దేవుడు న్యాయమూర్తి
94 1. ప్రతీకారము చేయువాడవైన ప్రభూ!
ప్రతీకారము చేయువాడవైన ప్రభూ!
నీ తేజస్సును కన్పింపనిమ్ము.
2. లోకమునకు న్యాయాధిపతివైన దేవా!
నీవు పైకి లేచి గర్వాత్ములకు శాస్తిచేయుము.
3. ప్రభూ!
దుర్మార్గులు ఎంతకాలము ఆనందింతురు?
ఎంతకాలము ఆనందింతురు?
4. ఎంతకాలము గర్వముతో బింకములాడుచు,
తమ దుష్కార్యములను గూర్చి
ప్రగల్భములు పలుకుదురు?
5. ప్రభూ! వారు నీ జనులను అణగద్రొక్కుచున్నారు.
నీవు ఎన్నుకొనిన ప్రజలను పీడించుచున్నారు.
6. వితంతువులను మాతో వసించు
పరదేశులను చంపుచున్నారు.
అనాథబాలలను వధించుచున్నారు.
7. ”ప్రభువేమియు చూడడులే,
యిస్రాయేలు దేవుడేమియు గమనింపడులే”
అనుచున్నారు.
8. జనులారా!
మీరు పరమమూర్ఖులు, మందమతులు.
మీకు వివేకము ఎప్పుడు అలవడును?
9. చెవిని చేసినవాడు వినలేడా?
కింని కలిగించినవాడు కనలేడా?
10. అన్యజాతులను మందలించువాడు
వారిని శిక్షింపలేడా?
నరులకు బోధించువానికి జ్ఞానము లేదా?
11. ప్రజల ఆలోచనలు ప్రభువునకు తెలియును.
వారి తలపులు నిరర్థకమైనవని ఆయనెరుగును.
12. ప్రభూ! నీవు ఉపదేశముచేయు నరుడు ధన్యుడు.
నీవు ధర్మశాస్త్రము బోధించు జనుడు భాగ్యవంతుడు
13. కష్టకాలమున నీవు
అతనికి చిత్తశాంతిని అనుగ్రహింతువు.
దుష్టులు కూలుటకు మాత్రము గోతిని త్రవ్వుదువు
14. ప్రభువు తన జనులను చేయివిడువడు.
తాను ఎన్నుకొనిన ప్రజలను పరిత్యజింపడు.
15. సత్పురుషులు మరల నీతిని పాింతురు.
పుణ్యపురుషులెల్లరు
న్యాయమును అనుసరింతురు.
16. దుష్టులను ఎదిరించి
నా పక్షమున నిల్చినవాడెవడు?
దుర్మార్గులకు అడ్డువచ్చి
నన్ను సమర్థించినవాడెవడు?
17. ప్రభువు నన్ను ఆదుకొననిచో నా ప్రాణము
సత్వరమే మౌనలోకము చేరుకొనియుండెడిది.
18. ప్రభూ! ”నేను కాలుజారి పడిపోవుచున్నాను”
అని నీతో చెప్పినవెంటనే నీ కృప నన్ను రక్షించెను.
19. నేను విచారములలో చిక్కుకొనినచో
నీవు నన్ను ఓదార్చి సంతోషచిత్తుని చేయుదువు.
20-21. సత్పురుషులమీద కుట్రలుపన్ని,
నిర్దోషులకు మరణదండనము విధించి,
అన్యాయమును న్యాయముగా చలామణిచేయు
దుష్టన్యాయాధిపతులతో నాకు పొత్తులేదు.
22. కాని ప్రభువు నాకు కోట.
నా దేవుడు, నేను తలదాచుకొను
ఆశ్రయదుర్గము, ఆధారశిల.
23. దుష్టుల దుష్టత్వమునకుగాను
ప్రభువు వారిని శిక్షించును.
వారి పాపములకుగాను
వారిని నాశనము చేయును.
మన దేవుడైన ప్రభువు
వారిని తుడిచిపెట్టును.