రాజు విజయముకొరకు ప్రార్థన

ప్రధానగాయకునికి దావీదు కీర్తన

20 1.     ఆపద్దినమున ప్రభువు నీకు ప్రత్యుత్తరమిచ్చునుగాక!

                              యాకోబు దేవుని నామము

                              నిన్ను కాపాడునుగాక!

2.           ఆయన తన దేవాలయమునుండి

               నీకు సహాయము చేయునుగాక!

               సియోనుకొండ మీది నుండి

               నిన్ను ఆదుకొనునుగాక!

3.           ఆయన నీ కానుకలను గుర్తుంచుకొని

               నీ దహనబలుల వలన ప్రీతిచెందునుగాక!

4.           నీ కోరికలు సిద్ధింపజేసి,

               నీ యత్నములనెల్ల సఫలము చేయునుగాక!

5.           నీ విజయమును గాంచి

               మేము హర్షధ్వానము చేయుదుముగాక!

               మన దేవుని కీర్తించుచు జెండాలు

               ఎగురవేయుదుముగాక!

               ప్రభువు నీ మనవులనెల్ల దయచేయునుగాక!

6.           ప్రభువు తన అభిషిక్తునికి విజయమును

               ఒసగునని ఇప్పుడు నాకు తెలియును.

               ఆయన పవిత్రమైన ఆకాశమునుండి

               రాజునకు ప్రత్యుత్తరమిచ్చును.

               తన బలముతో అతనికి

               మహావిజయములు ప్రసాదించును.

7.            కొందరు రథములను నమ్ముదురు.

               మరికొందరు గుఱ్ఱములను నమ్ముదురు.

               కాని మేము మాత్రము ప్రభువైన

               దేవుని నమ్ముదుము.

8.           వారు కాలుజారి క్రిందబడుదురు.

               కాని మేము పైకిలేచి దృఢముగా నిల్తుము.

9.           ప్రభూ! నీ రాజుకు విజయము ప్రసాదింపుము.

               మేము నీకు మొర పెట్టుచున్నాముగాన

               నీవు మాకు ప్రత్యుత్తరమిమ్ము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము