దైవోక్తి

66 1.     ప్రభువు ఇట్లనుచున్నాడు:

                              ఆకాశము నాకు సింహాసనము.

                              భూమి నాకు పాదపీఠము.

                              మీరు నాక్టిె మందిరమును కట్టుదురు?

                              ఎి్ట విశ్రమ స్థానమును నిర్మింతురు?

2.           భూమ్యాకాశములను నేనే చేసితిని.

               ఇవి అన్నియు నావే.

               – ఇవి ప్రభువు పలుకులు.

               వినయాన్వితుడును, పశ్చాత్తాపమనుస్కుడునై

               నా వాక్కులకు భయపడు నరుని

               నేను ప్రీతితో చూతును.

ఆరాధనముతోపాటు విగ్రహారాధనము

3.           ఎద్దును బలియిచ్చువాడు నరుని చంపువాడే.

               గొఱ్ఱెపిల్లను బలియిచ్చువారు

               శునకము మెడను విరుచువాడే.

               ధాన్యమును అర్పించువాడు

               పందిరక్తమును అర్పించువాడే.

               సాంబ్రాణిపొగ వేయువాడు

               విగ్రహములను స్తుతించువాడే.

               ఈ జనులు తమకిష్టము వచ్చినట్లుగా

               ప్రవర్తించుచున్నారు.

               వారి కార్యములు హేయములైనను

               వారికవి బాగుగానే యున్నవి.

4.           కావున నేను వారిని కడగండ్లపాలు చేయుదును.

               వారు భయపడు అశుభములే

               వారినెత్తి మీది కెక్కును.

               నేను పిలిచినను ఎవడును పలుకలేదు.

               నేను సంభాషించినను ఎవడును వినలేదు.

               వారు నేనొల్లని కార్యములు చేసి

               నాకు అప్రియము కలిగించిరి.

ఓదార్పు గీతము

5.           ప్రభువు వాక్కునకు భయపడువారలారా!

               మీరు ఆయన పలుకులాలింపుడు.

               నా నామము నిమిత్తము

               మీ సహోదరులు మిమ్ము ద్వేషింతురు.

               మిమ్ము త్యజింతురు.

               వారు ప్రభువును

               తన మాహాత్మ్యము చూపింపుమనుచు,

               మీరెట్లు సంతసింతురో

               మేము చూతుము అనుచున్నారు.

               కాని వారు నగుబాట్లు తెచ్చుకొందురు.

6.           పట్టణమునుండి వినిపించు ఆ కోలాహలమును,

               దేవళమునుండి విన్పించు

               ఆ ధ్వనిని ఆలింపుడు.

               అది ప్రభువు తన శత్రువులను శిక్షించుధ్వని.

7.            ప్రసవవేదన రాకమునుపే

               యెరూషలేము ప్రసవించినది.

               పురినొప్పులు రాకపూర్వమే మగబిడ్డను కనినది.

8.           ఇంతకుపూర్వము ఇి్టవార్తను ఎవరైనను వినిరా?

               ఇి్ట సంగతిని ఎవరైనను చూచితిరా?

               ఏదేశమైనా ఒక్కరోజులో పుట్టునా?

               ఏ జాతియైన దిఢీలున ఉద్భవించునా?

               కాని సియోను మాత్రము పురుినొప్పులు

               ప్రారంభము కాగానే సుతులను కనెను.

9.           నేను గర్భము నాశీర్వదించిన పిదప

               శిశువును కలిగింపకుందునా?

               కడుపు పండించిన పిదప

               గర్భమును మూసివేయుదునా?

               ఇవి ప్రభువు పలుకులు.

10.         యెరూషలేమును ప్రేమించువారెల్లరు

               ఆ నగరమును చూచి సంతసింపుడు.

               ఆ పట్టణముతోపాటు ఆనందింపుడు.

               పూర్వము ఆ పురమును చూచి దుఃఖించినవారు

               ఇప్పుడు దానితోపాటు సంతోషింపుడు.

11.           మీరు యెరూషలేమను తల్లినుండి

               పాలు త్రాగుదురు.

               మీకు ఓదార్పునొసగు ఆమె పాలిండ్లనుండి

               స్తన్యముగ్రోలి సంతృప్తి చెందుదురు.

               పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు.”

12.          ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               ”నేను యెరూషలేము మీదికి

               అభ్యుదయమును నదివలె పారింతును.

               జాతులసంపదలను పొంగిపొరలు కాలువవలె

               ఆ నగరముమీదికి పారింతును.

