మంచి కాపరి

 దావీదు కీర్తన

23 1.      ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయులేదు.

2.           అతడు నన్ను పచ్చికపట్టులలో విశ్రమింపచేయును.

               శాంతికరమైన జలములయొద్దకు

               నడిపించుకొనిపోవును.

3.           నా ఆత్మను సేదదీర్చును.

               తన నామగౌరవార్థము

               నన్ను ధర్మమార్గమున నడిపించును.

4.           గాఢాంధకారపు లోయలో పయనించునపుడును

               నేన్టెి అపాయమునకు భయపడను.

               ఎందుకన నీవు నాకు తోడుగానుందువు.

               నీ బడితయు, నీ కోలయు

               నన్ను కాపాడుచుండును.

5.           నా శత్రువులు చూచుచుండగా

               నీవు నాకు విందుచేయుదువు.

               పరిమళతైలముతో నా తలనభిషేకము చేయుదువు.

               నా పానపాత్రము అంచులవరకు

               నిండి పొరలుచున్నది.

6.           నేను జీవించినన్నాళ్ళు

               నీ కరుణయు ఉపకారమును నా వెంటవచ్చును.

               నేను కలకాలము ప్రభుమందిరమున వసింతును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము