శోక గీతము

ప్రధానగాయకునికి

మహలత్‌ లయన్నోత్‌ అనెడి రాగముమీద పాడదగిన ఎజ్రెహీయుడైన హేమాను రచించిన ధ్యానకీర్తన,

కోర కుమారుల గీతము

88 1.     ప్రభూ! నాకు రక్షకుడవైన దేవా!

                              నేను నీకు పగలు మొరపెట్టుకొనుచున్నాను.

                              రేయి నీ సన్నిధిలోనికి వచ్చుచున్నాను.

2.           నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక!

               నీవు నా మొరను ఆలింపుము.

3.           నాకు పలుకీడులు దాపురించినవి.

               నేను మృత్యువువాత పడనున్నాను.

4.           నా పేరు మృతలోకమునకు పోవువారి

               జాబితాలోకి ఎక్కినది.

               నేను సహాయము లభించని వానివలెనైతిని.

5.           జనులు నన్ను విడనాడిరి,

               నేను మృతులలో కలిసిపోతిని.

               చచ్చి సమాధిచేరినవారిని

               నీవిక స్మరింపవు, ఆదరింపవు.

               నేను అి్టవాడనే అయితిని.

6.           నీవు నన్ను నడిగుంటలో పడవేసితివి.

               లోతైన చీకి కోనేిలో పడద్రోసితివి.

7.            నీ కోపము నన్ను అణగద్రొక్కినది.

               నీ క్రోధతరంగములు నన్ను ముంచివేసినవి.

8.           నీవు నా మిత్రులు నన్ను విడనాడునట్లు చేసితివి. వారు నన్ను అసహ్యించుకొనునట్లు చేసితివి.

               నేను ఈ చెరనుండి బయటపడలేను.

9.           శ్రమలవలన నా కించూపు మందగించినది.

               ప్రభూ! ప్రతి రోజు

               నేను నీకు మొరపెట్టుచునేయుింని.

               చేతులెత్తి నీకు ప్రార్థన చేయుచునేయుింని.

10.         నీవు మృతులకొరకు అద్భుతములు చేయుదువా?

               ప్రేతములు పైకి లేచి నిన్ను స్తుతించునా?

11.           సమాధిలో నీ కరుణనుగూర్చి ఎవడు మ్లాడును?    వినాశస్థలములో నీ విశ్వసనీయతను

               ఎవడు ఉగ్గడించును?

12.          చీకిలో నీ అద్భుతములను ఎవరు గుర్తింతురు?

               విస్మ ృతికి గురియైన పాతాళలోకమున

               నీ న్యాయమును ఎవరు తెలిసికొందురు?

13.          కాని ప్రభూ! నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను.

               ప్రతి ఉదయము నీకు ప్రార్థన చేయుచున్నాను.

14.          ప్రభూ! నీవు నన్ను నిరాకరింపనేల?

               నీ మొగమును నానుండి మరుగుచేసికోనేల?

15.          నేను బాల్యమునుండియు శ్రమలను

               అనుభవించి చావునకు సిద్ధమైనవాడను

               నేను నీ శిక్షలు అనుభవించి అలసిపోయితిని.

16.          నీ క్రోధము నన్ను కూల్చివేసినది.

               నీ దండనములు నన్ను నాశనము చేసినవి.

17.          నీ శిక్షాతరంగములు దినమెల్ల

               నన్ను చుట్టుమ్టుినవి.

               అవి నామీదికి పొంగిపొరలినవి.

18.          నీవు నా స్నేహితులను, పరిచితులను

               నానుండి దూరము చేసితివి.

               కడకు చీకి మాత్రమే నాకు చెలికాడయ్యెను.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము