యెషయా గ్రంథము తృతీయభాగము
ప్రభువు అన్యులనుకూడ
తన ప్రజలలో చేర్చుకొనును
56 1. ప్రభువిట్లు నుడువుచున్నాడు: ”మీరు నీతి న్యాయములు పాింపుడు. నేను సత్వరమే మిమ్ము రక్షింతును. నా ధర్మము ప్రస్ఫుటమగును.
2. విశ్రాంతి దినమును అపవిత్రముచేయక, దానిని పాించు వానిని దీవింతును. చెడుకార్యములకు పాల్పడనివానిని నేను ఆశీర్వదింతును.”
3. ప్రభువు ప్రజలలో చేరి పోయిన అన్యజాతిజనుడు ఎవడును ”ప్రభువు తన ప్రజల సమాజమునుండి నన్ను బహిష్కరించును” అని తలంపకుండును గాక! నపుంసకుడు ఎవడును ”నేను ఎండినచెట్టును” అని చెప్పకుండును గాక!
4. ప్రభువు ఆ నపుంసకునితో ఇట్లు చెప్పుచున్నాడు: ”నీవు నా విశ్రాంతిదినమును పాింపుము. నా చిత్తము ప్రకా రము జీవించి నా నిబంధనమును అనుసరింపుము.
5. అపుడు నా దేవాలయమునను నా ఆవరణము లోను, కుమారులు కుమార్తెలు కలిగినప్పికంటెను మించినపేరు నీకు చిరస్మరణీయముగాను మరియు ఎప్పికిని క్టొివేయబడనదిగాను పెట్టుచున్నాను. నా ప్రజలలోను నీ నామము స్మరింపబడును. నీకొక జ్ఞాపకచిహ్నము నెలకొనును. నీకు బిడ్డలు కలిగినప్పి కంటె ఇవ్విధమున నీవెక్కువకాలము స్మరింపబడు దువు. జనులు నిన్ను ఏనాికిని విస్మరింపరు.”
6. ప్రభువు ప్రజలలోచేరి, ఆయనను ప్రేమించి, సేవించి, ఆయన విశ్రాంతిదినమును పాించి, నిబంధనము అనుసరించెడు అన్యజాతి ప్రజలకు ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: 7. ”నేను మిమ్ము నా పవిత్రపర్వత మునకు కొనివత్తును. నా ప్రార్థనామందిరమున మిమ్ము సంతోషచిత్తులగావింతును. నా బలిపీఠముపై మీరు అర్పించుబలులను, దహనబలులను స్వీక రింతును. నా మందిరము సకలజాతిజనులకు ప్రార్థనా మరదిరమని పిలువబడును.”
8. యిస్రాయేలును ప్రవాసమునుండి కొనివచ్చిన ప్రభువైన దేవుడు అన్యజనులనుగూడ తీసికొనివచ్చి ఆ యిస్రాయేలీయు లతో చేర్చుదునని ప్రమాణము చేయుచున్నాడు.
యూదా నాయకుల అయోగ్యత
9. ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
అడవిలోని క్రూరమృగములారా!
మ్రింగివేయుటకు రండు.
10. యిస్రాయేలునకు కావలికాయువారు గ్రుడ్డివారు,
వారికేమియు తెలియదు.
వారు మూగ కుక్కలవలె మొరగలేరు.
వారు పరుండి కలలుగాంతురు.
నిద్ర అనిన వారికి పరమప్రీతి.
11. వారు ఎంత తినినను
తృప్తిచెందని ఆశపోతు కుక్కల వింవారు.
ఆ కాపరులకు ఏమియు తెలియదు,
వారిలో ప్రతివాడును
తనదారి తాను చూచుకొనును,
తన లాభమును తాను కోరుకొనును.
12. మనము ద్రాక్షసారాయమును కొనివత్తము.
ఘాటయిన మద్యమును సేవింతము.
నేికంటెను రేపు ఇంకను మెరుగుగానుండును
అని వారు పలుకుచున్నారు.