హింసలకు గురియైన

పుణ్యపురుషుని ప్రాతఃకాల ప్రార్థన

తన కుమారుడైన అబ్షలోము ఎదుినుండి పారిపోయినపుడు దావీదు రచించిన కీర్తన

3 1.ప్రభూ! చాలమంది నాకు శత్రువులైరి.

     అనేకులు నామీద తిరగబడుచున్నారు.

2.           పెక్కుమంది నన్నుగూర్చి మాటలాడుచు,

               ప్రభువువలన అతడికి

               రక్షణ దొరకదని పలుకుచున్నారు.

3.           కాని ప్రభూ! నీవు నాకు డాలువింవాడవు.

               నాకు గౌరవమును చేకూర్చి పెట్టువాడవు.

               నేను తలయెత్తుకొని తిరుగునట్లు చేయువాడవు.

4.           నేను ఎలుగెత్తి ప్రభునకు మొరపెట్టెదను.

               అతడు తన పవిత్రపర్వతము మీదినుండి

               నాకు బదులిచ్చును.

5.           ప్రభువే నన్ను కాపాడును.

               కావున నేను పరుండి నిద్రింతును.

               మరల సురక్షితముగా మేలుకొందును.

6.           పదివేలమంది శత్రువులు

               నన్ను చుట్టుమ్టుినను నేను భీతిచెందను.

7.            ప్రభూ! లెమ్ము! నా దేవా నన్ను కాపాడుము!

               నా శత్రువుల దవడలు విరుగగొట్టువాడవు నీవేె.

               దుష్టుల మూతిపండ్లు రాలగొట్టువాడవు నీవే.

8.           ప్రభువునుండియే రక్షణము లభించును.

               ప్రభూ! నీవు నీ ప్రజలను దీవింపుము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము