నిర్దోషి ప్రార్థన

 దావీదు కీర్తన

26 1.      ప్రభూ! నీవు నాకు తీర్పుచెప్పుము.

                              నేను ధర్మమార్గమున నడచితిని.

                              నిశ్చలమనస్సుతో నిన్ను నమ్మితిని.

2.           ప్రభూ! నీవు నన్ను నిశితముగా పరిశీలింపుము.

               నా కోరికలను ఆలోచనలను

               పరీక్షించి చూడుము.

3.           నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము.

               నేను నీపట్ల విశ్వాసపాత్రుడనుగా

               మెలగుచున్నాను.

4.           నేను దుర్మార్గులతో కలిసితిరుగనైతిని.

               వేషధారులతో సంచరింపనైతిని.

5.           దుష్టబృందమనిన నాకు గిట్టదు.

               దుర్జనులతో నాకు పొత్తులేదు.

6.           అమాయకత్వమునందు నా చేతులు కడుగుకొని,

               నీ బలిపీఠము చుట్టు ప్రదక్షిణము చేయుదును.

7.            నీకు కృతజ్ఞత తెలియజేయుచు కీర్తనలు పాడెదను.

               నీ అద్భుతకార్యములెల్లరికి వెల్లడిచేయుదును.

8.           నీవు వసించు మందిరమనిన

               నీ తేజస్సు నెలకొనియున్న

               దేవాలయమనిన నాకు పరమప్రీతి.

9.           పాపాత్ములతోపాటు

               నన్ను నాశనము చేయకుము.

               నరహంతలకు పట్టుగతి నాకు పట్టనీయకుము.

10.         వారు దుష్కార్యములు చేయువారు,

               లంచములిచ్చుటకు సిద్ధముగా ఉండువారు.

11.           నా మట్టుకు నేను ధర్మమార్గమున నడచితిని.

               నీవు నన్ను రక్షింపుము,

               నన్ను కరుణతో చూడుము.

12.          నేను అపాయమునుండి తప్పించుకొింనిగాన 

               భక్తసమాజమున ప్రభుని కీర్తించెదను.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము