దుష్టుల బారినుండి రక్షింపుమని ప్రార్థన
ప్రధానగాయకునికి దావీదును చంపుటకు సౌలు పంపినవారు ఇంియొద్ద పొంచియున్నప్పుడు అల్‌తష్‌హెత్ అను రాగముమీద పాడదగిన దావీదు రచించిన అనుపదగీతము
59 1. ప్రభూ! శత్రువుల బారినుండి
నన్ను కాపాడుము.
నా మీదికి దుమికి వచ్చు వారినుండి
నన్ను రక్షింపుము.
2. దుష్టులనుండి నన్నాదుకొనుము.
నరహంతలనుండి నన్ను సంరక్షింపుము.
3. వారు నా ప్రాణములు తీయుటకు
పొంచియున్నారు.
నేన్టెి పాపముగాని, అపరాధముగాని
చేయకున్నను నిష్కారణముగా
బలాఢ్యులు ఏకమై నన్నెదిరించుచున్నారు.
4. నావలన ఎి్ట తప్పు లేకున్నను,
వారు నా మీదికి ఎత్తి వచ్చుటకు
సంసిద్ధులగుచున్నారు.
5. సర్వశక్తిమంతుడవును,
యిస్రాయేలు దేవుడవునైన ప్రభూ!
నీవు మేలుకొని, నన్నాదుకొనుము,
నా అగచాట్లు నీవే చూడుము.
నీవు మేలుకొని అన్యజాతులను శిక్షింపుము.
దుష్టులైన ద్రోహులను మన్నింపకుము.
6. వారు సాయంకాలము మరల వచ్చెదరు.
కుక్కలవలె మొరుగుచు నగరమున తిరుగాడెదరు.
7. వారి పలుకులు వినుము.
వారి నాలుకలు కత్తులవలెనున్నవి.
వారు ”మా మాటలెవరును వినరులే”
అని తలంచుచున్నారు.
8. కాని ప్రభూ! నీవు వారిని చూచి నవ్వుదువు.
నీవు అన్యజాతులనెల్ల అపహాసము చేయుదువు.
9. నాకు బలమును దయచేయు దేవా!
నేను నిన్నే నమ్ముకొింని,
నాకు రక్షణ దుర్గమవు నీవే.
10. నన్ను కృపతో చూచు దేవుడు
నా చెంతకు వచ్చునుగాక!
నేను నా శత్రువుల పతనమును
కన్నులార చూతునుగాక!
11. ప్రభూ! జనులు ఆ దుష్టులను విస్మరింపక
మునుపే నీవు వారిని సంహరింపుము.
మాకు రక్షాకవచమైన ప్రభూ!
నీ బలముతో వారిని చెల్లాచెదరుచేసి
నాశనము చేయుము.
12. వారి నోటనున్న దోషములు,
వారి పెదవుల మీది మాటలు
అన్నియు పాపపూరితములే.
వారు శాపములు పలుకుచున్నారు,
కల్లలాడుచున్నారు. కనుక వారు తమ
అహంకారమున తామే చిక్కుకొందురు గాక!
13. నీ కోపముతో వారిని నాశనము చేయుము,
సర్వనాశనము చేయుము.
అప్పుడు దేవుడు యాకోబును
పాలించుచున్నాడనియు లోకమంతిని
ఏలుచున్నాడనియు ఎల్లరును గ్రహింతురు.
14. శత్రువులు సాయంకాలము మరల వచ్చెదరు. కుక్కలవలె మొరుగుచు
నగరమున తిరుగాడుదురు.
15. తిండికొరకు ఎల్లయెడల తిరుగుదురు.
చాలినంత కూడు దొరకనిచో గొణగుదురు.
16. కాని నేను నీ బలమును ఉగ్గడింతును.
ప్రతి ఉదయము నీ కరుణను కీర్తించెదను.
నీవు నాకు రక్షణదుర్గముగా నుింవి.
నేను ఆపదలో చిక్కినపుడు నాకు ఆశ్రయమైతివి.
17. నాకు బలమును దయచేయు దేవా!
నేను నిన్ను సన్నుతించెదను.
నన్ను ప్రేమతో పోషించుదేవుడవు నీవే,
స్థిరమైన ప్రేమను చూపించు దేవుడవు నీవే