

               నేనే మీకు రాజును.

నూత్న నిర్గమనమున జరుగు అద్భుతములు

16.          సముద్రముగుండ త్రోవజేసిన ప్రభువు,

               మహాజలరాశిగుండ మార్గముజేసిన ప్రభువు

               ఇట్లు అనుచున్నాడు:

17.          రథములతోను, గుఱ్ఱములతోను కూడిన

               మహాసైన్యమును నాశనము గావించినదెవరు?

               ఆసైన్యము నేలపైబడి మరల లేవజాలదయ్యెను.

               నేను దానిని దీపమువలె ఆర్పివేసితిని.

18.          మీరు పూర్వపుసంగతులను

               జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు.

               ప్రాతసంఘటనలు తలచుకోనక్కరలేదు.

19.          ఇప్పుడు నేనొక నూత్నకార్యము చేసెదను.

               అది తక్షణమే జరుగును.

               మీరు దానిని వెంటనే చూతురు.

               నేను ఎడారిలో బాటవేయుదును.

               మరుభూమిలో త్రోవవేయుదును.

20.        నేను ఎడారిలో నదులు పారించి

               నేనెన్నుకొనిన ప్రజలకు నీినిత్తును.

               అప్పుడు నక్కలు నిప్పుకోళ్ళు

               మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును.

21.          ఆ జనులు, నా స్తుతులను పాడువారు.

               వారిని నేను నా కొరకే సృజించితిని.

యిస్రాయేలీయుల కృతఘ్నత

22.        యాకోబూ! నీవు నన్ను ఆరాధింపలేదు.

               యిస్రాయేలూ! నీవు నన్ను గూర్చి విసిగితివి.

23.        నీవు నాకు దహనబలిగా గొఱ్ఱెలను కొనిరావైతివి.

               నీ బలులతో నన్ను గౌరవింపవైతివి.

               నాకు నైవేద్యములు అర్పింపుమని

               నేను నిన్ను బాధింపలేదు.

               సాంబ్రాణిపొగ వేయుమని నిన్ను విసిగింపలేదు.

24.         నీవు నాకొరకు సుగంధపు కాడలను కొనలేదు.

               బలిపశువుల క్రొవ్వుతో నన్ను సంతృప్తిపరచలేదు.

               కాని నీ పాపములతో నీవు నన్ను బాధించితివి.

               నీ దోషములతో నన్ను విసిగించితివి.

25.        అయినను నేను నీ కొరకే

               నీ పాపములను మన్నించువాడను.

               నేను నీ తప్పిదములను జ్ఞప్తియందుంచుకొనను.

26.        మనము వ్యాజ్యెమాడుదమురమ్ము.

               నీ అభియోగమును వినిపించుకొనుము,

               నీదే ఒప్పని నిరూపించుకొనుము.

               నీ వాదమును వివరింపుము.

27.         నీ ప్రథమ పితరుడు పాపము చేసెను.

               నీ నాయకులు నా మీద తిరుగుబాటు చేసిరి.

28.        నీ పాలకులు నా మందిరమును

               అపవిత్రము చేసిరి.

               కనుక నేను యాకోబును నాశనము చేసితిని.

               నా ప్రజలను అవమానముపాలు కావించితిని.