దేవునిముందట నరుని అల్పత్వము
ప్రధానగాయకుడైన యెదూతూన్‌నకు దావీదు కీర్తన
39 1. ”నేను నా కార్యములనుగూర్చి
జాగ్రత్తపడుదును.
నా నాలుకతో పాపము
కట్టుకొనకుండ ఉందును.
దుష్టులు చేరువలో ఉన్నపుడు
నా నోరు కళ్ళెముతో మూసికొని
ఉందును” అని చెప్పితిని.
2. నేను ఏమియు పలుకక
మూగవలె మౌనముగానుింని.
మంచిని గూర్చియైనను ఏమియు మ్లాడనైతిని.
అయినను నా బాధ ఇంకను అధికమయ్యెను.
3. నా హృదయము వ్యధతో నిండిపోయెను.
నేను ఆలోచించిన కొలది
నా వేదన మిక్కుటమయ్యెను.
కనుక నేనిట్లు నుడివితిని:
4. ”ప్రభూ! నాజీవితమెపుడు ముగియునో,
నా జీవిత కొలమానిక ఏమిో,
నా జీవితమెంత క్షణికమైనదో
నీవే నాకు ఎరిగింపుము.
5. నీవు నాకు క్షణభంగురమైన
ఆయువును ఒసగితివి.
నీ దృష్టిలో నా ఆయుస్సు అత్యల్పమైనది.
భూమిమీద వసించు నరులెల్లరును
ఊదిన శ్వాసము వింవారు.
6. ప్రతి మనుజుడును నీడవింవాడు.
అతని ఆర్భాటములు నిరుపయోగమైనవి.
అతడు కూడబ్టెిన సొత్తు
ఎవనిపాలగునో తెలియదు.
7. ప్రభూ! ఇి్ట పరిస్థితులలో నేనేమి ఆశింపగలను!
నేను నిన్నే నమ్మితిని.
8. నా పాపములన్నినుండియు
నీవు నన్ను విమోచింపుము.
మూర్ఖులు నన్ను గేలిచేయకుండునట్లు చేయుము.
9. నేను మూగవాడను మౌనము వహింతును.
నన్ను ఈ అగచాట్లపాలు చేసినది నీవే.
10. నీ దెబ్బలను నానుండి తొలగింపుము.
నీ చేతి దెబ్బలవలన నేను చనిపోవుచున్నాను.
11. నీవు నరుని పాపములకుగాను
అతనిని చీవాట్లు ప్టిె దండింతువు.
అతడు అభిమానించు వానినెల్ల
నీవు చిమ్మటవలె నాశనము చేయుదువు.
నరుడు ఊదినశ్వాసము వింవాడు.
12. ప్రభూ! నా ప్రార్థన వినుము.
నా మొరను ఆలింపుము.
నా కన్నీిని అనాదరము చేయకుము.
నేను నీకు అనతికాల అతిథివింవాడను,
మా పూర్వులందరివలెనే
నేనును స్థిరనివాసములేని పరదేశిని.
13. నీ కోపదృష్టిని నా నుండి ప్రక్కకు త్రిప్పుకొనుము.
అప్పుడు, నేను గతించి
శూన్యములో కలిసిపోకముందు
ఒకింత ఆనందమును అనుభవింతును.”