               యెరూషలేము అను తల్లి

               మీకు చింబిడ్డలకువలె పాలిచ్చును.

               మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును.

               తన వడిలో కూర్చుండబెట్టుకొని లాలించును.

13.          తల్లి బిడ్డలను ఓదార్చినట్లు

               నేను మిమ్ము ఓదార్తును.

               యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు.

14.          ఈ కార్యము జరిగినపుడు

               మీరు సంతసించి

               పచ్చిగడ్డివలె కళకళలాడుదురు.

               ప్రభుడనైన నేను నా సేవకులను ఆదుకొందును.

               నా విరోధులకు మాత్రము

               నా ఆగ్రహమును ప్రదర్శింతును.

15.          చూడుడు! ప్రభువు అగ్నితో

               విజయము చేయుచున్నాడు.

               తుఫానుపైనెక్కి వచ్చుచున్నాడు.

               ఆయన ఉగ్రకోపముతో

               తన శత్రువులను శిక్షించును.

               ఆగ్నిజ్వాలలతో వారిని గడగడలాడించును.

16.          ఆయన అగ్నితోను, ఖడ్గముతోను

               దుష్టులనందరిని శిక్షించును.

               అనేకులు ఆయనవలన చత్తురు.

అన్యుల ఆరాధనములో

పాల్గొనువారికి శిక్ష

17.          పవిత్రతను పొందవలయునను

               తలపుతో శుద్ధిచేసికొని,

               ఒకరివెంట నొకరు వరుసగా

               పవిత్రవనములలో ప్రవేశించి

               పందిమాంసమును, ఎలుకలను,

               హేయములైన క్రిములను

               భుజించువారికి చావుమూడును,

               వారి ఆలోచనలు క్రియలు నాకు తెలియునని

               ప్రభువు పలుకుచున్నాడు.

అంత్యశిక్ష

18.          నేను జాతులన్నింని

               ప్రోగు చేయుటకు వచ్చుచున్నాను.

               వారెల్లరును వచ్చి నా మహిమను గాంతురు.

               నేను తమను శిక్షించువాడనని

               వారు గ్రహింతురు.

19.          వారియొదుట ఒక సూచకక్రియను ఉంచుదును. నేను వారిలో కొందరిని తప్పింతును.

               వారిని నా పేరు వినని, నా మహిమచూడని

               జాతుల యొద్దకు పంపుదును.

               దూరప్రాంతములందలి

               ప్రజలయొద్దకు పంపుదును.

               వారు తర్షీషు, పూతు, లూదు, తుబాలు,

               యావాను మొదలగు తావులకు పోయి,

               అచి జనులకు

               నా మాహాత్మ్యమును ఎరిగింతురు. 

20.        అన్ని జాతులనుండియు

               మీ స్వదేశీయులను

               నాకు కానుకగా కొనివత్తురు.

               యిస్రాయేలీయులు పవిత్రపాత్రములలో

               దేవాలయమునకు ధాన్యబలిని కొనివచ్చినట్లే

               వారు ఆ ప్రజలను గుఱ్ఱముల మీదను,

               కంచర గాడిదల మీదను, ఒంటెలమీదను,

               రథములలోను, డోలికలలోను కొనివచ్చి

               యెరూషలేమునందలి

               నా పవిత్రపర్వతమున చేర్తురు.

21.          నేను వారిలో కొందరిని యాజకులుగాను,

               లేవీయులుగాను నియమింతును.               

               ఇవి ప్రభువు పలుకులు.

22.        నేను సృజింపబోవు

               నూత్న దివి, నూత్న భువి లయముకాక

               నా సన్నిధిని సదా నిలిచియుండునట్లే

               మీ సంతతియు, మీ పేరును

               శాశ్వతముగా నిలుచును.

23.        ప్రతి అమావాస్యనాడును,

               ప్రతి విశ్రాంతిదినమునను

               సకలజాతి ప్రజలు

               నా సమక్షమునకు వచ్చి నన్ను ఆరాధింతురు. 

               ఇవి ప్రభువు పలుకులు.

24.         వారు తిరిగిపోవుచు

               నాకు ఎదురుతిరిగినవారి

               శవములను గాంతురు.

               వానిని తినివేయు పురుగులు ఎన్నికిని చావవు.

               వానిని కాల్చు నిప్పు ఎన్నికిని చల్లారదు.

               ఆ పీనుగులు ఎల్లరికిని హేయముగా ఉండును.