నిజమైన ఆరాధనము
ఆసాపు కీర్తన
50 1. దేవాధిదేవుడైన ప్రభువు
సంభాషించుచున్నాడు.
ఆయన తూర్పునుండి పడమరవరకు గల
విశ్వధాత్రిని పిలుచుచున్నాడు.
2. సౌందర్యనిధియైన సియోను పట్టణమునుండి
ఆయన వెలుగు ప్రకాశించుచున్నది.
3. మన ప్రభువు విచ్చేయును.
మౌనముగా నుండడు.
ఆయన ముందట సర్వమును
దహించు అగ్ని చూపట్టును.
ఆయన చుట్టును పెనుతుఫాను వీచుచుండును.
4. ఆయన తన ప్రజలకు తీర్పుచెప్పును.
ఆ తీర్పునకు భూమ్యాకాశములను
సాకక్షులుగా పిల్చును.
5. ”బలిఅర్పణపూర్వకముగా
నాతో నిబంధనము చేసికొనిన
నా పవిత్ర ప్రజను ప్రోగుచేయుడు” అని
ఆయన ఆదేశించును.
6. ప్రభువు న్యాయవంతుడనియు
ఆయనే స్వయముగా న్యాయము చెప్పుననియు
ఆకాశము చాటుచున్నది.
7. ”నా ప్రజలారా!
నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు.
యిస్రాయేలీయులారా!
నేను మీపై నేరము తెచ్చుచున్నాను.
నేను మీ దేవుడనైన ప్రభుడను.
8. మీరు అర్పించు బలులమీద
నేను తప్పులెన్నుటలేదు.
మీరు నిరంతరము
నాకు దహనబలులు అర్పించుచునే ఉన్నారు.
9. అయినను మీ కొట్టములనుండి ఎద్దులుగాని,
మీ మందలనుండి మేకపోతులుగాని
నాకు అక్కరలేదు.
10. వన్యమృగములు నావే.
వేలకొలది కొండలమీది పశువులును నావే.
11. ఆకాశమున ఎగురుపకక్షులన్నియు నావే.
పొలమున తిరుగాడు జంతువులన్నియు నావే.
12. నాకు ఆకలి వేసినచో నేను మీతో చెప్పను.
ఈ జగత్తును
దానిలోని సకలవస్తువులును నావేకదా?
13. నేను ఎడ్లమాంసము తిందునా?
మేకలనెత్తురు త్రాగుదునా?
14. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనెడు
బలిని అర్పింపుడు.
మహోన్నతునికి మీరు చేసికొనిన
మ్రొక్కుబడులను చెల్లింపుడు.
15. అటుపిమ్మట మీ ఆపదలలో మీరు
నాకు మొరపెట్టుడు.
నేను మీ ఇక్కట్టులు తొలగింతును.
మీరు నన్ను కీర్తింపవచ్చును”.
16. కాని దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును:
”మీరు నా ఆజ్ఞలను వల్లెవేయనేల?
నా నిబంధనమును గూర్చి మ్లాడనేల?
17. మీరు నా శిక్షణమును అనాదరము చేసి
నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారుగదా!
18. దొంగ కంటబడగనే
మీరు వానితో పొత్తు సేయుదురు.
వ్యభిచారులతో సాంగత్యము చేయుదురు.
19. మీరు సులువుగా ఇతరులను ఆడిపోసికొందురు.
మీ నాలుక కల్లలాడును.
20. మీరు మీ సోదరులను నిందించుటకుగాను,
మీ తల్లి కుమారుని మీదనే
తప్పులెన్నుటకుగాను సిద్ధముగానుందురు.
21. మీర్టికార్యములు చేసినను
నేను మౌనముగానుింని.
కనుక మీరు
నేనును మీ వింవాడనే అని యెంచితిరి.
కాని మీ ముందర వీటన్నిని ఉంచి
మిమ్ము గద్దించెదను.
22. నన్ను లెక్కచేయని ప్రజలారా!
ఈ విషయమునాలింపుడు,
లేదేని నేను మిమ్ము చీల్చివేసెదను.
అప్పుడు మిమ్మెవ్వడును రక్షింపలేడు.
23. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు
నన్ను గౌరవించును.
నీతిమార్గమున నడచువానిని నేను రక్షింతును.”