ఆపదనుండి తప్పించినందులకు

భక్తుని కృతజ్ఞతాస్తుతి

 దావీదు కీర్తన

30 1.     ప్రభూ! నీవు నన్ను

                              విపత్తునుండి తప్పించితివి.

                              శత్రువులు నా పతనమును చూచి

                              సంతసింపకుండునట్లు చేసితివి.

                              కనుక నేను నిన్ను స్తుతింతును.

2.           నా దేవుడైన ప్రభూ! నేను నీకు మొరపెట్టగా

               నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి.

3.           ప్రభూ! నీవు నన్ను

               పాతాళలోకమునుండి వెలుపలికి కొనివచ్చితివి.

               మృతలోకమునకు ఏగువారినుండి

               నన్నుతప్పించి నాకు జీవమును ప్రసాదించితివి.

4.           ప్రభుభక్తులారా! ఆయనను స్తుతించి కీర్తింపుడు.

               ఆయన నామమునకు వందనములర్పింపుడు.

5.           ఆయన క్షణకాలము కోపించును.

               ఆయన అనుగ్రహము మాత్రము

               జీవితాంతముండును.

               రేయి దుఃఖమువలన కన్నీళ్ళు కారును.

               కాని వేకువనే ఆనందము చేకూరును.

6.           నేను సురక్షితముగా నున్నప్పుడు

               ”నాకెన్నడు కీడు వాిల్లదు” అని పలికితిని.

7.            ప్రభూ! నీవు నన్ను కరుణతో అభేద్యమైన

               పర్వతదుర్గముగా మలచితివి.

               కాని నీవు నీ ముఖమును నా నుండి

               దాచుకొనగనే నేను కలత చెందితిని.

8.           ప్రభూ! నేను నీకు మనవి చేసితిని.

               నీ సహాయమును అర్థించుచు

9.           ”నేను చనిపోయి పాతాళము చేరుకొనినయెడల

               నీకేమి లాభము కలుగును?

               మృతులు నిన్ను స్తుతింతురా?

               ధూళి నిన్ను స్తుతించగలదా?

               మేరలేని నీ మంచితనమును కీర్తించగలదా?

10.         ప్రభూ! నీవు నా మొరనాలించి,

               నా మీద దయచూపుము.

               దేవా! నన్నాదుకొనుము” అని వేడుకొింని.

11.           నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి.

               సంతాపసూచకముగా

               నేను తాల్చియున్న గోనెను తొలగించితివి.

               నాకు ఆనందకరమైన వస్త్రములను కట్టబ్టెితివి.

12.          కనుక నేనిక మౌనముగానుండక

               నీ స్తుతులను పాడెదను.

               నా ప్రభువైన దేవా!

               నేను నీకు సదా వందనములర్పింతును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము