పుణ్య పురుషుని శ్రమలు, అతని నమ్మకము
ప్రధానగాయకునికి అయ్యలెత్‌షహారు అను రాగముమీద పాడదగిన దావీదు కీర్తన
22 1. నా దేవా! నా దేవా!
నన్నేల చేయివిడిచితివి?
నేను నీకు మొరప్టిెతినిగాని
నీవు నన్నింకను ఆదుకోవైతివి.
2. ప్రభూ! నేను పగలెల్ల
మొరప్టిెనను నీవు ఆలింపవు.
రేయెల్ల నీకు మనవి చేసినను
ఉపశాంతి లభింపదు.
3. నీవు పరమ పవిత్రుడవు.
యిస్రాయేలీయుల స్తుతులనెడు
సింహాసనముమీద ఆసీనుడవై ఉండువాడవు.
4. మా పితరులు నిన్ను నమ్మిరి.
నిన్ను నమ్మగా నీవు వారిని రక్షించితివి.
5. వారు నిన్ను శరణువేడి
ఆపదనుండి తప్పించుకొనిరి.
నిన్ను నమ్మి నిరాశచెందరైరి.
6. నా మట్టుకు నేనిపుడు
పురుగునుగాని నరుడనుగాను.
ఎల్లరును నన్ను చిన్నచూపు చూచి
ఎగతాళి చేయుచున్నారు.
7. నావైపు చూచిన వారెల్ల
నన్ను గేలిచేయుచున్నారు.
నాలుక వెళ్ళబ్టెి తల ఊపుచున్నారు.
8. ”ఇతడు ప్రభువును నమ్మెను.
అతడు ఇతనిని రక్షించునేమో చూతము.
ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో
అతడు ఇతనిని కాపాడునేమో చూతము”
అని అనుచున్నారు.
9. తల్లి కడుపునుండి నన్ను సురక్షితముగా
బయికి కొనివచ్చినది నీవే.
నేను మాతృస్తన్యము గ్రోలి భద్రముగా
మనునట్లు చేసినది నీవే.
10. మాతృగర్భమునుండి వెలువడినప్పి
నుండియు నేను నీ మీదనే ఆధారపడితిని.
నేను జన్మించినప్పి నుండియు
నీవే నాకు దేవుడవు.
11. నేను ఆపదలలో ఉన్నాను.
నీవు నాకు దూరముగా ఉండవలదు.
నీవు తప్ప నన్ను ఆదుకొనువాడెవ్వడును లేడు.
12. వృషభములు అనేకములు
నన్ను చుట్టుమ్టుినవి.
బాషాను మండల బలిష్ఠ వృషభములు
నా చుట్టు క్రమ్ముకొనినవి.
13. అవి సింహములవలె నోళ్ళు తెరచి
రంకెలు వేయుచున్నవి.
14. నా బలము నేలమీద పారబోసిన
నీివలె ఇంకిపోయినది.
నా ఎముకలన్నియు పట్టుదప్పినవి.
నా గుండె నాలోనే మైనమువలె కరిగిపోయినది.
15. నా శక్తి పెంకువలె ఎండిపోయినది.
నా నాలుక అంగికి అంటుకొనుచున్నది.
నేను చచ్చి దుమ్ములో పడియుండునట్లు చేసితివి.
16. శునకములు నన్ను చుట్టుమ్టుినవి.
దుష్టబృందము నా చుట్టు క్రమ్ముకొనినది.
వారు నా కాలుచేతులను చీల్చుచున్నారు.
17. నా ఎముకలన్నిని లెక్కపెట్టవచ్చును.
శత్రువులు సంతసముతో
నావైపు చూచుచున్నారు.
18. వారు నా వస్త్రములను
తమలో తాము పంచుకొనుచున్నారు.
నా దుస్తులకొరకు చీట్లు వేసికొనుచున్నారు.
19. ప్రభూ! నీవు నాకు దూరముగా ఉండవలదు.
నా బలమైన నీవు నన్నాదుకొనుటకు
శీఘ్రమే రమ్ము.
20. ఖడ్గమునుండి నన్ను కాపాడుము.
శునకములనుండి నా ప్రాణములను రక్షింపుము.
21. సింహము నోినుండి నన్ను తప్పింపుము.
అడవి ఎద్దు కొమ్ములనుండి నన్ను కాపాడుము.
22. నేను మా ప్రజలకు
నీ మహిమను వెల్లడింతును.
భక్త సమాజమున నిన్ను కీర్తింతును.
23. ప్రభువు భక్తులారా! మీరతనిని స్తుతింపుడు.
యాకోబు వంశజులారా!
మీరతనిని మహిమపరపుడు.
యిస్రాయేలు ప్రజలారా! మీరతనిని భజింపుడు.
24. అతడు దీనులను చిన్నచూపుచూడడు.
వారి శ్రమలను అనాదరము చేయడు.
వారినుండి తనముఖమును దాచుకొనడు. వారు తనకు మొరప్టిెనపుడు
వారి వేడుకోలును ఆలించును.
25. మహా భక్తసమాజమున
నేను నిన్ను కీర్తింతును.
నీ భక్త బృందముఎదుట
నా మ్రొక్కుబడులు చెల్లింతును.
26. పేదలు తనివిదీర భుజింతురు.
ప్రభువును అభిలషించువారు
ఆయనను నుతింతురు.
ఆ జనులు ఎల్లవేళల
శుభములు బడయుదురుగాక!
27. లోకములోని జాతులెల్ల
ప్రభువును జ్ఞప్తికితెచ్చుకొని,
అతని యొద్దకు మరలివచ్చును.
సకలజాతుల కుటుంబములు
అతనిని ఆరాధించును.
28. ప్రభువు రాజ్యము చేయును,
జాతులనెల్ల పరిపాలించును.
29. గర్వాత్ములెల్లరు అతనికి దండము పెట్టుదురు.
మృత్యువువాతబడు నరమాత్రులెల్లరు
అతనికి తల ఒగ్గుదురు.
30. భావితరముల వారు అతనిని సేవింతురు.
ప్రజలు రాబోవు తరములవారికి
ప్రభువునుగూర్చి చెప్పుదురు.
31. ఇక పుట్టబోవు జనులకును ప్రభువు
తన ప్రజలకును దయచేసిన
రక్షణనుగూర్చి వివరింతురు.