దేవుని అండదండలున్నచో
ఏ భయమును లేదు
దావీదు కీర్తన
27 1. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము.
ఇక నేనెవరికి భయపడవలెను?
ప్రభువే నా జీవనకోట,
ఇక నేనెవరికి భీతిల్లవలెను?
2. దుష్టులు, విరోధులు నా మీదికెత్తివచ్చి
నన్ను కబళింపజూచినచో
వారే కుప్పకూలిపోవుదురు.
3. సైన్యము నా మీదికి దండెత్తివచ్చినను
నా హృదయము కలవరపడదు.
శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను
నా నమ్మకము చెడదు.
4. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొింని.
నాకు కావలసినది ఇది ఒక్కియే.
నా జీవితకాలమంతయు
ప్రభుమందిరమున వసింపవలెననియు,
ఆయన ప్రసన్నతను చూచుటకును,
ఆయన ఆలయములో సలహా
అడుగుకోవలెననియు నా కోరిక.
5. ఆపత్కాలమున ఆయన నన్ను
తన మందిరమున దాచియుంచును.
తన దేవాలయమున
నన్ను సురక్షితముగా మనుచును.
నన్ను భద్రముగా కొండకొమ్మున నిల్పును.
6. కనుక నన్ను చుట్టుమ్టుిన శత్రువులను
నేను ఓడింతును.
సంతోషనాదముతో ప్రభుమందిరమున
బలిని అర్పింతును.
అతనిని స్తుతించుచు కీర్తనలు పాడుదును.
7. ప్రభూ! నేను నీకు మొరపెట్టుచున్నాను.
నీవు నా వేడికోలును ఆలింపుము.
నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము.
8. నీవు నాతో ”నా సన్నిధిలోనికి రమ్ము”
అని పిలిచితివి.
”ప్రభూ! నేను నీ సన్నిధిని వెదకుచున్నాను”
అని నా హృదయము నీకు ప్రత్యుత్తరమిచ్చెను.
9. నీ ముఖమును నా నుండి దాచుకొనకుము.
నీ దాసుడనైన నాపై కోపింపకుము.
నీ ఎదుినుండి నన్ను గిెంవేయకుము.
నన్ను ఆదుకొనువాడవు నీవే.
నా రక్షకుడవైౖన ప్రభూ!
నీవు నన్ను చేయి విడువకుము,
పరిత్యజింపకుము.
10. నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను
ప్రభువు నన్ను చేరదీసి పరామర్శించును.
11. ప్రభూ! నీ చిత్తమును నాకు తెలియజేయుము.
శత్రువులు నన్ను పీడించుచున్నారు.
కనుక సురక్షితమైన మార్గమున
నన్ను నడిపింపుము.
12. నన్ను విరోధుల చేతికి చిక్కనీయకుము.
వారు నామీద కూటసాక్ష ్యములు చెప్పుచున్నారు.
దౌర్జన్యముతో బుసలుకొట్టుచు,
నన్ను బెదిరించుచున్నారు.
13. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును
చూడగలుగుదునని నా నమ్మకము.
14. నీవు ప్రభువుకొరకు వేచియుండుము
ధైర్యము తెచ్చుకొనుము.
గుండెదిటవు చేసికొనుము,
నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము.