యిస్రాయేలు ఉద్ధరణము కొరకు ప్రార్థన

ప్రధానగాయకునికి 

షోషనీమ్‌యెదూత్‌ అనెడి రాగముమీద పాడదగిన

ఆసాపు కీర్తన

80 1.     యిస్రాయేలు కాపరీ!        మా మొర వినుము.

                              నీ యోసేపు ప్రజలను మందవలె

                              నడిపించిన నీవు

                              మా వేడుకోలును ఆలింపుము

2.           నీవు కెరూబులనుదూతలమీద

               ఆసీనుడవైయుండి ఎఫ్రాయీము,

               బెన్యామీను, మనష్షే తెగలమీద

               నీ వెలుగును ప్రసరింపచేయుము.

               నీ పరాక్రమమును చూపి

               మమ్ము రక్షించుటకు రమ్ము.

3.           దేవా! మమ్ము ఉద్ధరింపుము.

               నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని

               మేము రక్షణమును బడయుదుము.

4.           యావే! సైన్యములకధిపతియైన దేవా!

               నీవెంతకాలము కోపముతో

               నీ ప్రజల ప్రార్థనను నిరాకరింతువు?

5.           నీవు మా అశ్రువులే

               మాకు ఆహారము కావించితివి.

               చాలా కన్నీళ్ళే మాకు పానీయము కావించితివి.

6.           మా ఇరుగుపొరుగువారు

               మా దేశముకొరకు ప్లోాడుకొనునట్లును,

               మా విరోధులు

               మమ్ము అపహాస్యము చేయునట్లును చేసితివి.

7.            సైన్యములకధిపతియైన దేవా!

               మమ్ము ఉద్ధరింపుము.

               నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని

               మేము రక్షణమును బడయుదుము.

8.           ఐగుప్తునుండి నీవొక ద్రాక్షతీగను గొనివచ్చితివి.

               అన్యజాతులను వెళ్ళగ్టొి

               వారి దేశమున దానిని నాితివి.

9.           ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసితివి.

               అది వేరుపారి నేలయందు అంతట అల్లుకొనెను.

10.         దాని నీడ కొండలను కప్పెను.

               దాని కొమ్మలు ఉన్నతములైన

               దేవదారుల మీదికి ఎగబ్రాకెను.

11.           దాని తీగలు

               మధ్యధరా సముద్రమువరకు వ్యాపించెను.

               దాని రెమ్మలు యూఫ్రీసు నదివరకు సాగెను.

12.          దానిచుట్టునుగల గోడను

               నీవు ఏల పడగ్టొించితివి?

               ఇపుడు దారిన పోవువారు

               దాని పండ్లను అపహరింతురు.

13.          అడవిపందులు దానిని కాళ్ళతో త్రొక్కివేయును. వన్యమృగములు దానిని తినివేయును.

14.          సైన్యములకధిపతియైన దేవా! 

               నీవు మావైపు మొగము త్రిప్పుము.

               ఆకాశమునుండి మావైపు పారచూడుము.

               ఈ ద్రాక్షతీగయొద్దకు వచ్చి దీనిని కాపాడుము.

15.          నీవు స్వయముగా నాిన ఈ తీగను,

               నీవు బలసంపన్నుని చేసిన

               నీ ఈ పుత్రుని సంరక్షింపుము.

16.          మా శత్రువులు దానిని నరికి నిప్పులో పడవేసిరి.

               నీ ఆగ్రహమును వారిపై ప్రదర్శించి వారిని

               నాశనము చేయుము.

17.          నీ కుడిప్రక్కన ఉన్న వానిని కాపాడుము.

               నీవు బలాఢ్యుని చేసిన వానిని రక్షింపుము.

18.          మేము మరల నిన్ను విడనాడము.

               మమ్ము ప్రాణములతో బ్రతుకనిమ్ము,

               మేము నిన్ను స్తుతింతుము.

19.          యావే! సైన్యములకధిపతియైన దేవా!

               మమ్ము ఉద్ధరింపుము.

               నీ ముఖకాంతిని మామీద ప్రకాశింపజేసెదవేని

               మేము నీ రక్షణమును బడయుదుము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము