బబులోనియా మీద శోకగీతము

47 1. బబులోనియా కుమారీ!

                              నీవు సింహాసనము దిగివచ్చి

                              క్రింది దుమ్ముమీద చతికిలబడుము.

                              కల్దీయుల కుమారీ!

                              నీకిక సింహాసనములేదు,

                              నేలమీద కూర్చుండుము.

                              నీ సౌకుమార్యమును, భోగలాలసతయు

                              ఇక మీదట చెల్లవు.

2.           నీవిక తిరుగలి త్రిప్పి, పిండి విసరుము.

               నీ మేలిముసును తొలగింపుము.

               నీ తొడలు కన్పించునట్లు వస్త్రములను

               పైకెత్తుకొని ఏరులు దాటుము.

3.           ప్రజలు నీవు వస్త్రహీనవై ఉండుటను చూతురు.

               నీవు దిగంబరివై ఉండుటను కాంతురు.

               నేను నీకు ప్రతీకారము చేయుదును.

               నాకెవరును అడ్డు రాజాలరు.

4.           సైన్యములకధిపతియైన

               ప్రభుడని పేరు బడసినవాడును,

               తన ప్రజలను రక్షించువాడును అయిన

               యిస్రాయేలు పవిత్రదేవుడు ఇట్లనుచున్నాడు:

5.           కల్దీయుల కుమారీ!

               నీవు ఇక మౌనముదాల్చి

               చీకిలో చతికిలబడుము.

               నిన్నికమీదట రాజ్యములకు

               సామ్రాజ్ఞినిగా గణింపరు.

6.           నేను నా ప్రజలమీద కోపించితిని.

               వారికి అవమానము కలుగునట్లు చేసితిని.

               వారిని నీచేతికి అప్పగించితిని.

               కాని నీవు వారిపట్ల దయజూపవైతివి.

               వృద్ధులను గూడ నిర్దయతో జూచితివి.

7.            నీవు, నేనెల్లకాలమును

               రాణిగా ఉందుననుకొింవి.

               ఈ విషయమును ఆలోచింపవైతివి,

               అంతము ఎట్లుండునో గ్రహింపవైతివి.

8.           సుఖములకు మరిగి నాకు ఆపదరాదని

               భ్రమపడినదానా! వినుము.

               నేను దేవుడంతిదానను.

               నాకు సాియైన వారెవరునులేరు.

               నాకు వైధవ్యము కలుగదు,

               నా బిడ్డలు చనిపోరు

               అని నీవు తలంచుచున్నావు.

9.           దిడీలున, ఒక్కరోజులోనే, ఒక్క నిమిషములోనే

               ఈ రెండు దురదృష్టములును నీకు వాిల్లును.

               నీవు పుత్రశోకమును,

               వైధవ్యమును పూర్తిగా అనుభవింతువు.

               నీకు మాంత్రికవిద్యలు

               శాకునిక తంత్రములు ఎన్ని తెలిసియున్నను

               అవి నిన్ను ఆదుకోజాలవు.

10. నీ దుష్కార్యములవలన నీకు ధైర్యము కలిగినది

               నన్నెవరును చూడరులే అని నీవు తలపోసితివి.

               నీ విజ్ఞానమును, నీ విద్యలును

               నిన్ను అపమార్గము ప్టించెను.

               నీవు నేను దేవుడను.

               నా అంతి వాడెవడును లేడు

               అని తలంచితివి.

11.           విపత్తు నీ మీదికి ముంచుకొనివచ్చును.

               నీ మాంత్రికవిద్య దానిని ఆపజాలదు.

               వినాశనము నీ మీదికెత్తివచ్చును.

               నీవు దానిని తప్పించుకోజాలవు.

               నీవు ఊహింపనపుడు వినాశనము

               దిఢీలున వచ్చి నీమీదపడును.

12.          నీవు బాల్యమునుండియు

               వినియోగించు కొనుచువచ్చిన మాంత్రికవిద్యలు,

               శాకునిక తంత్రములను కొనసాగింపుము.

               బహుశః అవి నీకు తోడ్పడవచ్చును.

               వాితో నీవు ఇతరులను బెదరగొట్టవచ్చును.

13.          నీవెంతగా ఉపదేశమును బడసినను

               లాభములేదు. నీ జ్యోతిష్కులను రమ్మనుము.

               వారు నిన్ను రక్షింపగలరేమో చూతము.

               వారు ఆకాశమును మండలములుగా

               విభజించి, నక్షత్రములను పరిశీలింతురుగదా!

               నీకు సంభవింపబోవు సంఘటనములను

               ప్రతిమాసము నీకు ఎరిగించుచుందురుగదా!

14.          ఆ జ్యోతిష్కులు గడ్డితునియల వింవారు.

               అగ్నివారిని దహించును.

               వారు నిప్పుమంటలనుండి

               తమను తాము కాపాడుకోజాలరు.

               ఆ అగ్ని, దగ్గర కూర్చుండి

               చలికాచుకొను నిప్పువిందికాదు.

15.          నీవు బాల్యమునుండియు సంప్రతించుచు వచ్చిన ఈ జ్యోతిష్కులవలన

               నీకు కలుగు ప్రయోజనమింతియే.

               వారు నిన్ను విడనాడి

               ఎవరిదారిన వారు వెళ్ళిపోవుదురు.

               నిన్ను రక్షించువారు ఎవరును ఉండబోరు.