దేవుని రక్షణము

91 1.       మహోన్నతుని మరుగున వసించువాడు,

                              సర్వశక్తిమంతుని రెక్కలనీడలో నివసించువాడు

2.           ప్రభువుతో ”నీవు నా ఆశ్రయమవు,

               నాకు రక్షణదుర్గమవు, నేను నమ్మిన దేవుడవు”

               అని చెప్పుకొనును.

3.           వేటకాని ఉరులనుండియు,

               ఘోరవ్యాధులనుండియు ఆయన నిన్ను కాపాడును

4.           ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును.

               ఆయన రెక్కలక్రింద నీవు తలదాచుకొందువు.

               ఆయన విశ్వసనీయత నీకు డాలుగను,

               రక్షణాయుధముగను ఉండును.

5.           నీవు రేయి కలుగు అపాయములకును,

               పగిపూట తగులు బాణములకును

               వెరవనక్కరలేదు.

6.           చీకిలో సోకు అంటురోగములకును,

               మిట్టమధ్యాహ్నము

               హానిచేయు వారికిని భయపడనక్కరలేదు.

7.            నీ దాపున వేయిమంది కూలినను,

               నీ కుడిప్రక్కన పదివేలమంది పడినను

               నీకు ఏ అపాయమును కలుగదు.

8.           నీ కన్నులతో నీవు దుష్టులు

               శిక్షను అనుభవించుటను చూతువు.

9.           నీవు ప్రభువును నీకు ఆశ్రయనీయునిగను

               మహోన్నతుని నీకు నివాస సదనముగను

               చేసికొింవి.

10.         నీకు ఎి్ట కీడును సంభవింపదు.

               నీ ఇంిచెంతకు ఎి్ట అంటురోగమును రాదు.

11.           ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును.

               నీవు ఎచికి వెళ్ళినను

               వారు నిన్ను కాపాడుచుందురు.

12.          నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు

               వారు నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొందురు.

13.          నీవు సింహమును,

               నాగుపామును కాలితో మట్టెదవు.

               కొదమసింగమును,

               కాలసర్పమును పాదములతో త్రొక్కెదవు.

14.          ”నన్ను ప్రేమించువారిని నేను రక్షించెదను.

               నా ప్రాభవమును

               అంగీకరించువారిని నేను కాపాడెదను.

15.          వారు నాకు మొరప్టిెనపుడు

               నేను వారికి ప్రత్యుత్తరమిత్తును.

               వారి ఆపదలలో వారిని ఆదుకొందును.

               వారిని విపత్తులనుండి కాపాడి

               వారికి కీర్తిని దయచేయుదును.

16.          వారిని దీర్ఘాయువుతో సంతృప్తిపరచెదను.

               వారికి నా రక్షణమును అనుగ్రహించెదను”

               అని ప్రభువు పలుకుచున్నాడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము