మూడవ భాగము 73-89

న్యాయమే గెలుచును

ఆసాపు కీర్తన

73 1.      దేవుడు యిస్రాయేలీయులకు మేలు చేసెను. అతడు విశుద్ధహృదయులకు మేలు చేసెను.

2-3. గర్వితులనుగాంచి అసూయ చెందుటవలనను,

               దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారని

               గ్రహించుటవలనను

               నేను ప్రలోభమున చిక్కుకొింని.

               నా పాదములు జారిపడిపోవుట 

               కొంచెములో తప్పినది.

4.           ఆ దుష్టులకు ఎి్ట బాధలును లేవయ్యెను.

               వారు ఆరోగ్యముతో పుష్టిగానుండిరి.

5.           ఇతర నరులవలె శ్రమలను అనుభవింపరైరి.

               ఇరుగుపొరుగువారివలె ఇక్కట్టులకు గురికారైరి.

6.           కావున వారు

               అహంకారమను హారమును ధరించిరి,

               హింస అను వస్త్రమును తాల్చిరి.

7.            బలిసిపోయి వారి కన్నులు ఉబ్బిపోవగా

               హృదయమును కుతంత్రములతో నింపుకొనిరి.

8.           ఇతరులను ఎగతాళిచేయుచు చెడుగా మ్లాడిరి.

               అహంకారముతో అన్యులను పీడింపనెంచిరి.

9.           ఆకాశమువైపు వారు ముఖము ఎత్తుదురు.

               వారి నాలుక భూసంచారము చేయును.

10.         కావున ప్రజలు ఆ దుర్మార్గుల వైపే తిరిగి

               వారిని పొగడుదురు.

               వారిలో ఏ దోషమును కనిపెట్టరైరి.

11.           ”దేవునికి మన సంగతులు ఎట్లు తెలియును?

               మహోన్నతునికి జ్ఞానము ఎట్లు అలవడును?”

               అని ఆ దుష్టుల వాదము.

12.          ఇదుగో! దుష్టులు ఇి్టవారు:

               వారు సంపన్నులైయున్నారు.

               రోజురోజునకు ఇంకను సంపన్నులగుచున్నారు.

13.          మరి నేను విశుద్ధుడనుగా

               జీవించుటవలన ఫలితమేమి?

               దుష్కార్యములు విడనాడుటవలన లాభమేమి?

14.          నేను దినమెల్ల శ్రమలతో వెతచెందితిని.

               ప్రతి ఉదయము శిక్షను అనుభవించితిని.

15.          ”నేనును ఆ దుష్టులవలె మాటలాడెదను”

               అని అనుకున్నచో నీ ప్రజలకు

               తప్పక ద్రోహము చేసియుండెడివాడను.

16.          కాని నేను ఈ సమస్యను అర్థము చేసికోజూచితిని.

               అది నాకు తలకెక్కదయ్యెను.

17.          నేను దేవుని పరిశుద్ధ ఆలయములోనికి పోయి,

               ధ్యానించినపుడే

               వారి అంతమునుగూర్చి గ్రహించితిని.

18.          నీవు వారిని కాలుజారి

               పడిపోవుతావులలో నిలిపితివి.

               వారికి వినాశము దాపురించునట్లు చేసితివి.

19.          ఆ దుష్టులు క్షణకాలములో నాశనమయ్యెదరు.

               ఘోరవినాశమున కూలి

               కింకి కన్పించకుండ పోయెదరు.

20.        నిద్రమేలుకొనినవాడు

               తాను కన్న కలను ప్టించుకోనట్లే   

               ప్రభూ! నీవు నిద్రలేచినపుడు

               వారిని ఏమాత్రము లక్ష ్యము చేయవు.

21.          నా హృదయము వ్యధతో నిండిపోయెను.

               నా అంతరంగము మిగులనొచ్చుకొనెను.

22.         నేను మందమతినై విషయము గ్రహింపనైతిని.

               నీ పట్ల పశువువలె ప్రవర్తించితిని.

23.         అయినను నేను నిరంతరము

               నీకు అంిపెట్టుకొనియుింని.

               నీవు నా కుడిచేతిని పట్టుకొని

               నన్ను నడిపించితివి.

24.         నీ ఉపదేశముతో నీవు నన్ను నడిపింతువు.

               కడకు నన్ను నీ తేజస్సులోనికి కొనిపోయెదవు.

25.         ఆకాశమున నీవుతప్ప నాకు ఇంకెవరున్నారు?

               ఈ భూమిమీద నీవుతప్ప

               మరి ఏమియు నేను కోరుకొనను.

26.        నా దేహమును, నా హృదయమును

               కృశించిపోవుచున్నవి.

               దేవుడే సదా నాకు ఆశ్రయశిల,

               నాకు వారసత్వభూమి.

27.         కావున నీనుండి దూరముగా

               వైదొలగువారు చత్తురు.

               నిన్ను త్యజించువారిని నీవు నాశనము చేయుదువు

28.        దేవునిచెంత ఉండుటే నాకు క్షేమకరము.

               నేను ప్రభువైన దేవుని ఆశ్రయించితిని.

               అతడు చేసిన కార్యములనెల్ల

               ప్రకటన చేయుదును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము