పాపులనుండి రక్షింపుమని ప్రార్థన

ప్రధానగాయకునికి అష్టమ శ్రుతిమీద పాడదగినదావీదు కీర్తన

12 1.       ప్రభూ! సత్పురుషులు కరువైనారు.

               లోకములో విశ్వాసులు లోపించినారు.

               కనుక నీవు నన్ను ఆదుకొనుము.

2.           నరులందరు ఒకరితోనొకరు

               అబద్ధములాడుచున్నారు.

               మోసకరమైన మనస్సు గల్గియున్నారు. 

               వారి మాటలు ముఖస్తుతులతో నిండియున్నవి.

3.           ప్రభూ! నీవు ముఖస్తుతులు చేయువారి

               పెదవులను, గొప్పలు చెప్పువారి

               నాలుకలను కోసివేయుము.

4.           ”మా శక్తి మా నాలుకలోనే ఉన్నది.

               మా పెదవులతో మేము ఏమైన పలికెదము.

               మాకు ప్రభువెవరు?” అని

               వారు భావించుచున్నారు.

5.           ”దరిద్రులను దోచుకొనుచున్నారు,

               పేదలను అణగద్రొక్కుచున్నారు

               కనుక సాయము చేయుటకు

               నేను శీఘ్రమే వచ్చెదను.

               రక్షణను కోరువారికి నేను రక్షణనిచ్చెదను”

               అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

6.           ప్రభువు పలుకులు పవిత్రమైనవి.

               కుంపిలో ఏడుసార్లు

               పుటమువేసిన వెండివలె శ్రేష్ఠమైనవి.

7.            ప్రభూ!

               మమ్ము నీ అండదండలలో ఉంచుకొనుము.

               ఈ పాపపుమూకనుండి

               మమ్ము సదాకాపాడుము.

8.           ఏలయన నీచప్రవర్తన ప్రబలమైనపుడు

               దుష్టులు గర్విష్టులై

               నలుదెసల సంచరింతురుకదా!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము