బేలు దేవత పతనము

46 1.      బేలు దేవత క్రిందికి క్రుంగెను,

                              నెబో దేవత కూలెను.

                              ప్రజలు వారి విగ్రహములను

                              పూర్వము ఆరాధించిరి.

                              కాని ఇపుడు వానిని బరువులుమోయు

                              జంతువుల మీదికెత్తిరి.

                              అవి అలసిపోయిన పశువులకు

                              భారమయ్యెను.

2.           ఆ విగ్రహములు క్రుంగెను, కూలెను.

               అవి తమను తాము రక్షించుకోజాలవయ్యెను.

               అవి స్వయముగా బందీలై

               చెరలోనికి వెళ్ళిపోవుచున్నవి.

3.           యాకోబు వంశజులారా!

               యిస్రాయేలునందు మిగిలియున్నవారలారా!

               నా మాట వినుడు. మీరు ప్టుినప్పినుండి

               నేను మిమ్ము భరించితిని.              

               మీరు జన్మించినప్పినుండియు

               నేను మిమ్ము మోసితిని.

4.           మీరు వృద్ధులగు వరకును నేను మీకు దేవుడను. మీ తల నెరసినదాక నేను మిమ్ము మోయుదును. నేను మిమ్ము సృజించితిని, మిమ్ము భరింతును. నేను మిమ్ము మోయుదును, రక్షింతును.

ప్రభువునకు సాిదైవము లేడు

5.           మీరు నన్నెవనితో పోల్చెదరు?

               నాకు సాివాడెవడు? నాకు తుల్యుడెవడు?

               నా విం వాడెవడు?

6.           నరులు సంచులు విప్పి

               బంగారము కుమ్మరింతురు.

               వెండిని త్రాసున తూచియిత్తురు.

               కంసాలికి కూలియిచ్చి ఆ లోహములతో

               విగ్రహము చేయింతురు.

               తాము దాని ఎదుట

               సాగిలపడిదండము పెట్టుదురు.

7.            దానిని తమ భుజముమీదికెత్తుకొని

               మోసికొనిపోవుదురు.

               ఆ బొమ్మనొక తావున పెట్టగా

               అది అచట నిలిచియుండును.

               ఆ చోటు నుండి కదలజాలదు.

               ఎవడైన దానికి ప్రార్థన చేసినచో

               అది ప్రత్యుత్తరమీయలేదు.

               అతని ఆపద బాపి అతనిని రక్షింపలేదు.

ప్రభువు భవిష్యత్తునకు అధిపతి

8.           పాపులారా! దీనిని జ్ఞప్తియందుంచుకొనుడు.

               ఈ కార్యమును గూర్చి ఆలోచింపుడు.

9.           పూర్వసంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకొనుడు.

               నేనే దేవుడను, మరియొక వేల్పులేడు.

               నేనే దేవుడను, నన్ను పోలినవాడులేడు.

10.         మొది నుండియు

               నేను జరుగబోవు కార్యముల నెరిగించితిని.

               ముందుగానే భవిష్యత్తును తెలియజేసితిని.

               నేను చెప్పుచున్నాను,

               ‘నా సంకల్పము నెరవేరితీరును.

               నేను చేయదలచుకొన్న

               కార్యములెల్ల చేసితీరుదును’.

11.           నేను తూర్పునుండి వేాడుపక్షిని పిలిచితిని.

               దూరప్రాంతము నుండి నా సంకల్పమును

               నెరవేర్చు వానిని రప్పించితిని.

               నేను పలికిన మాట నెరవేరితీరును.

12.          ”మొండివారలారా!

               మీరు నీతిని దరిచేరనీయరు

               అయితే నా పలుకులాలింపుడు.

13.          నేను నీతిని చేరువలోనికి గొనివచ్చితిని.

               అది దూరమున లేదు.

               నా రక్షణము మీకు శీఘ్రమే లభించును.

               నేను యెరూషలేమును రక్షించి,

               యిస్రాయేలీయులకు గౌరవము కలిగింతును.”