సియోనునగరము అన్నిజాతులకు తల్లి

కోర కుమారుల కీర్తన – గీతము

87 1.      పవిత్రపర్వతముమీద ప్రభువు

                              తన నగరమును నెలకొల్పెను.

2.           అతడు యాకోబు పట్టణములు

               అన్నికంటెను సియోను ద్వారములను

               ఎక్కువగా అభిమానించును.

3.           దైవనగరమా! ప్రభువు నీ మహత్తర

               కార్యములనుగూర్చి మ్లాడెను.

4.           ”ఐగుప్తును బబులోనియాను

               నన్ను పూజించు దేశములలో చేర్తును,

               పలానావ్యక్తి ఫిలిస్తీయాలోనో లేక తూరు లోనో

               లేక యితియోపియాలోనో పుట్టెనని

               జనులు చెప్పుకొందురు.

5.           సియోనును గూర్చి మ్లాడునపుడు మాత్రము

               ఎల్లజాతులును అచట ప్టుినవని చెప్పుకొందురు”

               సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును.

6.           ప్రభువు జాతుల జనాభా లెక్కలు వ్రాయించును.

               ”అతడు ప్రతివానిని సియోను పౌరుని” గనే

               గణించును.

7.            జనులు అచట నాట్యము చేయుచు

               పాటలు పాడుదురు.

               ”మా ఊటలకు ఆధారము నీవే” నని

               చెప్పుకొందురు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము